• ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం రెణమాల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో మంచినీటి సమస్య అధికంగా ఉంది.
• రెండు రోజులకు ఒకసారి మంచినీరు వస్తోంది, ఇవి తాగడానికి ఉపయోగపడడం లేదు.
• మినరల్ వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. కొంతమంది కొనుక్కోలేక కలుషిత నీరు తాగి రోగాలబారిన పడుతున్నారు.
• మా గ్రామంలోని ఈద్గాకు ప్రహరీ నిర్మించి నమాజ్ చేసుకునేందుకు సౌకర్యం కల్పించాలి.
• మా గ్రామంలో హైస్కూల్ ఏర్పాటు చేసి మా పిల్లలు పక్క గ్రామాలకు వెళ్లకుండా చూడాలి.
• మైనారిటీలకు సబ్సిడీ లోన్లు ఇప్పించి ఆర్థిక తోడ్పాటునందించాలి.
• మా గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• సంక్షేమ కార్యక్రమాలకు లక్షలకోట్లు ఖర్చుపెడుతున్నామని డబ్బాలు కొట్టుకుంటున్న ముఖ్యమంత్రి… గ్రామీణ ప్రాంతాల్లో గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోవడం దారుణం.
• గత నాలుగేళ్లుగా మైనారిటీల సంక్షేమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం చేశారు.
• టిడిపి అధికారంలోకి రాగానే వాటర్ గ్రిడ్ ఏర్పాటుచసి ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం.
• గ్రామంలో విద్యార్థులను సంఖ్యకు అనుగుణంగా హైస్కూలు, ఈద్గా ప్రహరీగోడ నిర్మాణం చేపడతాం.
• ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేసి ముస్లింలకు స్వయం ఉపాధి రుణాలను అందజేస్తాం.