చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

భరోసాయే పెద్ద ఉపశమనం

42వ రోజు ‘ప్రజాదర్బార్‌’కు విన్నపాల వెల్లువ

by చైతన్యరధం
Oct 17, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
భరోసాయే పెద్ద ఉపశమనం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తున్న ప్రజాదర్బార్‌
  • ప్రజా విజ్ఞప్తులపై అప్పటికప్పుడే లోకేష్‌ ఆదేశాలు
  • మంత్రి చొరవపట్ల బాధితుల హర్షాతిరేకాలు
  • 42వ రోజు ‘ప్రజాదర్బార్‌’కు విన్నపాల వెల్లువ

అమరావతి (చైతన్య రథం): గత వైసీపీ ప్రభుత్వంలో సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి వేసారిన ప్రజలకు కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్‌ చేపట్టిన ‘‘ప్రజాదర్బార్‌’’ అండగా నిలుస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో మంగళగిరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు 42వ రోజు నిర్వహించిన ‘‘ప్రజాదర్బార్‌’’ కు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్‌ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రజా విజ్ఞప్తులను పరిశీలించిన మంత్రి.. ఆయా విన్నపాల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అండగా నిలిచేందుకు మంత్రి చూపిస్తున్న చొరవ పట్ల అర్జీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంగళగిరి సెగ్మెంట్‌ నుంచి..
గత ప్రభుత్వం నిలిపివేసిన రైతు కూలీ పెన్షన్‌ పునరుద్ధరించండి
తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనకు ఎలాంటి ఆధారంలేదని, ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని దుగ్గిరాల మండలం రేవేంద్రపాడుకు చెందిన పి.సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
హెచ్‌ఐవీ వ్యాధితో బాధపడుతున్న తనకు మందులు కొనుగోలు చేసేందుకు కూడా ఆర్థిక స్థోమత లేదని, పెన్షన్‌ మంజూరు చేసి ఆదుకోవడంతోపాటు ఇల్లు మంజూరు చేయాలని యర్రబాలానికి చెందిన షేక్‌ నసీమ కోరారు. పరిశీలించి తగిన విధంగా ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. అలాగే, పక్షవాతంతో బాధపడుతున్న తనకు పెన్షన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని కుంచనపల్లికి చెందిన బి.కృపారావు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్‌ చదివిన తమ కుమారుడికి ఏదైనా ఉద్యోగావకాశం కల్పించాలని తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన ఏ.పెద్దిరాజు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం నిలిపివేసిన రైతుకూలీ పెన్షన్‌ను పునరుద్ధరించాలని యర్రబాలానికి చెందిన సీహెచ్‌ రమాదేవి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు
ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరులోని పులివాగు ఆక్రమణలు తొలగించి, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన గుంటక సుబ్బారెడ్డి మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పులివాగు ఆక్రమణలతో తమ పంటలు ప్రతి ఏడాది ముంపునకు గురై తీవ్రంగా నష్టపోతున్నామని అర్జీలో పేర్కొన్నాడు. పులివాగు హిందూ స్మశాన వాటికనుంచి విజయవాడ- భద్రాచలం రోడ్డుపై నిర్మించిన వంతెన వరకు ఇరువైపులా భారీగా ఆక్రమణలకు గురై వాగు కుచించుకుపోయింది. దీంతో వర్షాకాలంలో సంభవిస్తున్న వరదలకు పంట పొలాలు నీట మునుగుతున్నాయి. అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. వరదల బారిన పడకుండా గ్రామాన్ని రక్షించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
కడప జిల్లా కలసపాడు మండలం ముద్దంవారిపల్లికి చెందిన గ్రామస్థులు మంత్రి నారా లోకేష్‌ ను కలిశారు. శంకవరం గ్రామ రెవెన్యూ పరిధిలో తమకు వారసత్వంగా సంక్రమించిన సుమారు 20 ఎకరాల ఈనాం భూములను సగిలి బాలచిరంజీవి, సగిలి పుల్లయ్య, మేక ఓబయ్య, దేవరాజు, మరికొందరు కలిసి ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో సదరు భూములను ఆన్‌ లైన్‌ లో నమోదు చేయించి.. తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
తిరుపతిలోని శీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత మూడేళ్ల నుంచి పనిచేస్తున్న 30 మంది బోధనేతర సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారని, తిరిగి తమను విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని నాన్‌ టీచింగ్‌ సిబ్బంది మంత్రి నారా లోకేష్‌ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఎన్టీఆర్‌ జిల్లా కొత్తపేటలోని తమ 1.10 ఎకరాల భూమిని గరిమెళ్ల నరసింహారావు అనే వ్యక్తి కబ్జా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విచారించి తగిన న్యాయం చేయాలని గుదె వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అధికారులకు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. వృద్ధాప్యంలోవున్న తమకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమయ్యారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలకు తమ ఇళ్లు నీట మునిగి ఇంట్లోని సామాగ్రి, నిత్యవసరాలు పాడైపోయాయని, ద్విచక్రవాహనాలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని, పరిహారం అందించి ఆదుకోవాలని నందమూరి నగర్‌, అంబాపురానికి చెందిన పలువురు బాధితులు మంత్రి నారా లోకేష్‌ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన వెన్నెం బాలగంగాధర్‌ తిలక్‌ మంత్రి నారా లోకేష్‌ ను కలిశారు. 45 ఏళ్ల క్రితం తాము కొనుగోలు చేసిన 10.39 ఎకరాల వ్యవసాయ భూమిని నిషేధిత జాబితాలో చుక్కల భూమి కింద చేర్చారని, విచారించి తమ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సదరు భూమిని దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్నామని, పట్టాదారు పాసు పుస్తకం కూడా మంజూరైందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని వాపోయారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధితవార్తలు

No Content Available
Tags: భరోసాయే పెద్ద ఉపశమనం
Previous Post

ఉచిత ఇసుక లక్ష్యం నెరవేరాలి

Next Post

పసికందుకు పునర్జన్మ!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026

కార్యకర్త
@ April 21, 2026
నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం
ఆంధ్రప్రదేశ్

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి
ఆంధ్రప్రదేశ్

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
చేతులు చాచిన సాయం!
ఆంధ్రప్రదేశ్

చేతులు చాచిన సాయం!

చైతన్యరధం
@ April 21, 2026
అన్న వితరణకు అన్నక్యాంటీన్లు వేదిక
ఆంధ్రప్రదేశ్

అన్న వితరణకు అన్నక్యాంటీన్లు వేదిక

చైతన్యరధం
@ April 21, 2026
Load More

ముఖ్య వార్తలు

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026

రెండేళ్లలో 5వేల దేవాలయాలు

చైతన్యరధం
@ April 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist