అమరావతి(చైతన్యరథం): బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ ప్రతినిధి గా, కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. 2026 చివరి వరకు ఆమె పదవిలో కొనసాగుతారు. సీపీఏ ఇండియా రీజియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగానే కాకుండా మహిళా పార్లమెంటేరియన్లు, స్టీరింగ్ కమిటీకి చైర్‌పర్సన్‌గా కూడా ఆమె వ్యవ హరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు రాజమండ్రి ఎంపీ కార్యాలయ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.