చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జనం భూములు జగన్‌ గుప్పిట్లో..!!

దర్శిలో అధినేత చంద్రబాబు ప్రజాగళం సభ

by చైతన్యరధం
May 6, 2024 at 6:02am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జనం భూములు జగన్‌ గుప్పిట్లో..!!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • భూహక్కు’తో ప్రజల ఆస్తులకు రక్షణ కరవు
  • పట్టాదార్‌ పుస్తకాలపై జగన్‌ బొమ్మ లేకిచేష్టలు
  • అధికారంలోకి రాగానే చట్టాన్ని రద్దు చేస్తాం
  • జగన్‌ శవరాజకీయాలకు అవ్వ తాతలు బలి
  • ఓటమి భయంతో జగన్‌ క్లాస్‌ వార్‌ అంటూ కబుర్లు
  • అక్కడ మోదీ గ్యారెంటీ.. ఇక్కడ కూటమి ష్యూరిటీ
  • దర్శి ప్రజాగళం సభలో చంద్రబాబు ధీమా..

దర్శి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ పేరిట జగన్‌ సర్కారు తీసుకొచ్చిన చట్టం ప్రయివేట్‌ ఆస్తులూ కొల్లగొట్టడానికేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భూములు, పట్టదారు పాస్‌ పుస్తకాల మీద జగన్‌ పెత్తనమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. పట్టాదారు పాస్‌ పుస్తకంపై యజమాని బొమ్మ ఉండాలిగానీ, జగన్‌ బొమ్మలేంటని నిలదీశారు. పాత చట్టాలను పక్కనపెట్టి కొత్త చట్టంతో మీ భూములన్నీ జగన్‌ స్వాధీనంలో ఉండేవిధంగా ఆన్‌లైన్‌లో భద్రపరుస్తారని ప్రజలకు వివరించారు. ఆ బాధ్యతను క్రిటికల్‌ రివర్‌ అనే ప్రయివేట్‌ కంపెనీకి అప్పగించారని అంటూ, చట్టం పూర్తిగా అమల్లోకి వస్తే మీ భూములు సైకో గుప్పిట్లో ఉన్నట్టేనన్నారు. ఆన్‌లైన్‌ రికార్డుల్ని మార్చేస్తే ఇక మీ భూములు గోవిందా అని చంద్రబాబు హెచ్చరించారు. భూములు అమ్ముకొవాలన్నా, రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నా టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ పర్మిషన్‌ ఉంటేనే సాధ్యమని, లేదంటే లేనట్టేనన్నారు. ఒకవిధంగా రాష్ట్రంలోకి ప్రైవేట్‌ ఆర్మీ రాబోతుందని అంటూ, చట్టం అక్టోబర్‌ 2023 నుంచి అమల్లోకి వచ్చేసిందని, అందరి మెడలకు ఉరితాళ్లు వేసి బటన్‌ను తనదగ్గర జగన్‌ పెట్టుకున్నాడన్నారు. భారత ప్రభుత్వ రికార్డుల్లో ఉండాల్సిన భూముల వివరాలు.. కాలిఫోర్నియాలోని జగన్‌ బినామీ క్రిటికల్‌ రివర్‌ సంస్థకు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ పాలనలో మీ భూమికి భద్రత ఉందా? చట్టాన్ని ప్రజలు ఆమోదిస్తారా? నల్లచట్టాన్ని చించి చెత్తబుట్టలో పారేద్దామా? వద్దా?అని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం దర్శిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు.

డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఖాయం
అటు కేంద్రం ఇటు రాష్ట్రంతో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఏపీలో రాబోతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని 2047కి నెంబర్‌ వన్‌ చేయాలనేది మోదీ సంకల్పమైతే, తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ చేయాలన్నదే కూటమి సంకల్పమన్నారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు బ్రాండ్‌ అని అంటూ, ఆయన్ను కాదని ఎర్రచందనం స్మగ్లర్‌ని సైడో తెచ్చాడన్నారు. సమర్థ నాయకుడి కడుపున పుట్టిన గొట్టిపాటి లక్ష్మి మంచి వైద్యురాలే కాదు, దక్షత కలిగిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారన్నారు. ఇద్దరు సమర్థులను గెలిపించుకుంటే దర్శి నియోజకవర్గం మంచి అభివృద్ధి సాధిస్తుందన్నారు. మీ ప్రాంతానికి ఎర్రచందనం స్మగ్లర్‌ను జగన్‌ అభ్యర్థిగా పెట్టాడని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తం కావాలన్నారు.

సంబంధితవార్తలు

1995 నాటి సీఎంను చూస్తారు

పింఛన్‌ @ 95 శాతం

యువనేత లోకేష్‌ ఇలాకాలో పెన్షన్ల పండుగకు శ్రీకారం!

జగన్‌ రక్తాన్ని పీలిస్తే కూటమి రక్తాన్నిస్తుంది
సంక్షేమానికి బడ్జెట్‌లో టీడీపీ 19.15 శాతం నిధులు పెడితే, జగన్‌ సర్కారు 15.8 శాతం మాత్రమే పెట్టిందన్నారు. చేయని పనికి గప్పాలు కొట్టుకోవడం తప్ప, జగన్‌ చేసిందేమీ లేదని చంద్రబాబు విమర్శించారు. చంద్రన్న బీమా, పెళ్లి కానుకలు, ఆదరణ కింద బీసీలకు ఆధునిక పనిముట్లు, రంజాన్‌ తోఫా, అన్న క్యాంటీన్‌, డ్రిప్‌ ఇరిగేషన్‌, ట్రాక్టర్ల మీద సబ్సిడీలు, విదేశీ విద్య, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు, చేనేత, మత్స్య కార్మికులకు రాయితీలు జగన్‌ ఇచ్చాడా? అని ప్రజలను ప్రశ్నించారు. ఎస్సీలకు 27 పథకాలు, బీసీలకు 30 పథకాలు, మైనారిటీలకు 10 పథకాలు పెడితే రద్దు చేసిన మూర్ఖుడు జగన్‌ అని దుయ్యబట్టారు. జగన్‌ జలగలా జనాల రక్తాన్ని పీలిస్తే కూటమి రక్తాన్ని ఎక్కిస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అవినాష్‌కి గొడ్డలిచ్చి రాష్ట్రం మీదకు వదిలారు
వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్‌ను పక్కనపెట్టుకుని తిరుగుతూ.. అవినాష్‌ చిన్న పిల్లాడని జగన్‌ కితాబు ఇవ్వడంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. అవినాష్‌ పిల్లాడైతే పలకా బలపం ఇచ్చి స్కూలుకు పంపాలని ఎద్దేవా చేస్తూ.. అవినాష్‌కు గొడ్డలి ఇచ్చి కడపమీదకు పంపావని జగన్‌పై ధ్వజమెత్తారు. శవరాజకీయాలు జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అంటూ.. అప్పుడు కోడికత్తి డ్రామా, ఇప్పుడు గులకరాయి డ్రామాతో జగన్‌ సింపతీ కోసం తాపత్రయపడుతున్నాడని ఆగ్రహించారు.

వృద్ధుల మరణాలపై జగన్‌ ఓట్లాట!
అవ్వతాతలకు ఇంటివద్దే పింఛను ఇచ్చే అవకాశం, అందుకు తగినంత అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ, పింఛను పంపిణీని జగన్‌ సర్కారు రాద్దాంతం చేసి వృద్ధుల ప్రాణాలు తీసిందని చంద్రబాబు తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. పేదలపై జగన్‌ కక్ష కారణంగా గత నెలలో 33మంది పింఛనుదారులు మరణిస్తే, ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగలేక ఏడుగురు పింఛనుదారులు మరణించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలను చంపి, విపక్షంపై నేరంమోపి, ముసలి మరణాలపై జగన్‌ ఎన్నికల లబ్దిపొందాలని చూస్తున్నాడన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల సహా అద్భుతమైన మేనిఫెస్టో కూటమి ఇచ్చిందని, దానిముందు వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోతోందని చంద్రబాబు అన్నారు. ఎన్నికలలో విజయం సాధించి అబద్ధాల కోరును భూస్థాపితం చేయాలన్నారు.

కూటమి వస్తే అదనపు సంక్షేమం
కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ పేదలకు అదనపు సంక్షేమం అందుతుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. లబ్దిదారులకు నెలకు రూ.4వేలు పింఛన్‌, దివ్యాంగులకు రూ.6వేలు, కాళ్లు చేతులు లేని వాళ్లకు రూ.15వేలు, తలసేమియా, కిడ్నీ రోగులకు రూ.10వేలు ఇస్తామన్నారు. సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్త్తూ చనిపోతే రూ.10 లక్షలు, రూ.25 లక్షలతో ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పారు. బీసీ డిక్లరేషన్‌ తెస్తామని, బీసీలు నా కుటుంబ సభ్యులంటూ, వారికి రూ.1.5 లక్షల కోట్ల బడ్జెట్‌ పెడతామన్నారు. ఆదరణకు రూ.5వేల కోట్లు, ఉపాధికి రూ.10వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు. దేవాలయాల్లో పని చేసే నాయి బ్రాహ్మణులకు నెలకు రూ.25వేలు, 200 యూనిట్ల కరెంట్‌ ఉచితంగా ఇస్తామన్నారు. డ్రైవర్లకు రూ.15వేలు ఇస్తాం. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని అంటూ.. పేదరికం లేని సమాజ నిర్మాణం తన లక్ష్యమని ప్రకటించారు.

దర్శిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
దర్శిలో ఇంటర్‌ నేషనల్‌ డ్రైవింగ్‌ స్కూళ్లును మళ్లీ తీసుకువస్తానని చంద్రబాబు ప్రకటించారు. దొనకొండలో పరిశ్రమలు పెడతాను. దర్శికి సాగునీటి ఎద్దడి లేకుండా చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తే.. జగన్‌ నాశనం చేశాడన్నారు. ప్రతి ఇంటికి సురక్షిత నీరిస్తానని, ఒక్క అడుగూ ముందుకుపడని తాళ్లూరు మొగిలిగుండాల రిజర్వాయర్‌ తాను వచ్చాక పూర్తి చేస్తానన్నారు. నడికుడి `కాళహస్తి రైల్వే వస్తే ఈ ప్రాంతంలో హైదరాబాద్‌, తిరుపతి పోవాలంటే దర్శి నుంచి నేరుగా వెళ్లొచ్చంటూ, దీనిని పూర్తి చేస్తానన్నారు. పెద్ద ఉయ్యాల వాడలో రాకపోకల కోసం మూసినదిపై వంతెన, బొట్లపాలెం దొర్నపు వాగుపై ఓవర్‌ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలన్నారు. రాగమక్కపల్లి వద్ద ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టు రూ.7 కోట్లతో ప్రారంభించిన పనులు ఆగిపోయాయి. చందోర వద్ద రూ.6 కోట్ల ఓవర్‌ బ్రిడ్జికి జగన్‌ అప్రోచ్‌ కూడా వేయలేదు. ఈ పనులన్నీ బాధ్యతగా నెరవేరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

బాబు చెప్పిన నవరత్నాలివీ!
జగన్‌ నవరత్నాల మీద చంద్రబాబు ఛలోక్తులు పేల్చారు. దర్శిలో నిర్వహించిన ప్రజాగళం సభలో జగన్‌ నవరత్నాలకు చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు. 1. ఇసుక మాఫియా, 2. జే బ్రాండ్‌ మద్యం, 3. భూ మాఫియా, 4. మైనింగ్‌ మాఫియా, 5. హత్యా రాజకీయాలు, 6. ప్రజల ఆస్తుల కబ్జా, 7. ఎర్ర చందనం, గంజాయి, 8. దాడులు, అక్రమ కేసులు, 9. శవ రాజకీయాలు. ఇవీ జగన్‌ అమలు చేసే దారుణ నవరత్నాలంటూ చంద్రబాబు విసిరిన ఛలోక్తికి సభికుల నుంచి ఉత్సాహవంతమైన స్పందన వచ్చింది. అలాగే, ప్రజల పట్టాదారు పుస్తకాలపై జగన్‌ బొమ్మలేంటని ప్రశ్నించి చంద్రబాబు, జగన్‌ బొమ్మలున్న పట్టాదారు పాసు పుస్తకాన్ని చించిపారేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ప్రభుత్వం ప్రచురించిన గెజిట్‌ ప్రతులను చించేసి, అధికారంలోకి రాగానే చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.

Tags: అధినేత నారా చంద్రబాబు నాయుడుఎన్డీఏ అభ్యర్ధులుఎన్నికల హామీలుచంద్రబాబు నాయుడుసజగన్ రెడ్డి మోసాలుదర్శి నియోజకవర్గందర్శి ప్రజాగళంప్రజాగళం సభ
Previous Post

జగన్‌రెడ్డిది దాడులు, దోపిడీల ప్రభుత్వం

Next Post

మేం వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి, జైళ్లలోనైనా ఉండాలి!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
ఇదీ.. బిట్స్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్

ఇదీ.. బిట్స్ ప్లాన్!

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist