ఒకే సంతకంతో రూ.50 వేల లోపు ఉన్న రుణాలు అన్ని మాఫీ చేసింది టిడిపి.
ఇన్పుట్ సబ్సిడీ, భూసార పరీక్షలు, సూక్ష్మ పోషకాలు అందించాం, రైతు రథాలు అందించాం, 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇచ్చాం.
పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చాం.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి పంట కుంటలు ఏర్పాటు చేశాం.
ఎన్టీఆర్ జలసిరి ద్వారా బోర్లు వేసి, సోలార్ మోటార్లు ఏర్పాటు చేశాం.
పెండింగ్ ప్రాజెక్టులు అన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేశాం అని నారా లోకేష్ అన్నాడు