అమరావతి: సంక్రాంతి పండుగకు తమ ఊరు వచ్చేందుకు తనకు రక్షణ కల్పించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టు లో గురువారం నాడు పిటిషన్ వేశారు. పోలీసులు తనపై 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు తరపున ఏపీ హైకోర్టు లో న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. గతంలో సీఐడీ అధికారులు రఘురామరాజును అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని హైకోర్టుకు ఉమేష్ చంద్ర తెలిపారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని, అందువల్ల పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. అర్నేష్ కుమార్ కేసులో 41ఏ నిబంధనలను పాటించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయవాది ఈ సందర్భంగా పస్తావించారు. అయితే రఘురామకృష్ణరాజు పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు. రఘురామపై కేసు నమోదై, అది ఏడేళ్ల లోపు శిక్ష ఉన్న సెక్షన్లు అయితేనే 41 ఏ నిబంధనలు వర్తిసాయని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజుపై ఏపీ ప్రభుత్వం తాజాగా ఎలాంటి కేసులు పెట్టలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం శుక్రవారం ఉత్తర్వులను ఇస్తామని హైకోర్టు వెల్లడిరచింది.