అమరావతి: మంత్రి పదవులు దక్కని సీనియర్ నాయకుల సేవలను మరో రూపంలో వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ెటీడీపీ సీనియర్ నేతలు పలువురు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. మంత్రి వర్గం కూర్పు చేసిన విధానాన్ని చంద్రబాబు వారికి వివరించారు. మంత్రివర్గంలో చోటు దక్కని వారి సేవలను మరో రూపంలో వినియోగించుకుంటామని సీఎం స్పష్టం చేశారు. కాగా తమకు కేటాయించిన శాఖలపై మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్.. సీఎంని కలిసి సంతోషం వ్యక్తం చేశారు. తనకు హోం శాఖ కేటాయించినందుకు అనిత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మంత్రులుగా సమర్థవంతంగా పనిచేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించారు. సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు