అమరావతి : రాజధానిగా ఎందుకు ఉండాలో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఉపనాయకుడు నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో చేసిన ప్రసంగం అయిదు కోట్ల మంది రాష్ట్రప్రజల మనోగతాన్ని సాక్షాత్కరించింది. అమరావతి రాజధానిగా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది. అమరావతి అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆలోచనలు ఏమిటి, అయిదేళ్లలో రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం నాటి టిడిపి ప్రభుత్వం ఏం చేసింది తదితర అంశాలతో తనకు కేటాయించిన తక్కువ సమయంలో స్పష్టమైన అభిప్రాయాలను వెల్లడించారు రామానాయుడు. రామానాయుడును అడ్డుకునేందుకు పిట్టకథల మంత్రి బుగ్గన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి ఏంచెప్పాలో తెలియక బుగ్గన తెల్లముఖం వేసి నీళ్లునమిలారు.
రాష్ట్ర విభజన తర్వాత 13జిల్లాల చిన్న ఆంధ్ర ప్రదేశ్ మళ్లీ అభివృద్ధి చెందాలి. పాలనా సౌలభ్యం ఉండాలనే ఉద్దేశంతో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్యస్థంగా 600 కిలోమీటర్ల నడుమ ఆ రోజు అమరావతిని తీసుకున్నాం. సాక్షాత్తు అసెంబ్లీలో ఆరోజున ప్రతి పక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి అమరావతిని స్వాగతిస్తున్నానని అన్నారు. 30వేల ఎకరాల పైబడి ఉండా లని చెప్పారు. అధికార, ప్రతిపక్షాలు, ఇతర పక్షాలన్నీ ఆమోదయోగ్యంతో అమరావతికి రూపకల్పనచేశారు.
2019 ఎన్నికల ముందు కూడా వైసిపికి సంబంధించిన నాయకులు చెప్పారు. అమరావతిలో జగన్ ఇల్లు కట్టుకున్నారు. ఒక్క అంగుళం కూడా ఇక్కడ నుంచి కదలదు. భవిష్యతత్తులో అభివృద్ధి చేస్తామని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి మాటమార్చారని అన్ని రాజ కీయ పార్టీలు మాటతప్పాల్సిన పనిలేదు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలే తప్ప పాలనా వికేంద్రీకరణ పేరుతో రాజధానిని ముడుముక్కలు చేయడం తలను మూడుముక్కలు చేయడమే అన్నారు.