అమరావతి: ఎపి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ బుకాయింపు కార్యక్రమాన్ని ఆపి మాధవ్ కారణంగా లైంగిక వేధింపులకు గురైన మహిళకు న్యాయం చేయాలి.. మాధవ్ అశ్లీల వీడియోను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే నిజానిజాలు ఏమిటో అక్కడే తేల్చుకుందామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సవాల్ విసిరారు. సునీల్‌కుమార్ విలేకరుల సమావేశం అనంతరం పట్టాభిరామ్ గురువారం ఒక వీడియో సందేశం విడుదలచేస్తూ..సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి జిమ్ స్టాఫర్డ్ ఇచ్చి నివేదిక ఫేక్ అని చెప్పి మాట్లాడుతున్నారు. జిమ్ స్టాఫర్డ్ వీడియో పరిశీలించిన తర్వాత అథెంటిక్ అండ్ అన్ ఎడిటెడ్ అని నివేదిక ఇచ్చింది వాస్తవం. మేం ఎప్పుడు ఆ వీడియోను వారికి పంపింది, ఎంత డబ్బు చెల్లించింది, అన్ని బ్యాంక్ డిటైల్స్ ఉన్నాయి. నిజం నిప్పు లాంటిది. ఇంకా ఈ డర్టీ పిక్చర్ సునీల్ కుమార్ లాంటి అధికారులు ఆఎంపిని వెనుకేసుకు రావడం చూసి పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలి. నిజాన్ని నిగ్గుతేల్చడానికి ప్రయ త్నించిన మాపై కేసులు పెడతారా? అమరావతి విషయంలో ఐఐటి మద్రాసు వారి నివేదికను ఫోర్జరీ చేసిన చరిత్ర జగన్ రెడ్డి ప్రభుత్వానిది.
ఫోర్జరీలు, తప్పుడు పత్రాల చరిత్ర వారిదే. వీరికి మా గురించే మాట్లాడే కనీస అర్హత లేదు. అతి త్వరలోనే ఇంకా అనేక వాస్తవా లతో మీ ముందుకు వస్తాం. స్టాఫర్డ్ ఇచ్చిన నివేదిక వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఉంచుతాం. మాకు తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదు. జమ్ స్టాఫర్డ్ కు ఈ డర్టీ పిక్చర్ ను పంపిన మాట వాస్తవం. డర్టీ పిక్చర్ ను పరిశీలించి నివేదికలో ఆ వీడియో ఎడిట్ చేసింది కాదని తేల్చిన మాట నూటికి నూరుపాళ్లు నిజం. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఆదేశించాక ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పండి. ఫేక్ చరిత్ర కలిగిన మీ వద్ద నుంచి, మీ ప్రభుత్వం వద్ద పాఠాలు నేర్చు కోవాల్సిన అవసరం లేదు. సిఐడి చీఫ్ సునీల్‌కుమార్, మీడియా ముందుకు వచ్చి మొరుగుతున్న వైసిపి పనికిమాలిన వెదవల గురించి స్పందించాల్సిన అవసరం మాకు లేదని పట్టాభిరామ్ స్పష్టం చేశారు.