- త్వరగా వెదికిపెట్టండి.. లేకుంటే టెన్షన్‌తో పోతాడు
- ఎ2 విజయసాయిరెడ్డిపై లోకేష్ సెటైర్లు
మంగళగిరి : ఎ2 విజయసాయిరెడ్డి ఫోన్ పోయిందని తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం దొంగోడి ఇంట్లో దొంగలు పడినచందంగా ఉందని టిడిపి యువనేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఎంపి స్థాయిలో ఉన్న విజయసాయిరెడ్డి ఇంట్లోనే దొంగలు పడితే ఇక సామాన్యుల పరిస్థితి ఎంటి? ఢల్లీి లిక్కర్ స్కామ్, బ్రెజిల్ లో వ్యాపారం, విశాఖ రాసలీలలు ఆ ఫోన్లోనే ఉన్నాయి..డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకూ సెల్‌ఫోన్ వెతికే పనిలో ఉన్నారన్నారు. పోలీసులు త్వరగా వెతికిపెట్టి సాయిరెడ్డికి సాయం చేయాలని, లేకపోతే ఆయన పాపాలచిట్టా ఎవరికి చిక్కుతుందోనన్న ఆందోళన తో ఎ2 టపా కట్టేసే అవకాశముంధని లోకేష్ పేర్కొన్నారు.