మంగళగిరి(చైతన్యరథం): టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మేడే పోస్టర్‌ను ఆవిష్కరించారు. మొగల్రాజపురం సిద్ధార్ధ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించే కార్మిక దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసం శెట్టి సుభాష్, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు సుబ్బారావు, ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సం క్షేమానికి, కార్మికుల శ్రేయస్సుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత పాలన లో కార్మికులు కడుపునిండా తిండి కూడా తినలేని దుస్థితి ఉండేదని.. నేడు వారి భద్రత, జీవనాన్ని మెరుగుపరిచేందుకు, సాధికారత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతినిత్యం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.