న్యూఢల్లీ: రాష్ట్ర పునర్విభజన చట్టంలో మార్పులు చేయాలంటే, పార్లమెంటే చేయాలని.. కేంద్రానికి కూడా ఆ అధికారం లేదని నరసాపురం ఎంపీ, వైయర్ కాంస్సాగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణం రాజు తెలిపారు. మూడు రాజధానులు అంశం పై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం శిరసావహిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతి కి , తిరుపతిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మద్దతు ప్రకటించిన తర్వాత, ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా అమరావతి రైతులు తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్రను నిర్వహించాలని గత పది నెలల క్రితమే అమరావతి రైతులను బిజెపి నాయకుడు విష్ణుకుమార్ రాజు కోరారని ఈ సంద ర్భంగా రఘురామ కృష్ణంరాజు వెల్లడిరచారు.