వరద బాధితులకు రూపాయి సాయం విదల్చకపోగా రోత పత్రికలో వరద సాయంపై అసత్య కథనాలతో ప్రభుత్వంపై విషప్రచారం చేయిస్తూ శునకానందం పొందుతున్నాడు జగన్‌రెడ్డి. విపత్తు సమయంలో సీఎం చంద్రబాబు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి 10 రోజులు రేయింబవళ్లు శ్రమించి బాధితులు కోలుకునే వరకు ఏ విధంగా కష్టపడ్డారో ప్రపం చం మొత్తం చూసింది. వరద ముంపులో ఉన్న లక్షల మందికి భోజనం, తాగునీరు, పాలు, పండ్లు, నిత్యావసరాలు అందించడమే కాకుండా రికార్డు స్థాయిలో వరద నష్టపరిహారం అందించి వారి మన్ననలు పొందారు. ఫేక్ రెడ్డి మాత్రం బాధితులకు ఎటువంటి సాయ మందించకపోగా ఫొటోలకు ఫోజులిచ్చి అధికార పార్టీపై బురదజల్లే పని పెట్టుకున్నాడు. అది అటుంచితే రూ.కోటి సాయం ఇస్తానని ప్రకటించి ఇవ్వకుండా వరద బాధితులను మోసం చేసింది కాక తన రోత పత్రికలో వరద సాయంలో రూ.534 కోట్లు బొక్కేశారని సిగ్గులేని రాతలు రాయిస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం ఆయన సైకో చేష్టలకు నిదర్శనం. ఐదేళ్ల పాలనలో ప్రజలు కష్టాల్లో ఉంటే తాడేపల్లి కొంప దాటి ఏనాడూ బయట కు రాని ఆయన తన హయాంలో వరద బాధితులను పరామర్శించిన దాఖలాలు లేవు. రోత పత్రికలో నిస్సిగ్గుగా అసత్య కథనాలతో విషప్రచారం చేయిస్తున్న జగన్‌రెడ్డి అండ్ కో వైసీపీ దగాకోర్ ముఠా వరద సాయమందించలేదంటూ విజయవాడలో పేటీఎం కూలీలతో ధర్నా చేయించడాన్ని నగర ప్రజలతో పాటు వరద బాధితులే ఛీకొడుతున్నారు. వారు ధర్నా చేయాల్సింది తాడేపల్లి ప్యాలెస్ ముందు.. మేము ఇచ్చిన డబ్బులు ఎక్కడ? రూ.కోటి సా యం ఎక్కడ? అని జగన్‌రెడ్డిని నిలదీయాలి. ప్రకటించిన రూ.కోటి సాయం ఇవ్వకపోగా తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా వరద బాధితులకు సాయమంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజల నుంచి వసూళ్ల పేరిట దండుకోవడం కన్నా నీచం ఇంకేముంటుంది.
తాడేపల్లి ప్యాలెస్‌లో దండుకున్న డబ్బుకు లెక్కలేవి?
ఐదేళ్ల పాలనలో గోదావరి వరదలు, అన్నమయ్య డ్యామ్ కొట్టుకు పోయి వరదలకు నష్టపోయిన బాధితులకు తూతూ మంత్రంగా రూ.2 వేలు సాయం, నాలుగు టామెటాలు, నాలుగు బంగాళాదుంపలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మొన్న వరదలప్పుడు కోటి సాయం ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వేల కోట్లు దిగమింగి ఊరుకో ప్యాలెస్ కట్టుకున్న జగన్‌రెడ్డి ఇస్తానన్న కోటి కూడా వ్యక్తిగతంగా కాకుండా పార్టీ తరపున సాయం చేస్తానని ప్రకటించారు. మళ్లీ తాడేపల్లి ప్యాలెస్‌లో నాయకుల నుంచి చెక్కులు తీసుకున్నా రు..వచ్చిన డబ్బంతా ఏమి చేశారు? వరద బాధితులకు సాయమంటూ వసూలు చేసిన డబ్బును బొక్కేసింది కాక రోత పత్రికలో ప్రభుత్వంపై ఫేక్ ప్రచారమా? చంద్రబాబు పిలుపుతో దాతలు ఇచ్చిన ప్రతి రూపాయికి పారదర్శకంగా ప్రతిరోజూ పత్రికలకు ప్రకటన ద్వారా వెల్లడిరచారు. మరి జగన్‌రెడ్డి వరద సాయమంటూ దండుకున్న డబ్బులకు లెక్కలు చెప్పారా? దీనిని బట్టి వరద సాయం పేరుతో వేల కోట్లు మింగుతున్నావ్ అని రాష్ట్ర ప్రజ లకు అర్థమవుతోంది.
వరద సాయంపై రోత రాతలా?
విజయవాడ వరదల్లో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం రూ.203.3 కోట్లు వరద బాధితులకు ఖర్చు చేస్తే రోత పత్రికలో మాత్రం రూ.534 కోట్లు బొక్కేశారంటూ రోత పత్రికలో రోత రాతలు రాయించారు. భోజన ప్యాకెట్లకు రూ.57.45 కోట్లు ఖర్చు చేస్తే రూ.368 కోట్లు మింగేశారని ప్రచారం చేయించడం సిగ్గుచేటు. అగ్గిపెట్టె, కొవ్వొత్తుల కోసం రూ.23 లక్షలు ఖర్చు చేస్తే రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లుగా, మంచినీళ్ల బాటిళ్లకు రూ.11.22 కోట్లు ఖర్చు చేస్తే రూ.26 కోట్లు ఖర్చు చేసినట్లుగా, శానిటేషన్‌కు రూ.18.34 కోట్లు ఖర్చు చేస్తే రూ.51 కోట్లు దోచేశారని, నిత్యావసరాల కోసం రూ.60 కోట్లు ఖర్చు చేస్తే 61.28 కోట్లు ఖర్చు చేసినట్లు నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేయించడం సిగ్గుమాలిన చర్య.
రూ.4878 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం
ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో విలాసాలకు, ప్రచార ఆర్భాటాలకు రూ.4832 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు.. ఎగ్ పఫ్‌లకు రూ.3.5 కోట్లు, సచివాలయాలకు, బిల్డింగ్‌లకు ప్రచార పిచ్చితో రంగులకు రూ.3 వేల కోట్లు, సర్వే రాళ్లపై జగన్‌రెడ్డి బొమ్మ కోసం రూ.700 కోట్లు, రుషికొండపై ప్యాలెస్‌కు రూ.600 కోట్లు, సాక్షి ప్రకటనలకు రూ.500 కోట్లు, పాస్ పుస్తకాలపై జగన్ రెడ్డి బొమ్మలకు రూ.13 కోట్లు, తాడేపల్లిలో నీ లగ్జరీ కోసం రూ.15 కోట్లు, మద్యం షాపులో ఎలుకలు పట్టడానికి కోటిన్నర, జగన్‌రెడ్డి వ్యక్తిగత పర్యటనలు, విలాసాలకు ఇలా మొత్తం ఖర్చు రూ.4,878 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. నేడు కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంటే తప్పుడు రాతలు రాయి స్తూ నిందలు వేయడం సిగ్గుచేటు. అధికారం పోయినా బుద్ధి మార్చుకోకుండా కుక్కతోక వంకర చందంగా చంద్రబాబుపై రోత రాతలు రాయిస్తూ జగన్‌రెడ్డి అండ్ కో వైసీపీ దగా కోర్ ముఠా చేయిస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
ఎం.ఎలీషాబాబు, అనలిస్ట్