చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సమగ్ర ప్రణాళికతో సమూల మార్పులు

మహిళా-శిశు సంక్షేమశాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Aug 3, 2024 at 7:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సమగ్ర ప్రణాళికతో సమూల మార్పులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏడాదిలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి
  • లక్ష్యసాధనకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి
  • అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి
  • మహిళా-శిశు సంక్షేమశాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి(చైతన్యరథం): పథకాలు అందించడమే కాదు.. వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై శుక్రవారం సీఎం సమీక్ష చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మహిళలు, చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశుమరణాలు, మిషన్‌ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కార్యక్రమాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై చర్చించారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం, అమృత హస్తం, గోరుముద్ద, గిరి గోరుముద్ద, బాల సంజీవని వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు.

రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని…అందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 48770 ఉండగా, మినీ అంగన్వాడీలు 6,837 ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో 8,311 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 12,496 కేంద్రాలను నిర్మించాలనే లక్ష్యంతో పనులు మొదలుపెట్టగా 2019 నాటికి అందులో 6,119 నిర్మాణాలు పూర్తి అయ్యాయిని, మరో 2800 నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. అయితే వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం కొత్తగా 2,048 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసి కేవలం 18 కేంద్రాలను మాత్రమే పూర్తి చేసిందని అధికారులు వివరించారు. అంగన్వాడీల అప్‌ గ్రెడేషన్లో కూడా పురోగతి లేదని వివరించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2026

ఆర్డీటీ.. మనందరి సంస్థ

చైతన్యరధం ఈ పేపర్ 14-05-2026

రాష్ట్రంలో ఇప్పటికీ 14,597 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవని, 8,455 సెంటర్లలో విద్యుత్తు సదుపాయం లేదని సీఎంకు అధికారులు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని ఉమెన్‌ హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏడాదిలోనే ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సూచించారు. పథకాలు అందించడమే కాదని…వాటి ఫలితాలు స్పష్టంగా కనిపించేలా శాఖ పనితీరు ఉండాలన్నారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖలో సమగ్ర ప్రణాళిక, సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు.

Previous Post

ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ..సీఎం చంద్రబాబు సంతృప్తి

Next Post

రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2026

కార్యకర్త
@ May 15, 2026
ఆర్డీటీ.. మనందరి సంస్థ
ఆంధ్రప్రదేశ్

ఆర్డీటీ.. మనందరి సంస్థ

చైతన్యరధం
@ May 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-05-2026

కార్యకర్త
@ May 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026

కార్యకర్త
@ May 13, 2026
ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?
ఆంధ్రప్రదేశ్

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం
ఆంధ్రప్రదేశ్

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026

కార్యకర్త
@ May 12, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆర్డీటీ.. మనందరి సంస్థ

ఆర్డీటీ.. మనందరి సంస్థ

చైతన్యరధం
@ May 15, 2026
ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist