- ఉద్యోగాల కోసం వలసలు పోకూడదు
- 5.9,320 ప్రాజెక్టులకు శ్రీకారం
- లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తాం
- ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
- త్వరలో గోల్డ్ ఫీల్డ్స్ అందుబాటులోకి తెస్తాం
- రెండోరోజు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- బస్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన
కుప్పం(చైతన్యరథం): అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పాని కి నాంది పలుకుతాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాయ లసీమలో రూ. లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రైవేటు రంగం వాటా రూ.60 వేల కోట్లు కాగా.. ప్రభుత్వం రూ.40 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు శనివారం ఆయన పర్యటించారు. రూ.117 కోట్లతో ఆధునాతన బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం ఇక్కడికి రావాలి. కుప్పం నుంచి మరోచోటుకు వెళ్లే పరిస్థితులు రాకూడదు. రూ.9,320 కోట్లతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారం భోత్సవాలు చేశాం. వ్యవసాయంలో సెరీ కల్చర్ దిశగా ముందుకు సాగుతున్నాం. కుప్పం నియోజకవర్గంలో పూర్తిగా వాణిజ్య పంటలు చేపట్టాలి. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. తాజా కూరగాయలు ఇంటిపైనే పండించుకునే ఏర్పాటు చేసుకోవాలి. స్కూటర్లు, కార్లు, ట్రాక్టర్లు అన్నీ విద్యుత్ నడిచే పరిస్థితులు రావా లి. పెట్రోల్, డీజిల్ బాయ్ కాట్ చేసి విద్యుత్ వాహనాలు వాడుదాం. రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్సులకు అవసరమైన విద్యుత్ సోలార్ ద్వారా ఆర్టీసీనే తయారు చేసుకుంటుంది.
వంద ల మంది పౌల్ట్రీ రైతులకు చేయూతనిస్తాం. నియోజకవర్గం నుంచి పారిశ్రా మికవేత్తలుగా మారేందుకు నాంది పలుకుదాం. ఆడిడాస్ పరిశ్రమ ద్వారా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తా యి. డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్, పార్టీ పరిశ్రమలు వచ్చాయి. 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి స్థాయికి కుప్పం చేరుతుంది. సంఘాల ద్వారా గడ్డి పెంచి కమ్యూనిటీ ఫోరమ్ల ద్వారా సరఫరా చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా మారిన ఆహారపు అలవాట్ల మేరకు పంటలు రావాలి. మైక్రో ఇరిగేషన్ రాష్ట్రానికి శ్రీరామరక్షగా మారింది. కృష్ణా, గోదావరి సహా ఏ రిజర్వాయర్లోకి ఇప్పటికీ నీరు రాలేదు. పర్యావరణం కాపాడుకున్న చోటే సమతుల్యం ఉంటుంది. ప్రపం చంలోని మెడికల్ నాలెడ్జ్ను ప్రజల ఇళ్ల వద్దకు చేర్చుతాం. స్వర్ణ కుప్పం కావాలనేది నా ఆకాంక్ష. స్వర్ణయుగానికి నాంది స్వర్ణ కుప్పం. కుప్పంలో కూడా బంగారు గనులు ఉన్నాయని చెబుతు న్నారు.. టెక్నాలజీని వినియోగిస్తాం.. త్వరలో కుప్పంలో గోల్డ్ ఫీల్డ్స్ అందుబాటులోకి తెస్తాం.. త్వరలో కుప్పంలో బంగారం ఉత్పత్తి చేసి స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతామని స్పష్టం చేశారు.















