- గుడి శిథిలాల కింద విలువైన వస్తువులు పంచుకున్నారు
- చర్యలు తీసుకోవాలని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతి
- కొడాలి అనుచరులు స్థలాన్ని కబ్జా చేసి ఇంటిపై దాడి చేశారు
- రూ.14 లక్షలు తీసుకుని ఇన్చార్జ్ తహసీల్దారు మోసగించింది
- రీ సర్వే పేరుతో పక్కనోళ్ల పేరుపై తమ భూములెక్కించారు
- ప్రజా వినతుల కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం మన్నె సుల్తాన్పాలెంకు చెందిన అక్కల సుబ్బారెడ్డి, గ్రామ ప్రజలు సమస్యను వివరించారు. గ్రామంలో రామలింగేశ్వరస్వామి దేవస్థానం పునర్నిర్మాణం కోసమని పాత గుడిని తొల గించారు. ఆ శిథిలాల కింద విలువైన వస్తువులు బయటపడ్డాయి. కార్య నిర్వహణాధికారి రామకోటిరెడ్డి, డీఈవో సత్యనారాయణరెడ్డి, గుమస్తా జాలయ్య, అక్కల మధుసూదన్‌రెడ్డి ఈ విషయాన్ని దాచిపెట్టి గ్రామస్తులను మభ్యపెడుతూ దొరికిన వస్తువులను గుట్టుచప్పుడు కాకుండా పంచుకున్నారు. అధికారులు స్పందించి దీనిపై విచారించి చర్యలు తీసుకునేలా చూడాలని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన నేతలు విచారించి చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. అర్జీల స్వీకరణ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్, కొమ్మాలపాటి శ్రీధర్, స్టేట్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు.
` కొడాలి నాని, శశిభూషణ్ అనుచరులైన అడబాల అప్పారావు కుమారులు తన స్థలానికి దొంగ రిజిస్ట్రేషన్ చేయించి అక్రమంగా తన స్థలంలోకి ప్రవేశించి చెట్లను ధ్వంసం చేసి ఇటుకరాళ్లను, 25 ట్రక్కుల మట్టిని దోచుకెళ్లారని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన గుర్రాలు సుబ్బారావు ఫిర్యాదు చేశాడు. అడ్డుకోబోయిన తన భార్య, బిడ్డలను హింసించారని..తనకు ఆ స్థలం ఒక్కటే ఆస్తి అని.. న్యాయం చేసి ఆదుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.
` గతంలో ఇన్చార్జ్ తహసీల్దారుగా ఉన్న పిల్లి సునీత రూ.14 లక్షలు డబ్బులు తీసుకుని నకిలీ పాసుపుస్తకాలు ఇచ్చి మోసం చేశారని న్యాయం చేయాలని పల్నాడు జిల్లా మన్నె సుల్తాన్‌పాలెం బాధితులు అభ్యర్థించారు. ఫారెస్ట్ ల్యాండ్‌కు డీ పట్టాలు ఇచ్చి 23 కుటుం బాలను అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
` గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేలో తన పేరున ఉన్న భూమిని మరొకరి పేరుపైకి మార్చి వారికి అధికారులు పాసుపుస్తకాలు ఇచ్చారని దాన్ని రద్దు చేసి తన భూమిని తన పేరుపైనే ఉండేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామానికి చెందిన కడియాల సాంబశివరావు వినతిపత్రం ఇచ్చారు.
` తాము డిగ్రీలు పూర్తి చేసి ఎటువంటి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నామని తమకు ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన బూర్లె లలిత, బూర్లె గాయత్రి అభ్యర్థించారు.
`గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు సిద్దారెడ్డి, అప్పటి ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే తమపై కక్షగట్టి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని కదిరికి చెందిన గూడూరు సౌభాగ్యవతి ఆవేదన వ్యక్తం చేసింది. నేడు తాము కొనుగోలు చేసి రిజస్ట్రేషన్ చేయించుకున్న పొలంలో రేకుల షెడ్డు వేసుకుంటే దానిని ధ్వంసం చేసి ఎమ్మెల్యే అనుచరులు అరక సామగ్రి దోచుకెళ్లి తీవ్ర నష్టం కలిగించారని న్యాయం చేసి ఆదుకోవాలని కోరింది.
` వీరితో పాటు పలువురు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నామని వైద్యం నిమితం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని అర్జీలు ఇచ్చి వేడుకున్నారు. అలాగే కిందిస్థాయిలో అధికారులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని.. అటువంటి వారి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పలువురు కార్యకర్తలు వివరించారు.