- టీడీపీ అధినేత ఆరోగ్యంపై వాకబు
- భేటీలో నారా లోకేష్, నాదెండ్ల మనోహర్
- రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
అమరావతి, చైతన్యరథం: వైద్య సేవల కోసం హైదరాబాద్‌లో ఉన్న టీడీపీ అధి నేత ఎన్.చంద్రబాబునాయుడును జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం పరామర్శించారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ జూబ్లిహిల్స్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఆయన్ను కలిసి ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. పరామర్శ అనంతరం రాజకీయాలపై మాట్లాడుకున్నారు. ఈ భేటిలో టిడిపి జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్,కొద్దిమంది కీలకనేతలు కూడా పాల్గొన్నట్లు సమాచారం. దాదాపు మూడు గంటలపాటు భేటి సాగింది. ఈ భేటిలో రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. భవిష్యత్తు కా ర్యక్రమాలను ఎలాముందుకు తీసుకెళ్లాలి అనే అంశంతోపాటు సీఐడీ వరుసగా పెడు తున్న కేసుల విషయాలపై మాట్లాడుకున్నా రు. రెండు పక్షాలు కలిసి మేనిఫెస్టో విడుదల, క్షేత్ర స్థాయి పోరాటాల నిర్వహణపై కూడా చర్చించారు.ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టోను ప్రకటిం చింది. లోకేష్, పవన్ కళ్యాన్ భేటి అయిన నేపథ్యంలో మరికొన్ని హామీలను చేర్చాలనే ప్రతిపాదనలు వచ్చాయి. రెండు పార్టీలూ కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే ఈ అం శాలపై భేటిలో చర్చలుసాగినట్లు తెలిసిం ది. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితు లపై కూడా మాట్లాడుకున్నారు. బిజెపి వైఖ రిపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. బిజెపితో భవిష్యత్తు లో ఎలా కలిసి ముందుకెళ్లాలనే దానిపై చంద్రబాబుతో పవన్ కళ్యాన్ చర్చించినట్లు తెలుస్తోంది.
గత ఏడాది అక్టోబర్ 18వ తేదీన పవన్ కళ్యాన్‌తో చంద్రబాబు విజయవాడలోని నోవాటెల్ హోటల్లో భేటి అయ్యారు. విశాఖ సంఘటనల నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి సంఫీుభావం తెలి పారు. ఆ తర్వాత 2023 జనవరి 9వ తేదీ న హైదరాబాద్‌లో పవన్‌కళ్యాన్ వెళ్లి చంద్ర బాబును ఆయన నివాసంలో కలుసుకున్నా రు. వీరిద్దరూ రాష్ట్రంలో అరాచక వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేయాల్సిన పోరాటంపై చర్చించారు. ఆ తర్వాత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిన నేపథ్యంలో పవన్‌కళ్యాణ్ లోకేష్, బాలకృష్ణ లతో కలిసి వెళ్లి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అనంతరం బయట కు వచ్చి టీడీపీతో జనసేన పొత్తును అధి కారికంగా ప్రకటించారు. ఆ తర్వాత పొత్తు ను ముందుకు తీసుకెళ్లేందుకు రెండు పార్టీలూ రెండు కమిటీలను ప్రకటిం చాయి. ఈ కమిటీ సభ్యులు నారా లోకేష్, పవన్ కళ్యాన్ నేతృత్వంలో సెప్టెంబర్ 14వ తేదీన రాజమహేంద్రవరంలో ఒక హోటల్లో భేటి అయ్యారు. రెండు పార్టీలూ కలిసి వెళ్లాలని, ముందుగా జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు గత నెల 29 నుండి మూడు రోజుల పాటు జిల్లా స్తాయి సమన్వయ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం చంద్రబాబు బెరుల్‌పైన బయటకు వచ్చిన తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ టిడిపి అధినేతతో బేటి అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.