- డోలి మోత గ్రామాల్లో సమస్య నివారణకు చర్యలు
- వసతిగృహాల్లో ఆహార మెనూలో మార్పులు తీసుకొస్తాం
- మహిళా శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి
- పాచిపెంటలో అదనపు వసతి భవనం ప్రారంభం
పాచిపెంట`పార్వతీపురం మన్యం(చైతన్యరథం): డోలి మోతలు గల గ్రామాలకు రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పాచిపెంటలో రూ.1.75 కోట్లతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డోలి మోతలు గల గ్రామాలకు రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చి డోలి సమస్య నివారణకు చర్యలు చేపడుతు న్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో రెండు వేల రహదారుల నిర్మాణానికి రూ. 2,500 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. గిరిజన గ్రామాల్లో డోలి మోతలు నివారణకు గిరి వైద్య ఆరోగ్య కేంద్రాలు (కంటైనర్ ఆసుపత్రులు) ఏర్పాటు చేశామని తెలిపారు. అదనపు వసతి అవసరమైన ఆశ్రమ పాఠశాలల్లో నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో శీతాకా లంలో చలి తీవ్రత నుంచి దూరంగా ఉండేందుకు పక్కా భవనాలు దోహదం చేస్తాయని వివరించారు.
మరుగుదొడ్ల నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలి
వసతిగృహాల్లో విద్యార్థుల ఆహార మెనూలో మార్పులు తీసుకువస్తున్నట్లు మంత్రి చెప్పారు. కొత్త ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్లు, బెడ్ షీట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. పాచిపెంట గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కుమారి అనే విద్యార్థి మంత్రి రాకపై కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ వసతిగృహంలో 370 మంది విద్యార్థులకు తగిన మరుగుదొడ్లు లేవని, అదనంగా మరుగుదొడ్లు నిర్మిం చాలని కోరగా అంచనాలు తక్షణం తయారు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కార్య నిర్వహక ఇంజనీర్‌ను ఆదేశించారు. రహదారి పక్కన ఆశ్రమ పాఠశాల ఉన్నందున ప్రహరీ గోడకు పైభాగంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులు థింసా, పిరమిడ్స్, ఆసనాలు, సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించి అల రించారు. విద్యార్థులతో కలిసి మంత్రి థింసా నృత్యం చేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీ రింగ్ అధికారి ఎ.మణిరాజ్, తహసీల్దార్ డి.రవి, సహాయ గిరిజన సంక్షేమ అధికారి కె.శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు తదిత రులు పాల్గొన్నారు.