చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ పాలనలో పంచాయతీలు నిర్వీర్యం

మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

by చైతన్యరధం
Jul 3, 2024 at 6:46am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వైసీపీ పాలనలో పంచాయతీలు నిర్వీర్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గ్రామాల నుంచి నిధులు మళ్లింపు తప్పితే పైసా ఇచ్చింది లేదు
  • నిధులు, పథకాలు, రావాల్సిన వాటాలపై దృష్టి సారిస్తాం
  • జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులతో రాష్ట్రమంతటా తాగు నీరు అందిస్తాం
  • కాలుష్యరహిత పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం
  • మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

కాకినాడ: గత ప్రభుత్వ పాలనలో పంచాయతీలన్నీ నిధుల లేమితో అల్లాడాయి.. పంచాయతీలకు రావాల్సిన నిధులు సక్రమంగా రాకపోవడం ఒక ఎత్తయితే, ధర్మంగా పంచాయతీలకు చెందాల్సిన వాటాలను సైతం గత ప్రభుత్వం ఇవ్వలేదని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. గ్రామాల నుంచి నిధులు మళ్ళించారు తప్ప పైసా ఇచ్చింది లేదన్నారు. మరోపక్క పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధుల్ని కూడా దారి మళ్లించారు.. ఫలితంగా పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ కలెక్టరేట్‌ లో మంగళవారం జిల్లా అధికారులతో వివిధ శాఖలపై పవన్‌ కళ్యాణ్‌ సమీక్షలు జరిపారు. జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు సమీక్షలకు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటలపాటు తన పరిధిలోని శాఖలపై పవన్‌ విడివిడిగా సమీక్షించారు. సమీక్ష అనంతరం మీడియాతో పవన్‌ మాట్లాడుతూ పంచాయతీలకు వివిధ శాఖల నుంచి రావాల్సిన వాటాలను కూడా గత ఐదేళ్లుగా ఇవ్వలేదని చెప్పారు. ఇసుక సీనరేజీ, గనుల సీనరేజీ, రిజిస్ట్రేషన్‌ వాటాలు, లేబర్‌ పన్నుల వాటా అలాగే ఇతర శాఖల నుంచి కూడా పంచాయతీలకు చట్టపరంగా రావాల్సిన ఏ నిధులు కూడా గత పాలనలో అందలేదన్నారు. పంచాయతీ రాజ్‌పై సమీక్షలు చేస్తున్నప్పుడు అధికారులు చెబుతున్న మాటలు వింటే పాలనపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం చూసి వేదన కలుగుతుందన్నారు.

దీనిపై క్యాబినెట్‌ హై లెవెల్‌ కమిటీ ఏర్పాటు చేసి, పంచాయతీలకు రావల్సిన నిధులపై దృష్టి పెడతామన్నారు. పంచాయతీలకు నిధులు అందకపోతే పనులు చేసేందుకు అవకాశం ఉండదు. కొన్ని పంచాయతీలు కార్యాలయ నిర్వహణ కూడా భారంగా మారిన పరిస్థితులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం పంచాయతీలకు ఆయా పంచాయతీల్లోని జనాభాను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందించాలి. అలాగే వివిధ శాఖలువారిగా వాటాలను స్థానిక పంచాయతీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిధులతోపాటు కేంద్రం నిధులు, సాధారణ నిధులు కలిసి పంచాయతీలను అభివృద్ధి పథంలో నడుపుతాయి. గత వైసీపీ పాలనలో పంచాయతీలకు ఏ వైపు నుంచి నిధులు రాలేదు. ఫలితంగా గ్రామాభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. ప్రజల నుంచి ఎన్నికయిన వారికి కనీస అధికారాలను కూడా దూరం చేశారని పవన్‌ అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

కార్మికులకు లేబర్ అడ్డాలు

ఒక్క తూర్పు గోదావరి నుంచే ఇసుకపై ఏటా రూ. వెయ్యి కోట్ల ఆదాయం
గోదావరి తీర ప్రాంతం ఎక్కువగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక అమ్మకం ద్వారానే ఏటా రూ.వెయ్యి కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వస్తోంది. దీనిలో పంచాయతీలకు ఇసుక సీనరేజ్‌ వాటా ఇవ్వాలి. అది ఎక్కడా దక్కలేదు. రాష్ట్రంలో ఏ పంచాయతీకి కూడా రావాల్సిన వాటాలు అందలేదు. దీంతో మొత్తం వ్యవస్థ నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. అధికారులను దీనిపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయమని ఇప్పటికే ఆదేశించాను. పంచాయతీలకు ఏ శాఖ నుంచి ఏ తరహా వాటాలు అందాల్సి ఉంటుంది. వాటి వసూలు పక్కాగా జరగడానికి ఏం చేయాలి అన్న విషయాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. మొదట పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలి. ఆర్థికంగానూ ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే గ్రామాల్లో అనుకున్న పనులు జరుగుతాయి. దీని కోసం కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుంది. పంచాయతీలకు న్యాయబద్ధంగా అందాల్సిన నిధులు, వాటాలు తీసుకువచ్చేలా చూస్తాం. వైసీపీ హయాంలో గ్రామాల నుంచి సహజ సంపదలు దోచుకున్నారు తప్పితే పంచాయతీలకు రూపాయి విదల్చలేదని పవన్‌ విమర్శించారు.
జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులతో అన్ని గ్రామాలకూ రక్షిత మంచి నీరు
గత ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చే జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులకు మ్యాచింగ్‌ గ్రాంట్లు ఇవ్వలేదు. ఫలితంగా నిధులు ఆగిపోయాయి. జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులతో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ సురక్షిత మంచి నీరు అందించేందుకు అవసరం అయిన నిధులు ఉన్నాయి. నిధుల లభ్యత, మ్యాచింగ్‌ గ్రాంట్లకు ఎంత ఇవ్వాలి అనే విషయాలపై చర్చిస్తాం. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ రక్షిత తాగు నీరు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. దీనిపై ఓ ప్రణాళికతో ముందడుగు వేస్తాం. సమీక్షలు చేస్తున్నపుడు జల్‌ జీవన్‌ మిషన్‌ ను ఉపయోగించుకొని రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచి నీరు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై మరింత దృష్టి పెడతామని పవన్‌ చెప్పారు.

హోప్‌ ఐల్యాండ్‌… ఏకో టూరిజం పార్కుగా అభివృద్ధి
కాకినాడకు తలమానికంగా ఉన్న హోప్‌ ఐల్యాండ్‌ ను ఏకో టూరిజం పార్కుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇక్కడ అరుదైన జంతుజాలం ఉంది. వాటికి హాని కలగకుండా హోప్‌ ఐల్యాండ్‌ ను అభివృద్ధి చేస్తాం. పర్యాటక శాఖ సహాయంతో హోప్‌ ఐ ల్యాండ్‌ను అద్భుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. అలాగే కోరింగ ఏకో పార్కును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తయారు చేస్తాం. కాకినాడ స్మార్ట్‌ సిటీకి సంబంధించిన నిధులు, అభివృద్ధి పనులపై ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌ .. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడతారు. కాకినాడను అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తాం. స్మార్ట్‌ సిటీ నిధులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసి పనులు పూర్తయ్యేలా చూస్తాం. ప్రపంచీకరణ కారణంగా వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. వాతావరణంలో వచ్చే విపరీతమైన మార్పుల వల్ల ఏటా సముద్ర తీరం ముందుకు వస్తోంది.

ఉప్పాడలో ఏటా 20 అడుగుల మేర సముద్రం ముందుకు రావడం వాతావరణంలో కలుగుతున్న మార్పులకు సంకేతం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల కాలుష్యంపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించాం. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించే విధంగా చూడాలి. పరిశ్రమలు, కాలుష్యాన్ని తగ్గించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి తగు విధమైన సూచనలు చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాలలో కాలుష్యం అధికంగా ఉందని ప్రాథమిక నివేదిక వచ్చింది. పర్యావరణ శాఖపై పూర్తి స్తాయి దృష్టి సారిస్తాం. కాలుష్యం తగ్గించే పరిశ్రమలను ప్రోత్సహిస్తామని పవన్‌ తెలిపారు.

మడ అడవులను నాశనం చేసి ఇళ్ల పట్టాలు ఇచ్చారు
సముద్ర తీరాన్ని రక్షించే మడ అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యత. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మడ అడవుల్ని నరికేసి అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అలాగే హానికారకమైన మలేషియన్‌ బ్రీడ్‌ రకం కోనో కార్పస్‌ రకం మొక్కలను పచ్చదనం కోసం పెంచారు. వాటి తొలగింపుపై దృష్టి పెట్టి విడతలవారీగా తొలగిస్తాం. కాలుష్య నిబంధనలకు లోబడి పరిశ్రమలు ఎలా పని చేయాలి? పర్యావరణ పరిరక్షణలో పరిశ్రమలను ఎలా భాగస్వాముల్ని చేయాలనే దానిపై దృష్టి పెడతాం. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలో, అటవీ శాఖలో చాలా ఖాళీలు ఉన్నాయి. దీనిపై దృష్టిపెడతాం. ఎవరికీ అధిక పనిభారం ఉండకూడదన్నది నా అభిమతం. అయితే నిధులు, ఉద్యోగాల భర్తీని అనుసరించి వాటిని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తాం.

ముఖ్యంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలో పిల్లలకు భవిష్యత్తు ఇన్నోవేషన్స్‌ గురించి ప్రత్యేకంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని చెప్పాం. భావి శాస్త్రవేత్తలను తయారు చేయాల్సిన అవసరం ఉంది. రాజమండ్రిలో ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నాం.అలాగే కోతకు గురయిన ఉప్పాడ తీర ప్రాంతం పరిశీలనకు రేపు వెళ్తాను. దీని కోసం ప్రత్యేకంగా నిపుణుల బృందం కూడా రానుంది. చెన్నై నుంచి ప్రత్యేక నిపుణులు రానున్నారని పవన్‌ చెప్పారు.
ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ, ఎస్పీ ఎస్‌.సతీష్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

గంజాయి కేసుల్లో అసలైన దోషులను శిక్షిస్తాం

Next Post

సీఎం చంద్రబాబుతో బెల్జియం బృందం భేటీ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026

కార్యకర్త
@ May 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

కార్యకర్త
@ May 2, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist