- వైసీపీకి ఓటు వేస్తే చెరుకు యంత్రంలో చెయ్యిపెట్టినట్లే!
- రాష్ట్రాన్ని గంజాయి వ్యాపారంలో నెం.1 చేసిన జగన్
- టీడీపీ విజయనగరం పార్లమెంటు అధ్యక్షుడు కిమిడి నాగార్జున
అమరావతి: దశాబ్దాల తరబడి పోరాడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేస్తే విశాఖను ఉద్దరించినట్లా అని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటు అధ్యక్షులు కిమిడి నాగార్జున ప్రశ్నించా రు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యా లయం ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖను అభివృద్ధి చేస్తామని వైసీపీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటు. వారు ఏం చేస్తున్నారు? స్టీల్ ప్లాంటు గురించి ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ళలో రైల్వేజోన్ గురించి ఏనాడైనా కేంద్రంతో పోరాడారా?. విజయసాయిరెడ్డి రైల్వేజోన్ రేపొచ్చిద్ది, మాపొచ్చుద్ది అంటూ కాలం గడిపేస్తున్నా రు. విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు విజన్ తో అభివృద్ధి చేశారు. కాస్మోపాలిటన్ సిటీగా మార్చి, ఐటీ, ఫైనాన్స్ ఇండస్ట్రీలను తీసుకువావలనే విజన్‌తో ముందుకు సాగారు. విశాఖను ఫిన్ టెక్ వ్యాలీగా మార్చేందుకు కృషిచేశారు. మిలీనియం టవర్స్ ఏర్పా టు చేసి వేలాది మందికి ఐటీ ఉద్యోగ అవకాశాలు కల్పించి సాఫ్ట్వేర్ రంగానికి హబ్‌గా మార్చారు. జగన్ రెడ్డి పరిపాలనా విధానం చూసి ఆ కంపెనీలన్నీ మూసుకొని వెనక్కి వెళిపోయే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశారా? వెనక్కి నెట్టారా? అనేదే వైసీపీ నేతలే సమాధానం చెప్పాలి. జగన్‌రెడ్డి పాలనలో ఒక పరిశ్రమని తీసుకురాలేదు. ఒక ఉద్యో గం ఇవ్వలేదు. రైతులని ఆదుకున్నది లేదు.
తిరుగుబాటు మొదలవడంతో తెరపైకి 3 రాజధానులు
ప్రజల్లో తిరుగుబాటు మొదలవడంతో వైసీపీ నాయకులు మూడు రాజధానులనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. రాజధానిని మూడు ముక్కలు కింద విడతీసి అందులో ఒక ముక్కని విశాఖపట్నానికి ఇస్తే ఉత్తారాంధ్రకి ఏదో జరిగిపోతుందని ఉత్తారాంధ్ర నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారు. జగన్‌రెడ్డి మూడున్నేరళ్ల పాలన లో ఉత్తరాంధ్రని ఏమైనా అభివృద్ధి చేశారా? ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదు.విశాఖ, విజయనగం, శ్రీకాకు ళంలకు చేసిందెంటో ప్రజల ముందుకొచ్చి చెప్పగల రా? ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక్క ఇటుకైనా పేర్చిన పాపాన పోలేదు. శ్రీకాకుళం నుంచి భీమిలి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే టూరిజం బాగా అభివృద్ధి చెందుతుంది. అరకు ప్రాంతాన్ని ఎంతో డెవలప్ చేయోచ్చు. ఆ ఆలోచనే చేసింది లేదు.
అభివృద్ధి అక్కడే ఆగిపోయింది
విశాఖపట్నం 2019లో టీడీపీ చేసిన అభివృద్ధి దగ్గరే ఆగిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి ఎందుకు ఆగిపోయింది. విజయనగరంలో తోటపల్లి కాల్వ చాలా ముఖ్యమైనది. రైతులని ఆదుకునే ప్రాజెక్ట్. 2015లో చంద్రబాబు దాన్ని ప్రారంభించా రు. టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు మంత్రులం దరూ కాలవలకు నీరు చేరడం, చెరువులు నిండడం, ప్రాజెక్ట్ నిర్వహణ వంటి అంశాలను సమీక్షిస్తూ పర్య వేక్షించే వారు. మూడున్నరేళ్లలో బొత్స తోటపల్లి కాల్వ గురించి ఏనాడైనా సమీక్షించారా? వర్షాలు బాగా కురుస్తున్నా కాల్వ సరిగా ప్రవహించని దుస్థితి. కాల్వలో పిచ్చిమొక్కలు పెరగడంతో నీరు చివరి వర కు పారడం లేదు. చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండ లాల్లోని పొలాలకు నీరందని పరిస్థితి నెలకొందని రైతాంగం కనీళ్లు పెట్టుకుంటుంటే బొత్స ఏం చేస్తు న్నారు?. నీటిని నియంత్రించేందుకు లష్కర్లని రూ.8,000/- లు ఇచ్చి నియమించ లేకపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం, ఉత్తా రాంధ్రలో భూకబ్జాలు పెరిగిపోయాయి. విశాఖపట్నం నుంచి దేశం మొత్తానికి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెం.1 గా ఉంచాలనుకుంటే, జగన్ రెడ్డి గంజాయి అక్రమ రవాణాలో నెం.1గా మార్చారు. ప్రజలు వైసీపీకి ఓటు వేస్తే చెరుకు రసం మిషన్‌లో చేయి పెట్టినట్లేనని కిమిడి నాగార్జున హెచ్చరించారు.