- సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ ప్రతినిధుల భేటీ
- ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు దిశగా సుదీర్ఘ చర్చలు
- రూ.75వేల కోట్ల పెట్టుబడులకు బీపీసీఎల్ సిద్ధంరాష్ట్ర పరిశ్రమల మంత్రి టిజి భరత్ వెల్లడి
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో చెప్పారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టిజి భరత్ తెలిపారు. సచివాలయంలో బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడుతో బీపీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు సమావేశమైనట్టు మంత్రి వెల్లడిరచారు. పరిశ్రమల మంత్రిగా కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయడంలో తన వంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీలో ఆయిల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుచేసే విషయంపై చర్చించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు బీపీసీఎల్ సిద్ధంగా ఉందన్నారు. మొదటగా రూ.50 వేలనుంచి రూ.75 వేల కోట్లు పెట్టుబడులు పెడతారని.. తర్వాత రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు బీపీసీఎల్ కంపెనీ ఆసక్తి చూపుతున్నట్లు మంత్రి టిజి భరత్ చెప్పారు. ఇందుకోసం మూడు ప్రాంతాలను పరిశీలిస్తారన్నారు. 90 రోజుల తర్వాత మళ్లీ సీఎం చంద్రబాబుతో కంపెనీ ప్రతినిధులు భేటీ అవుతారని వెల్లడిరచారు. అప్పుడు ఆయిల్ రిఫైనరీ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేసేదీ నిర్ణయిస్తారన్నారు. సీఎం చంద్రబాబు, బీపీసీఎల్ ప్రతినిధుల సమావేశం ఉత్సాహంగా సాగిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నట్లు మంత్రి టిజి భరత్ పేర్కొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీ ప్రతినిధులకు విందు ఇచ్చారన్నారు.