• వెంకటగిరి నియోజకవర్గం రాపూరు గ్రామ దళితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• గత ప్రభుత్వంలో మా సంక్షేమం కోసం అమలుచేసిన 27 సంక్షేమ పథకాలను వైసిపి ప్రభుత్వం రద్దుచేసింది, దీనివల్ల మేం తీవ్రంగా నష్టపోతున్నాము.
• గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ ఎస్సీ యువత స్వయం ఉపాధికి కార్లు ఇచ్చేవారు.
• అంబేద్కర్ విదేశీవిద్య పథకం ద్వారా పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లే చదువుకునే అవకాశం ఉండేది.
• దేశంలో డప్పు కళాకారులకు గత టిడిపి ప్రభుత్వం తొలిసారిగా పెన్షన్ సౌకర్యం కల్పించింది.
• జనాభా దామాషా ప్రకారం నెల్లూరు జిల్లాలో మాదిగలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి.
• ఎస్సీ వర్గీకరణ చేసి మాకు న్యాయం చేయండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్ రెడ్డి.
• సంక్షేమ పథకాల మాటున ఎస్సీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి రద్దుచేసిన 27 ఎస్సీ సంక్షేమపథకాలను పునరుద్దరిస్తాం.
• జనాభా దామాషా ప్రకారం మాదిగలకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తాం.
• ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగల సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం.