కోట్ల రూపాయలమేర ఆర్ధిక నేరాలు. పదుల సంఖ్యలో సీబీఐ, ఈడీ కేసులు. ఏళ్ల తరబడి సాగుతోన్న వాయిదాలు. న్యాయస్థానాల పిలుపును నిర్లక్ష్యం చేస్తూ… లొసుగులతో చట్టంనుంచి తప్పించుకుంటూ.. పబ్లిక్‌లో సుమతీ శతకాలు వల్లిస్తున్న నిలువెత్తు నేరగాడి పేరు `జగన్! అలాంటి వ్యక్తి విలువలు, విశ్వసనీయతల గురించి పచ్చిగా మాట్లాడుతుంటే `ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటోంది. కుట్రలు, కుతంత్రాలతో రగిలిపోయేవాళ్లకు లోకమంతా అదే తీరున కనిపిస్తుందని చెప్పడానికి నిలువుటద్దం కూడా `జగనే! నిజం చెబితే తల వెయ్యి వక్కలవుతుందన్న శాపం జగన్‌రెడ్డికి ఉన్నట్టుంది. అందుకే `పచ్చి అబద్ధాలే పార్టీ సిద్ధాంతం చేసుకున్న జగన్‌రెడ్డి.. కంటిముందున్న వాస్తవాలను గ్రహించలేకపోతున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రగతిరథ చక్రాలపై పరుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్‌రెడ్డి అసమర్థ నిజ స్వరూపాన్ని గ్రహించి ఏ రాష్ట్ర ప్రజలు తరిమికొట్టారో.. అదే రాష్ట్ర ప్రజలను మరోసారి దగా చేసేందుకు `విలువలు, విశ్వసనీయత ముసుగులో అసత్యాలను ప్రచారం చేయడం జగన్‌కే చెల్లింది!
ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోవడంతో తాను పేటెంటు పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్ధపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నాడు. ఐదేళ్ల చీకటి పాలన పోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడిరది. నాటి అరాచకపు ఆనవాళ్లను కూకటివేళ్లతో పెకలించివేస్తోంది. కానీ వాస్తవాన్ని అంగీకరించలేని జగన్‌రెడ్డి ప్రజా తీర్పునకు విరుద్ధంగా లేని లక్షణాలు ఉన్నట్టు కలరింగ్ ఇస్తూ తన దుష్ట లక్షణాలను ఇతరులకు అంటగడుతూ పైశాచికానందం పొందుతున్నాడు. శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు చెరమగీతం పలికినా అర్ధం చేసుకోకపోతే ఎలా జగన్ రెడ్డీ? బెంగుళూరు యలహంక ప్యాలెస్‌లో కూర్చుని అప్పుడప్పుడు టూరిస్ట్‌గా రాష్ట్రానికి వచ్చిపోయే నువ్వు సుమతీ శతకాలు, నీతి ముక్తావళి చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. నీ అబద్ధాల ఉపన్యాసాలు వినడానికి రాజకీయ విన్యాసాలు చూడటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు.
హామీల అమలుపై పచ్చి అబద్ధాల చెప్పిందెవరు జగన్‌రెడ్డీ?
85 శాతం హామీలు విస్మరించి 99 శాతం హామీలు అమలు చేశానని చెప్పుకోవడం అబద్ధం కాదా జగన్‌రెడ్డీ? బాబాయ్‌ని చంపి నారాసురచరిత్ర అని రాయించావ్. గాలి జనార్ధన్ రెడ్డి ఎవరో తెలీదన్నావ్. ప్రతిపక్షంలో ఉండగా అమరావతే రాజధాని అని అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో మాటమార్చావ్. 2.3 లక్షల ఉద్యోగాల భర్తీపై మాట తప్పావ్. అమ్మఒడి కింద రూ.15 వేలు హామీ ఇచ్చి రూ.13 వేలు చేతిలో పెట్టి మోసం చేశావ్. ప్రత్యేకహోదాపై మడమ తిప్పావ్. పీఆర్సీ 43శాతం నుండి 23 శాతానికి కుదించి, సీపీఎస్ హామీపై మడమ తిప్పావ్. జాబ్ క్యాలెండర్ పేరుతో అబద్ధాలు చెప్పి యువత భవిత ప్రశ్నార్థకం చేశావ్. ఇవన్నీ అబద్ధాలు, మోసాలు కాదా?
విలువలు, విశ్వసనీయతకు పాతరేసిన జగన్ రెడ్డి
విలువలు, విశ్వసనీయ గురించి జగన్‌రెడ్డి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. తల్లీ, చెల్లి విశ్వాసం కోల్పోయిన జగన్ రెడ్డికి విశ్వసనీయత ఎక్కడుంది? నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన ఒక్కరైనా నేడు నీతో కలిసి నడవకపోవడం నీ విశ్వసనీయత ఏపాటిదో తెలిపడానికి నిదర్శనం కాదా? మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అదే మద్యంతో వ్యాపారం చేశావు. విష పూరిత మద్యంపోసి 35 వేలమంది బలహీన వర్గాల ఆడబిడ్డల తాళి తెంచావు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పులు చేశావు. ఇలాంటి ఘోరాలు విశ్వాస ఘాతుకం కాదా? రాజకీయ ప్రయోజనం కోసం కోడి కత్తి డ్రామా ఆడి దళితుడి జీవితాన్ని ఐదేళ్లు జైలు పాల్జేసిన నువ్వు విశ్వసనీయ గురించి మాట్లాడటమా? దళిత డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును వెనకేసుకురావడం, ఓట్లేసిన దళితులను మోసం చేయడం విశ్వాస ఘాతుకం కాదా? గులకరాయి డ్రామాతో మైనర్ బీసీ బాలుడిని జైలు పాల్జేయడం ఏ విలువల కిందకివస్తుంది జగన్ రెడ్డీ? నీకు విలువలే ఉంటే 11 ఏళ్ల నుంచి కోర్టు విచారణకు ఎందుకు హాజరుకావడంలేదు? వాయిదాల మీద వాయిదాలు ఎందుకు తీసుకుంటున్నావు. నేరాలు చేసి మళ్లీ వాటిని ఇతరులపైకి నెట్టే జగన్‌రెడ్డి కపట నాటకాలకు కాలం చెల్లింది. ప్రజల మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం వచ్చింది. ప్రజల రక్షణకు, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఫేక్ జగన్‌రెడ్డిలాంటి నిందితులను వదిలేది లేదు.
భారతి సూరపనేని, పొలిటికల్ అనలిస్ట్