చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చాలి

సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం

by చైతన్యరధం
August 4, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కోవిడ్ -19 తర్వాత భారీగా పెరిగిన కొనుగోలు
  • ఆసుపత్రుల్లో అక్సిజన్ సరఫరా, వినియోగంపై అధ్యయనం, సిఫారసులకు కమిటీ
  • పలు కారణాలతో రూ.105 కోట్లతో నిర్మితమై, నిరుపయోగంగా 161 పీఎసఏ ప్లాంట్లు
  • మరమ్మతులు, నిర్వహణకు భారీ వ్యయం
  • పీఎసఏ ప్లాంట్ల కొనసాగింపుపైనా నివేదిక ఇవ్వాలి
  • సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం

అమరావతి (చైతన్యరథం): కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం దాదాపు రూ.105 కోట్లతో నిర్మితమై నిరుపయోగంగా మారిన పీఎసఏ ( ప్రెషర్ స్వింగ్ అడ్సార్పషన్ ) ప్లాంట్లు, అధిక మోతాదులో ఎలఎంఓ (లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్) కొనుగోళ్ల విషయాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్‌లోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో రెండు గంటలపాటు లోతుగా సమీక్షించారు. ఎలఎంఓ కొనుగోళ్లకు సంబంధించి, వాస్తవ డిమాండ్, సరఫరా విషయాలపై రెండు వారాల్లో సమగ్రంగా ఆడిట్ నిర్వహించి, లోపాల గుర్తింపు, సవరణ చర్యలను చేపట్టి, ఆ మేరకు ఎనిమిది ప్రభుత్వాసుపత్రుల్లో రెండు నెలలపాటు అమలుపరిచి అక్టోబరు 15 లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని మంత్రి ఆదేశించారు. తద్వారా ఎలఎంఓ డిమాండ్, సరఫరాలోని వ్యత్యాసాన్ని గుర్తించి ఆక్సిజన్ కొనుగోలు ఖర్చును వీలైనంత వరకు కొవిడ్-19 పూర్వ స్థితికి తీసుకురావాలని మంత్రి స్పష్టంచేశారు.

భారీగా పెరిగిన ఆక్సిజన్ కొనుగోలు వ్యయం
కోవిడ్-19 తీవ్రంగా ఉన్న 2020-21, 2021-22 సంవత్సరాల్లో రూ.95.43 కోట్ల మేరకు బోధనాసుపత్రుల్లో ఎలఎంఓ కొనుగోలు చేశారు. కోవిడ్-19కు ముందు 2016-20 మధ్య కాలంలో (నాలుగేళ్లు) రూ.60.51 కోట్ల మేరకు వ్యయం చేశారు. కోవిడ్ అనంతరం 2022-26 మధ్య నాలుగేళ్ల కాలంలో ఎలఎంఓ కొనుగోలు వ్యయం రూ.180.82 కోట్లకు చేరిందని సమీక్షా సమావేశంలో మంత్రి గుర్తించారు. గత నాలుగేళ్లలో కొత్త బోధనాసుపత్రులు, కొత్త ఆసుపత్రులు ఉనికిలోకి రావడం, పడకలు పెరగడం పెరుగుదలకు కొంతమేరకు కారణమైనప్పటికీ అధికారులు వివరించిన ఆక్సిజన్ డిమాండ్, వాస్తవ సరఫరాకు మధ్య భారీ అంతరం కనిపిస్తోందని, దీనిపై లోతుగా పరిశీలించి కొనుగోలు వ్యయాన్ని తగ్గించే దిశగా అవకాశాలను పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. ఈ పరిశీలనకు అనంతపురం బోధనాసుపత్రి (సూపర్ స్పెషాలిటీతో సహా), గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం బోధనాసుపత్రులతోపాటు రెండు జిల్లా, రెండు ఏరియా ఆసుపత్రులను ఎంపిక చేశారు. ఆరోగ్య పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ‘పాత’ సంస్థ ఈ అధ్యయనాన్ని చేపడుతుంది.

పీఎసఏ ప్లాంట్లు ఉపయోగమా..నిర్థకమా
కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సాయంతో డీఎంఈ పరిధిలో 62 ఆసుపత్రుల్లో, సెకండరీ హెల్త్ పరిధిలో 100 (మొత్తం 162 ) పీఎసఏ ప్లాంట్లను ఏర్పాటుచేశారు. అయితే ఈ ప్లాంట్ల ద్వారా తయారయ్యే ఆక్సిజన్ ప్యూరిటీ (నాణ్యత), నిర్వహణా నియంత్రణకు సంబంధించి తగిన సాంకేతిక సిబ్బందిని నియమించకపోవడం, ఐసీయూ, సాధారణ వార్డులకు ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన నాణ్యతతో నిమిత్తం లేకుండా ఒకే పైపులైన్ వ్యవస్థ ఉండడంవంటి వివిధ కారణాలవల్ల 162 కు 161 పీఎసఏ ప్లాంట్లు నిరుపయోగంగా మారాయి. ఈ ప్లాంట్ల మరమ్మతులకు డీఎంఈ పరిధిలో రూ.6.20 కోట్లు, నిర్వహణకు ఏటా రూ.2.60 కోట్లు, డీఎస్‌హెచ్ పరిధిలో మరమ్మతులకు రూ.4.76 కోట్లు, నిర్వహణ కోసం ఏటా రూ 6.7 కోట్లు అవసరమవుతుందని మంత్రికి అధికారులు వివరించారు. ఈ మేరకు నిధులు ఖర్చుచేసిన ఈ పీఎసఏ ప్లాంట్లను పూర్తిస్థాయిలో వినియోగించవచ్చా? ఆర్థికంగా ఈ ఖర్చు సమర్థనీయమా? కాకుంటే ఈ నిరర్థక ప్లాంట్లను ఏంచేయాలన్న విషయాలపై కూడా నివేదిక తెప్పించాలని మంత్రి ఆదేశించారు. రాజస్థాన్ రాష్ట్రంలో పీఎసఏ ప్లాంట్ల పనితీరును కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

తక్షణ చర్యలకు మంత్రి ఆదేశం
కోవిడ్-19 నేపథ్యంలో భారీగా పెరిగిన ఎలఎంఓ కొనుగోలును వీలైనంతమేర తగ్గించేందుకు బోధనాసుపత్రుల్లో తక్షణ చర్యలు చేపట్టేలా చూడాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు ఆసుపత్రుల్లో ఎలఎంఓ నిల్వ, సరఫరాల్లో ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు సమాచారం ఉన్నందున ఈ విధమైన వృథాను తగ్గించేందుకు వెంటనే పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటుచేయాలని, ఆ మేరకు ఆసుపత్రులకు వెంటనే ఆదేశాలివ్వాలని అధికారులకు సూచించారు. వార్డుల స్థాయిలో, ఐసీయÖలో పడకల స్థాయిలో ఆక్సిజన్ సరఫరా, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని రికార్డు చేయాలని కూడా మంత్రి ఆదేశించారు. ఎలఎంఓ సరఫరా, వినియోగానికి సంబంధించి అధ్యయన కమిటీ నివేదిక అందిన వెంటనే మరో సమీక్ష నిర్వహించి అక్సిజన్ కొనుగోలు వాస్తవ డిమాండ్ మేరకే జరిగేలా స్పష్టమైన ఆదేశాలను మంత్రిత్వ శాఖ జారీచేస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్, డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్, ఏడీఎంఈ డాక్టర్ రాధికారెడ్డి, డీఎంఈ జాయింట్ డైరెక్టర్ గణపతిరావు, డీఎసఎచ్ జాయింట్ కమిషనర్ డాక్టర్ సుజాత, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Previous Post

అర్హులందరికీ ‘నేతన్న సేవలో’

Next Post

నైతిక విలువలతోనే విద్యా వికాసం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 27-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-11-2026

November 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026

November 26, 2026
కాకినాడ హార్బర్ కు సురక్షితంగా బోటు
ఆంధ్రప్రదేశ్

కాకినాడ హార్బర్ కు సురక్షితంగా బోటు

November 26, 2026
నిత్యావసరాల ధరల భారం ప్రజలపై పడకూడదు
ఆంధ్రప్రదేశ్

నిత్యావసరాల ధరల భారం ప్రజలపై పడకూడదు

November 26, 2026
‘మైటీడీపీ’ యాప్ సృష్టించిన సరికొత్త చరిత్ర
ఆంధ్రప్రదేశ్

‘మైటీడీపీ’ యాప్ సృష్టించిన సరికొత్త చరిత్ర

November 26, 2026
ఇసుక అక్రమ తవ్వకాలు.. పైప్లాన్ ధ్వంసంపై వివరణ కోరిన సీఎం
ఆంధ్రప్రదేశ్

ఇసుక అక్రమ తవ్వకాలు.. పైప్లాన్ ధ్వంసంపై వివరణ కోరిన సీఎం

November 26, 2026
Next Post
నైతిక విలువలతోనే విద్యా వికాసం

నైతిక విలువలతోనే విద్యా వికాసం

ముఖ్య వార్తలు

ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలతో మెరుగైన ఆదాయార్జన

ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలతో మెరుగైన ఆదాయార్జన

by చైతన్యరధం
November 26, 2026

గాడిలో పడుతున్న వ్యవస్థలు... 2027 మార్చి నాటికి 100శాతం ఫలితాలు సాధించేలా కృషి సావరిన్ ఏఐ స్టాక్ ద్వారా రెవెన్యూ రియలైజేషన్ ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం...

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

by చైతన్యరధం
November 25, 2026

సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...

ఐక్యతే మన బలం…

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి

by చైతన్యరధం
November 23, 2026

పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

by చైతన్యరధం
November 22, 2026

తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

by చైతన్యరధం
November 25, 2026

సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...

‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు

‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు

by చైతన్యరధం
November 6, 2026

1.43 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంట పొలాలు రాష్ట్రంలో తుఫాను నష్టంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించాలని ఆదేశం నేడు ముంపు...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 27-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 27-11-2026

by కార్యకర్త
November 27, 2026

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 26-11-2026

by కార్యకర్త
November 26, 2026

కాకినాడ హార్బర్ కు సురక్షితంగా బోటు

కాకినాడ హార్బర్ కు సురక్షితంగా బోటు

by చైతన్యరధం
November 26, 2026

క్షేమంగా ఏడుగురు ఏటిమొగ మత్స్యకారులు అధికారులు పనితీరు అభినందనీయం ఉప్పాడ మత్స్యకారుల ఆచూకీ కోసం కొనసాగుతున్న ముమ్మర గాలింపు చర్యలు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ రాశాం...

నిత్యావసరాల ధరల భారం ప్రజలపై పడకూడదు

నిత్యావసరాల ధరల భారం ప్రజలపై పడకూడదు

by చైతన్యరధం
November 26, 2026

500 కేంద్రాలకు ధరణి బియ్యం విక్రయాల విస్తరణ డిసెంబర్ నుంచి రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్ సరఫరా డిమాండ్ ఉన్న పంటల సాగుకు ప్రోత్సాహం నిత్యావసరాలు...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.