• వెంకటగిరి నియోజకవర్గం పిగిలాం గ్రామ ఎస్సీ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామం ఎస్సీ కాలనీలో 2వేల మంది జనాభా ఉన్నారు.
• మాకు ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించి, రక్షిత నీరు అందించాలి.
• ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అంకిశెట్టిగుంట చెరువుకు మరమ్మతులు చేయించాలి.
• గ్రామంలో దళితులకు 30 పక్కా ఇళ్లు అందించాల్సి ఉంది.
• మా కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలి.
• దళితులకు రాజకీయ ప్రాధాన్యతనిచ్చి నామినేటెడ్ పదవులు కేటాయించాలి.
• ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎస్సీలకు మాత్రమే ఖర్చు పెట్టాలి.
• గత పాలనలో ఎస్సీలకు సబ్సిడీ లోన్లు వచ్చేవి. నేడు రావడం లేదు.
• ఎస్సీలకు సబ్సిడీ లోన్ ద్వారా గొర్రెలు, గేదెలు అందించాలి.
• చర్మకారులకు మీరు అధికారంలోకి వచ్చాక లోన్లు అందించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డికి దళితుల ఓట్లపై తప్ప వారి సంక్షేమంపై శ్రద్ధలేదు.
• వైసిపి అధికారంలోకి వచ్చాక రూ.28,147 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని ద్రోహం చేశారు.
• గత ప్రభుత్వంలో ఎస్సీలకోసం అమలుచేసిన 27 దళిత సంక్షేమ పథకాలను రద్దు చేశాడు.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ కార్పొరేషన్ ను బలోపేతం చేసి స్వయం ఉపాధి రుణాలు అందజేస్తాం.
• అర్హులైన దళితులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.
• ఎస్సీ కాలనీలో సీసీరోడ్లు, వీధిలైట్లు, కరెంటు లైన్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
• మీకోసం పనిచేసే చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు సహకరించండి.