- 26 జిల్లాలలో వైసీపీ కార్యాలయల కోసం 2 ఎకరాల చొప్పున అక్రమంగా స్థలాల కేటయింపు
- రూ. 900 కోట్ల విలువైన స్థలాలకు ఒక్కదానికి కూడా సరైన అనుమతి లేదు
- అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటారా? రాష్ట్రం మీ సొంత జాగీరా?
- వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణంకు రాంకీ సంస్థకు ఏంటి సంబంధం ?
- జగన్ రెడ్డి లండన్ భవనంలోకి వెళితే.. ఈ భవనాలన్ని అయోధ్య రామిరెడ్డి పరం అవుతాయా?
- ప్రజా వేదికను కూల్చిన మీకు ఈ కూల్చివేతలను అడిగే హక్కు లేదు
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
అమరావతి,చైతన్యరథం: నాడు ప్రజా సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజా వేదిక అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేసిన వైసీపీ నేతలు.. నేడు సక్రమం కాకుండా అక్రమంగా నిర్మించిన భవనాలను కూలుస్తుంటే ఎందుకు పెడబొబ్బలు, గగ్గోలు పెడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. టీడీపీ మంగళగిరి జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా జగన్ రెడ్డి.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అధికారం ఉందని… అధికారం మీకే శాశ్వతమనే భ్రమలో 26 జిల్లాలలో వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం 2 ఎకరాల చొప్పున అక్రమంగా స్థలాలు కేటాయించారు. రూ. 900 కోట్ల విలువైన స్థలాలకు ఒక్కదానికి కూడా సరైన అనుమతి తీసుకోలేదు. అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటారా? రాష్ట్రం మీ సొంత జాగీరా? మా కార్యాలయాలు పడగొడతున్నారంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు. మీ కార్యాలయాలు పడగొట్టడం లేదు అక్రమంగా ఏ పర్మిషన్ లు తీసుకోకుండా నిర్మించిన అక్రమ కట్టడాలను పడగొడుతున్నారు. ప్రజా వేదిక ఏపార్టీది కాకపోయి, ఏవ్యక్తికి చెందింది కాకపోయినా చంద్రబాబు అక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించారని, ప్రజా సమస్యలపై నిర్ణయాలు తీసుకున్నారన్న అక్కసు, ఈర్షతో కూలగొట్టారు. శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తాడేపల్లి, నరసరావుపేట, నెల్లూరు, నంద్యాల, పుట్టపర్తి, బాపట్ల, కడప, తిరుపతుల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు మొదలు పెట్టారు. ఏ జిల్లాలో కూడా పర్మిషన్ తీసుకోలేదు. అధికారం మీ చేతుల్లో ఉంటే అక్రమ నిర్మాణాలు చేపడతారా? అక్రమాలు సక్రమం అవుతాయా?
వైసీపీ కార్యాలయాలకు రాంకీ అయోధ్య రామిరెడ్డికి ఏంటి సంబంధం?
సుప్రింకోర్టు తీర్పును ఉల్లంఘించి, గ్రీన్ ట్రిబునల్ ఆదేశాలు లెక్కపెట్టకుండా అక్రమంగా పార్టీ కార్యాలయాలను పంటకాలువలు, ప్రభుత్వ భూముల్లో చేపడితే చట్టం ఊరుకుంటుందా? పార్టీ కార్యాలయాలు అన్ని రాంకీ అయోధ్య రామిరెడ్డి గారు నిర్మిస్తారట.. ఎలా? వైసీపీ ఎత్తిపోతే దొడ్డిదారిన రాంకీ అయోద్యరామిరెడ్డికి వైసీపీ భవనాలను కట్టబెట్టేందుకు జగన్ రెడ్డి దురాలోచనగా ఉంది. పార్టీ కార్యాలయాల నిర్మాణంకు రాంకీ సంస్థకు సంబంధం ఏంటి? రాంకీ సంస్థ వైసీపీకి పార్టీకి స్వచ్ఛందంగా భవనాలను నిర్మిస్తామని ప్రకటన చేస్తుందా? జగన్ రెడ్డి లండన్ భవనంలోకి వెళితే ఈ భవనాలు అన్ని అయోధ్య రామిరెడ్డి పరం అవుతాయా? అయోధ్యరామిరెడ్డి పేరిట స్థలాలు భవనాలు అన్ని ఎందుకు ఉన్నాయో జగన్ రెడ్డి సమాధానం చెప్పగలడా? వైసీపీకి అధికారం ఇచ్చింది దోచుకు తింటానికా? పైగా నంగనాచి ఏడుపులు మోసలి కన్నీరు కరుస్తున్నారు.
అన్ని అనుమతులతో చట్టబద్దంగా టీడీపీ కేంద్ర కార్యాలయం నిర్మాణం
మళ్లీ టీడీపీ కార్యాలయం కట్టుకోవడానికి మేము ఒప్పుకున్నామని సిగ్గులేకుండా చెబుతున్నారు. ఎన్ని కేసులు పేట్టారు. అది కప్పి పెడితే పోతుందా? 22.06.2015 న ఆత్మకూరు గ్రామంలో ర్వే నెం. 392 లో 3.65 ఎకరాల భూమిని జీవో నెం.228 ద్వారా టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం అప్పగించడం జరిగింది. లీజ్ డీడీ, సేల్ డీడీ, మార్డిగేజ్ డీల్, సీఆర్ డీ అనుమతి తరువాతే మంగళగిరిలో జాతీయ పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగింది. అనుమతులు అన్ని తీసుకున్న తరువాతే చట్టబద్దంగా టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మించారు. ఆయినా ఆళ్ల రామకృష్టారెడ్డి సుప్రింకోర్టులో కేసు వేయిస్తే టీడీపీ పార్టీ కార్యాలయం సక్రమ నిర్మాణమేనని ఆ చెంప ఈచెంప వాయించారు. వైసీపీ చేపట్టినవి అన్ని అక్రమ కట్టడాలే.. ఇకనైన జగన్ రెడ్డి మొసలు కన్నీరు కార్చడం ఆపాలి.
అక్రమ కట్టడాల కూల్చివేతలను అడిగే హక్కు లేదు
అన్ని అనుమతులు ఉన్నాయి కాబట్టే జగన్ రెడ్డి చేయి టీడీపీ ఆఫీసుపై పడలేదు. లేదంటే ఈ దుర్మార్గుల చేతిలో టీడీపీ కార్యాలయం ధ్వంసం అయ్యేది. తాడేపల్లిలో మీరు కట్టుకున్న ప్రధాన కార్యాలయానికి కార్పొరేషన్, సీఆర్డీఏ పర్మిషన్ తీసుకున్నారా సేల్ డీడ్ సరిగా ఉందా, మార్టిగేజ్ డీడ్ రాయించారా? ఇక మీదనైనా అన్ని పర్మిషన్ లు తీసుకుని వైసీపీ భవనాలు నిర్మించుకోవాలి.. అక్రమంగా నిర్మిస్తే చట్టం, ప్రభుత్వం ఊరుకోదు. అధికారం శాశ్వతం కాదని చట్టాలు శాశ్వతమని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ సైట్ విజయవాడలో టీడీపీ పార్టీ కార్యాలయానికి కావాలంటే ఇవ్వడానికి వీళ్లేదని ఇరిగేషన్ శాఖ చెప్పింది. వాళ్లకు ఉన్న అనుమాలు తీర్చి డిమాండ్ చేసిన డబ్బులు కట్టి చట్టబద్దంగా తీసుకోవడానికి సంవత్సరకాలం పట్టింది. మీకులాగ దోచేయండి కొట్టేయండి అని మా చంద్రబాబు చెప్పరు. వైసీపీ నేతలు అక్రమంగా కట్టిన భవనాలు అన్ని కూల్చివేయడం సక్రమమే. అవి సక్రమం అయితే పడగొడుతుంటే కోర్టుకు వెళ్లకుండా ఉంటారా మీరు. అధికారంలో మీరే శాశ్వతంగా ఉంటారని ఇలాంటి తప్పుడు పనులకు పూనుకున్నారు. ప్రజా వేధికను కూల్చిన మీకు ఈ కూల్చివేతలను అడిగే హక్కు లేదు. కూల్చివేతలపై వైసీపీ నేతలు చేస్తున్న వాదనల్లో పసలేదు’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.+