- ఉత్తేజంగా, ఉల్లాసంగా పరుగులిడుతున్న చంద్రబాబు ప్రజాగళం
- మొక్కుబడిగా కదులుతున్న జగన్‌రెడ్డి బస్సు యాత్ర
- జగన్ అడుగుతున్న పలు ప్రశ్నలపై స్పష్టతనిచ్చిన చంద్రబాబు
- తెదేపా అధినేత ప్రశ్నలకు మౌనమే శరణ్యమన్న ముఖ్యమంత్రి
- చంద్రబాబు ట్రెండ్‌లో జగన్ కొట్టుకుపోతాడంటున్న పరిశీలకులు
రాష్ట్ర శాసనసభలోని 175 స్థానాల్లో 52 రాయల సీమలో ఉన్నాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరి స్థితుల దృష్ట్యా సీమకు ఒక ప్రత్యేకత ఉంది. జనాభాలో బీసీలు ఎక్కువగా ఉన్నా అన్ని వ్యవహారాల్లోనూ రెడ్డి కులస్థులదే పైచేయి. అటువంటి సీమలో 2019 ఎన్నికల్లో వైసీపీ 49శాసనసభ స్థానాల్లో విజయం సాధించింది. అంటే.. మొత్తం 52 స్థానాల్లో 94 శాతం వైసీపీకి దక్కాయి. సాధారణంగా ఇంత ఏకపక్ష విజ యం చాలా అరుదు. అయితే.. సీమలో ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయినట్లు ప్రతిపక్ష నాయకుడు చంద్ర బాబు ప్రజాగళం యాత్ర, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర వెల్లడిరచాయి.
రెండు యాత్రల్లో స్పష్టమైన తేడా
మార్చి 27న ప్రజాగళం,మేమంతా సిద్ధం యాత్రలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు వరుసగా ఐదు రోజు లు ప్రజలతో మమేకమయ్యారు. జగన్‌రెడ్డి నాలుగు రోజుల తర్వాత ఈస్టర్ సందర్భంగా బస్సు యాత్రకు విరామమిచ్చి తిరిగి కొనసాగిస్తున్నారు. మిట్టమధ్యా హ్నం బహిరంగ సభతో ప్రారంభించి రోజుకి మూడు చొప్పున చంద్రబాబు 15బహిరంగ సభల్లో ప్రసంగిం చగా.. ఎండ తగ్గినాక సాయంకాలం ఒక సభతో జగన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఐదేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమైన ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలు గుర్తొచ్చి బస్సెక్కారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జగన్‌రెడ్డి చేసిన అరకొర పర్యటనలు పరదాల మధ్య, భారీ పోలీస్ బందోబస్తు నడుమ జరిగాయి. అదే రీతిలో బస్సు యాత్రలో జగన్‌రెడ్డి మొక్కుబడిగా ప్రజలను పరదాల చాటునే కలుస్తూ నాలుగు మాటలు మాట్లాడుతున్నారు. చేతిలో అధికారం ఉంది కనుక ఆర్టీసీ బస్సులను విచ్చ లవిడిగా వాడుకుంటూ వివిధ పథకాల లబ్ధిదారులను బలవంతంగా జగన్ బహిరంగ సభలకు తీసుకొస్తున్నా హాజరు అంతంతమాత్రంగానే ఉంది. వచ్చినవారు కూడా జగన్ ప్రసంగం మొదలైన కొన్ని నిమిషాలకే పారిపోతున్నారు.
పలుచోట్ల జగన్‌రెడ్డికి ప్రజలు నిరసనలు తెలిపారు. నీళ్లు లేక నానా అగచాట్లు పడుతున్నట్లు ఖాళీ బిందె లతో మహిళలు రోడ్డెక్కారు. అక్కడక్కడ కొంతమంది వలంటీర్లతో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి భజన చేయించు కునే పరిస్థితికి దిగజారారు. ఈ దైన్యస్థితి రాయలసీమ లో ముఖ్యమంత్రి జగన్ పట్ల ప్రజల్లో నెలకొన్న భారీ వ్యతిరేకతకు అద్దం పడుతోందని పరిశీలకులు వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి బస్సు యాత్రకు భిన్నంగా.. చంద్ర బాబు ప్రజాగళం యాత్ర భారీ జనసందోహంతో అప్ర తిహాతంగా కొనసాగింది. ప్రజలు స్వచ్ఛందంగా చంద్ర బాబు సభలకు హాజరై ఆయన ప్రతి మాటకు, ప్రతి ప్రశ్నకు అమితమైనఉత్సాహంతో స్పందించటం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వీక్షించారు. గతంలో కంటే ఎక్కువగా చంద్రబాబు పలు విషయాల పై ప్రజల స్పందనను తెలుసుకున్నారు. ఇద్దరు నాయ కుల సభలు జరిగిన తీరు, ఆ సభల్లో ప్రజల నుంచి వచ్చిన స్పందన రాయలసీమలో గత ఎన్నికల నాటి సీన్ పూర్తిగా రివర్స్ అయిందనటానికి.. జగన్‌రెడ్డి వ్యతి రేక పవనాలు గట్టిగా వీస్తున్నాయనడానికి నిదర్శనమని పరిశీలకుల అభిప్రాయం.
ప్రసంగాల్లో తేడా-ఎజెండా సెట్ చేసిన చంద్రబాబు
సభలు జరిగిన తీరులోనే కాక, చంద్రబాబు, జగన్ రెడ్డి ల ప్రసంగాల్లోని వ్యత్యాసం కూడా రాయలసీమలో రివర్స్ అయిన ట్రెండ్ కు అద్దం పట్టింది. ఇప్పటివరకు సాగిన 15 ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్ర బాబు పలు విషయాలపై స్పష్టత ఇచ్చారు. దీంతోపాటు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు స్పష్టత ఇచ్చిన అంశాలు:
1. 74 ఏళ్ల చంద్రబాబు వయసును తరచుగా గుర్తు చేసే జగన్‌రెడ్డికి తెదేపా అధినేత దీటైన సమాధాన మిచ్చారు. మిట్టమధ్యాహ్నంతో మొదలుపెట్టి రోజు కు 3 సభల్లో తాను పాల్గొంటుంటే.. యువకుడిగా చెప్పుకునే జగన్‌రెడ్డి చల్లబడ్డాక తీరిగ్గా రోజుకొక సభలో మాత్రమే పాల్గొంటూ ఎవరి శక్తి ఏమిటో ఆయనే వెల్లడిరచారని ఎద్దేవా చేస్తూ చంద్రబాబు ఘాటుగా బదులిచ్చారు.
2. సంక్షేమంలో చంద్రన్నే మిన్న: తరచుగా బటన్ నొక్కుడు గురించి మాట్లాడుతూ..సంక్షేమ పథకాల విషయంలో తెదేపాను తక్కువచేసి మాట్లాడే ముఖ్య మంత్రి జగన్ నోటికి చంద్రబాబు తాళం వేశారు. గత తెదేపా ప్రభుత్వం బడ్జెట్ మొత్తంలో 19 శాతా నికి పైగా నిధులను సంక్షేమ పథకాలపై ఖర్చు చేస్తే.. నేటి జగన్ ప్రభుత్వం కేవలం 15శాతాన్ని మాత్రమే సంక్షేమంపై వెచ్చించిందని చంద్రబాబు తెలిపారు. అంటే ప్రతి వంద రూపాయల్లో జగన్ రెడ్డి కంటే తానే సంక్షేమం కోసం 4 రూపాయలు ఎక్కువ ఖర్చు చేశానని చెప్పి అకౌంట్ సెటిల్ చేశారు. పైగా..తన సంక్షేమ విధానం పేద, బడు గు, బలహీన వర్గాల స్వావలంబన, ఆత్మగౌరవాల ను పెంచేదని..జగన్‌రెడ్డి ఆలోచన పేదలను నిత్యం పేదరికంలో మగ్గేలా చేసేదని చంద్రబాబు వివరిం చారు. తాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను జగన్‌రద్దు చేసిన వైనాన్ని వివరించి జగన్‌ది రద్దులతో కూడిన సంక్షేమమని ఎత్తిచూపారు.
3. బ్రాండ్ వాల్యూ: ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకు ల పేర్లు చెబితే ప్రజల మనసుల్లో ఏమి స్ఫురిస్తా యో అన్న విషయంపై చంద్రబాబు చాలా స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు పేరు చెబితే..గతంలో హైద రాబాద్‌లో జరిగిన అభివృద్ధి,నవ్యాంధ్రలో 2014-19 కాలంలో శీఘ్రగతిన జరిగిన రాజధాని అమ రావతి నిర్మాణ పనులు, పోలవరం నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులపై భారీస్థాయిలో జరిగిన వ్యయం, పెట్టుబడుల ప్రవాహంతో పారిశ్రామికా భివృద్ధితో యువతకు ఉద్యోగాలు ఇత్యాదికాలు ప్రజలకు గుర్తొస్తాయని ఆయన చెప్పారు. అదే జగన్ పేరు చెబితే.. ప్రజా వేదిక విధ్వంసం, రాజధానిలేని రాష్ట్రంగా మిగిలిన నవ్యాంధ్ర, పడకే సిన పోలవరం, ఆగిపోయిన పెట్టుబడులు, పారి పోయిన పరిశ్రమలు, సంక్షోభంలో పడిన సంక్షే మం, అప్పుల దిబ్బగా మారిన రాష్ట్రం, నైరాశ్యంలో కూరుకుపోయిన యువత గుర్తుకొస్తాయని చంద్ర బాబు వివరించారు.
4. సంపద పెంచి పేదలకు పంచుతా: చంద్రబాబు ప్రకటించిన సూపర్-6 పథకాలకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయి అన్న జగన్‌రెడ్డి ప్రశ్నకు చంద్ర బాబు సూటిగా సమాధానం చెప్పారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచటం తనకు తెలిసిన విద్య అని.. దీన్ని గతంలో నిరూపించానని, అదే విధంగా సంపద సృష్టి ద్వారా ఆదాయాన్ని పెంచి దాన్ని పేదల కోసం వినియోగిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.
5. డ్రైవర్ చంద్రబాబు: సూపర్-6 కింద మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే బస్సులతో పాటు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ప్రగతి రథ చక్రా లకు తానే డ్రైవర్‌గా ఉంటానని ఒక సందేశాన్ని ఇచ్చి చంద్రబాబు రాయలసీమ ప్రజాగళం యాత్ర సందర్భంగా ప్రజలను ఉర్రూతలూగించారు.
6. జగన్‌రెడ్డికి సంధించిన ప్రశ్నలు :
జగన్‌రెడ్డి లేవనెత్తిన పలువిషయాలపై స్పష్టత ఇవ్వ టంతోపాటు ఆయనకు చంద్రబాబు పలుప్రశ్నలు సంధించి సమాధానాలు అడిగారు. వాటిలో కొన్ని:
బాబాయిని ఎవరు చంపారు?
వివేకా హత్య కేసు విచారణను నిత్యం అడ్డుకుంటూ సొంత బాబాయి హత్యకు కారకుడైన అవినాష్ రెడ్డిని కాపాడటానికి నానా పాట్లు పడి, ఆయనకు కడప లోక్ సభ సీటు ఇవ్వటం తగునా అని చంద్రబాబు ముఖ్యమంత్రిని సీమ గడ్డపై నిలదీశారు.
రాయలసీమకు ఏం చేశారు?
గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 శాసనసభ స్థానాల్లో 49 చోట్ల వైసీపీని గెలిపించిన సీమ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గత ఐదేళ్లలో ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నిస్తూ.. చెప్పుకోవటానికి ఆయన చేసిం దేమీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
పరిశ్రమలు, ఉద్యోగాలలేవి?
అనేక వ్యయ ప్రయాసలకోర్చి అనంతపురం జిల్లాకి తాను కియా ఫ్యాక్టరీ తెస్తే, సీమకు ఒక్క ఫ్యాక్టరీని కూడా జగన్ తేలేదని.. బతుకుదెరువు లేక సీమ నుంచి భారీగా ఇతర ప్రాంతాలకు వలసలు సాగుతున్నాయని దీనికి బాధ్యులు ముఖ్యమంత్రి కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు.
సాగునీటి రంగం నిర్లక్ష్యం
తెలుగుదేశం ప్రభుత్వాలు కరువుకు ఆలవాలమైన సీమకు కృష్ణ, గోదావరి జలాలు ఇవ్వడానికి కృషి చేస్తే సాగునీటి ప్రాజెక్టులను తానెందుకు నిర్లక్ష్యం చేశాడో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.
కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ?
` కర్నూలు న్యాయ రాజధానిగా మారిందా అని చంద్రబాబు ప్రశ్నించారు.
` గతంలో రాయలసీమకు జగన్ ఇచ్చిన హామీల అమలు సంగతి ఏమిటని కూడా నిలదీశారు.
జగన్ మౌన ముద్ర
తన అవినీతిమయమైన గతాన్ని చెప్పుకోలేక, విధ్వం సపూరిత వర్తమానాన్ని వివరించలేక, చంద్రబాబు సం ధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి బస్సు యాత్రలో మూగనోము పట్టా రు. యాత్ర పొడవున బస్సులో నుండే చేతులు ఊపు తూ.. ప్రజలు గుమిగూడిన చోట్ల కూడా బయటకు రాకుండా.. కనీసం తనకు ఓట్లు వేయమని అడిగే ప్రయత్నం కూడా చేయకుండా మొక్కుబడిగా జగన్ ప్రయాణించడంపై వైసీపీ అభిమానులే ఆగ్రహించారు. చేసింది చెప్పుకోలేక.. కొత్తగా ఏం చేయాలనుకుంటు న్నాడో చెప్పకుండా జగన్ బస్సు యాత్ర సాగుతుండ టం రాయలసీమలో జగన్ సీన్ పూర్తిగా రివర్స్ అయిం దనటానికి నిలువెత్తు సాక్ష్యమని పరిశీలకులు ముక్త కంఠంతో అంటున్నారు.
సీమలో ‘ప్రజాగళం’ యాత్రతో చంద్రబాబు ఎన్ని కల సమయంలో ట్రెండ్ సెట్ చేశారని, ఇదే ట్రెండ్ మే 11 దాక కొనసాగుతుందని.. చంద్రబాబు ధాటికి సమాధానం ఇవ్వలేక జగన్‌రెడ్డి పూర్తిగా చేతులెత్తేస్తా రని..మే 13న ప్రజలిచ్చే తీర్పులో ముఖ్యమంత్రికి భారీ ఓటమి తథ్యమని రాయలసీమలో ఇద్దరు నాయకుల యాత్రలు స్పష్టం చేశాయన్నది సర్వ్రతా వినిపిస్తున్న ‘ప్రజాగళం’.