• పొదిలి 4వవార్డు ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• వర్షాలు లేని సమయంలో కనీసం మాకు సాగు,తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.
• పనులకోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
• పొదిలి పట్టణానికి వెలుగొండ ప్రాజెక్టు నికరజలాలు కేటాయించాలి.
• పొదిలిలోని ముస్లిం మైనారిటీలకు రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటుచేయాలి.
• దుల్హాన్ పథకానికి చదువుతో లింకుపెట్టడంతో పేదలకు అందడంలేదు, విద్యార్హతతో సంబంధం లేకుండా పేద ముస్లింలందరికీ ఈ పథకం వర్తింపజేయాలి.
• పొదిలిలో గతప్రభుత్వంలో మంజూరుచేసిన షాదీఖానా పనులు వైసిపి ప్రభుత్వం వచ్చాక నిలిపివేశారు, మీరు అధికారంలోకి వచ్చాక షాదీఖానా నిర్మాణం పూర్తిచేయాలి.
• పొదిలి పట్టణంలో దాదాపు 3 కి.మీ.మేర ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందిగా ఉంది.
• గత ప్రభుత్వంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి సర్వే కూడా పూర్తయింది. మీరు వచ్చాక బైపాస్ రోడ్డు నిర్మించాలి.
• వైసిపి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పునరుద్దరించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వలేని దివాలాకోరు ముఖ్యమంత్రి సంక్షేమానికి లక్షలకోట్లు వెచ్చిస్తున్నానని నమ్మబలుకుతున్నాడు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక పొదిలి పట్టణానికి వెలుగొండ నీళ్లుతెచ్చి, ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం.
• పొదిలిలో నిలచిపోయిన షాదీఖానా పూర్తిచేస్తాం, విద్యార్హతలతో సంబంధం లేకుండా గతంలో మాదిరి పేద ముస్లింలందరికీ దుల్హాన్ పథకాన్ని అమలుచేస్తాం.
• పొదిలి పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ కష్టాలు తొలగిస్తాం.
• ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పొరేషన్లను బలోపేతం చేసి సబ్సిడీ రుణాలను అందజేస్తాం.