- జగన్‌రెడ్డిని నమ్మి మోసపోయిన వర్గాలన్నీ వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాయి
- జగన్‌రెడ్డిని నమ్మి మోసపోయిన వర్గాలన్నీ వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాయి
- బూతులు మాట్లాడే సొంతపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్‌రెడ్డి స్టార్ క్యాంపెయినర్లు కాదా?
- దుష్ప్రచారం చేసే సాక్షి మీడియా జగన్ ప్రధాన స్టార్ క్యాంపెయినర్ కాదా?
- జగన్ విసిరే చిల్లరకోసం పనిచేస్తున్న 150కి పైగా యూట్యూబ్ ఛానళ్లు వైసీపీ స్టార్ క్యాంపెయినర్లు కాదా?
అమరావతి: తెలుగుదేశం పార్టీకి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో కలిసి మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం చిరంజీవిరావు విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పక్క రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు.. తనకు అలాంటి వారు ఎవరూలేరని జగన్మోహన్ రెడ్డి ఉరవకొండ సభలో సన్నాయి నొక్కులు నొక్కాడని విమర్శించారు. టీడీపీకి దేశవ్యాప్తంగా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారంటే, ముఖ్యంగా ప్రజలు అండగా నిలవడానికి కారణం ఏమిటో ముఖ్యమంత్రే ఆలోచించుకోవాలని హితవు పలికారు.
దుష్ప్రచారం చేసే సాక్షి మీడియా ప్రధాన స్టార్ క్యాంపెయినర్ కాదా?
అన్నిరంగాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి పక్షాన స్టార్ క్యాంపెయినర్లుగా ఎవరైనా పనిచేస్తారా? వేరే పార్టీల్లో స్టార్ క్యాంపెయినర్లు ఏర్పడటానికి కారణం జగన్‌రెడ్డి విధానాలు.. అసమర్థ పాలనే. రోడ్లు బాగుంటే తెలంగాణ, దారుణంగా ఉంటే తెలంగాణ అన్న కేటీఆర్ వ్యాఖ్యలే జగన్‌రెడ్డి పాలనకు నిజమైన నిదర్శనాలు కావా? జగన్‌రెడ్డి పార్టీలో కూడా చాలామంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని వ్యంగ్యా స్త్రాలు సంధించారు. పోటీలు పడి బూతులు మాట్లాడే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులంతా జగన్‌రెడ్డి కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్న స్టార్ క్యాంపెయినర్లే కదా! మహానటుల్ని కూడా తలదన్నేలా నటించే వైసీపీ నేతలు జగన్‌రెడ్డి స్టార్‌క్యాంపెయినర్లు కాదా? జగన్‌రెడ్డి కోసం ఉన్నవి లేనట్టు..లేనివి ఉన్నట్టు వక్రీకరిస్తూ సినిమాలు తీస్తూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్న దర్శక, నిర్మాతలు స్టార్ క్యాంపెయినర్లు కాదా? వీరందరి కంటే మిన్నగా తప్పుడు రాతలు.. తప్పుడు కథనాలతో ప్రజ ల్ని నిత్యం మోసగిస్తూ, వారిని ఏమారుస్తున్న సాక్షి మీడి యా జగన్‌రెడ్డి అసలైన స్టార్ క్యాంపెయినర్ కాదా? జగన్ చెప్పిందే తమకు వేదవాక్కు అన్నట్టుగా పనిచేస్తు న్న 150కి పైగా యూట్యూబ్ ఛానళ్లు వైసీపీ స్టార్ క్యాం పెయినర్లు కాదా? లక్షలాది వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జగన్‌రెడ్డి స్టార్ క్యాంపెయినర్లు కాదా? రైతు లు భూములకు సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్త కాలపై తన బొమ్మ ముద్రించుకోవడం జగన్‌రెడ్డి చేసు ్తన్న స్టార్ క్యాంపెయినింగ్ కాదా? సర్వే రాళ్లపై, ఆడు దాం ఆంధ్రాక్రీడల కిట్లపై,చిన్నారులకు ఇచ్చే బ్యాగులు, పుస్తకాలపై తన బొమ్మలు వేసుకోవడం జగన్‌రెడ్డికి ఉన్న స్టార్ క్యాంపెయినింగ్ పిచ్చికాదా? ప్రభుత్వ భవ నాలు, పాఠశాలలపై వేలకోట్ల ప్రజల సొమ్ము తగలేసి మరీ తన పార్టీ రంగులు వేసుకోవడం, మహానుభావు డు, భారతరత్న అంబేద్కర్ పేరు తీసేసి విదేశీవిద్య పథకానికి తనపేరు పెట్టుకోవడం జగన్‌రెడ్డి స్టార్ క్యాం పెయినింగ్ పిచ్చికి నిదర్శనం కాదా? దివంగత ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ఆరోగ్య విశ్వ విద్యాలయానికి ఆయన పేరు తీసేసి, తన తండ్రి పేరు పెట్టుకోవడం జగన్‌రెడ్డి స్టార్ క్యాంపెయినింగ్లో భాగం కాదా అని చిరంజీవి రావు వ్యంగ్యంగా ప్రశ్నలు సంధించారు. సమయం, సందర్భం లేకుండా మహిళలు, చిన్నారులనే ఇంగితం లేకుండా వారి ఎదుట జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎలాంటి ప్రచారమో ముఖ్యమంత్రే చెప్పాలని నిలదీశారు.
ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అని చూస్తున్నారు
ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి, ఏటా డీఎస్సీ నిర్వ హించి యువతకు ఏటా ఉద్యోగాలు ఇస్తాను.. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న జగన్ మాట లు నమ్మి మోసపోయిన యువతే వచ్చే ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా స్టార్ క్యాంపెయినింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 6నెలల్లో ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభించినా, మంచి చేసినా అది నాయకుడి నిజమైన చిత్తశుద్ధి అన్న జగన్‌రెడ్డి… ఎన్ని కలకు 6నెలల ముందు గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం యువతను మోసగించడం కాదా? గ్రాడ్యుయే ట్ల ప్రతినిధిగా ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో సమాధానం చెప్పాలి. రివర్స్ పీఆర్సీతో వంచించిన జగన్‌రెడ్డి నిర్వా కంతో ప్రభుత్వ ఉద్యోగులంతా ముఖ్యమంత్రికి వ్యతి రేకంగా స్టార్ క్యాంపెయినింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైరైన వేలాది పింఛన్ దారులు కూడా వారిబాటలోనే నడవడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్‌రెడ్డి దోపిడీతో నాడు-నేడు పథకం అభాసుపాలైతే, ఎందరో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఉద్యోగాలు చేయలేక, పనిఒత్తిడి భరించలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. అలా మర ణించిన వారి కుటుంబాలతో పాటు, ఎందరో ఉపాధ్యా యులు కూడా జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా స్టార్ క్యాంపె యినింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫీజు రీయిం బర్స్మెంట్ పేరుతో జగన్‌రెడ్డి ఆడిన నాటకాలతో ఉన్నతవిద్యను కోల్పోయిన యువతకూడా ఈ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా స్టార్ క్యాంపెయినింగ్‌కు సిద్ధంగా ఉంది. లక్షా 25వేల మంది అంగన్వాడీ సిబ్బంది జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా స్టార్ క్యాంపెయినర్లుగా మారా రు. తన హయాంలో రోడ్లు కూడా వేయలేని జగన్ రెడ్డి అసమర్థత కారణంగా ప్రమాదాల బారిన పడిన ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టార్ క్యాంపెయి నింగ్ చేస్తామంటున్నారు.
జగన్‌రెడ్డి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు కూడా వైసీపీకి వ్యతిరేకంగా స్టార్ క్యాంపెయినింగ్ చేయడానికి రెడీ అయ్యారు. వీరందరి తోపాటు ప్రధానంగా జగన్‌రెడ్డి పాలనలో సర్వం కోల్పోయిన దళితులు, బీసీలు, మైనారిటీలు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకోసం స్టార్ క్యాంపె యినింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంద రికంటే ముందు జగన్‌రెడ్డి కల్తీ మద్యంతో సర్వం కోల్పోయిన మహిళలు వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు సాగనంపు దామా అని ఎదురుచూస్తున్నారని చింజీ విరావు స్పష్టం చేశారు. ప్రజలతో పాటు, మేధావులు, విద్యావంతులు, సమాజహితం కోరేవారు, రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారు రాష్ట్రం కోసం, మన బిడ్డల భవిష్యత్ కోసం ఎవరు నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తారో ఆలోచిం చాలని సూచించారు.