చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రజాకాంక్ష నెరవేరుస్తా

సంక్షేమానికి పెద్దపీట.. అభివృద్ధి పరుగులు : సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Jun 26, 2024 at 6:13am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
ప్రజాకాంక్ష నెరవేరుస్తా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కూటమి ముందున్న సవాళ్లు అధిగమిస్తాం
  • వైసీపీ పాలనా వైఫల్యాలపై త్వరలో శ్వేతపత్రాలు
  • రైతు పాసు పుస్తకాలపై రాజముద్ర వేస్తాం
  • కుప్పం బహిరంగ సభలో సీఎం చంద్రబాబు వెల్లడి
  • హంద్రీనీవా ప్రాజెక్టు స్థితిని పరిశీలించిన సీఎం
  • రాజధానికి రూ.4.5 కోట్ల డ్వాక్రా విరాళాలు

కుప్పం (చైతన్యరథం): రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసి, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వం రూ.10 ఇచ్చి ప్రజల నుంచి రూ.100 దోచిందని, తమ ప్రభుత్వం రూ.15 ఇచ్చి రూ.100 సంపాదించే మార్గం చూపుతుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా, పేదరికంలేని సమాజం సాధించేలా పాలన సాగిస్తామన్నారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు మంగళవారం శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పరిశీలించారు. అనంతరం కుప్పంలోని ఎన్టీఆర్‌ విగ్రహంవద్ద బహిరంగ సభలో మాట్లాడారు.

మొన్నటి ఎన్నికల్లో చదువుకున్న అభ్యర్థులకు ఎమ్మెల్యేలుగా అవకాశమిచ్చాం. కేబినెట్‌లో 17మంది కొత్తవారికి అవకాశమిచ్చాం. ఏడుగురు మొదటిసారి గెలిచి మొదటిసారి మంత్రులయ్యారు. యువతకు టీడీపీ ప్రాధాన్యమిస్తుంది. బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుంది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. కుప్పంలో నాకు సామాజికవర్గం లేదు. వెనకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. ఎనిమిది మంది బీసీలకు మంత్రి పదవులిచ్చాం. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాను. మొదటి పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించాను. రెండో పర్యటన రాష్ట్ర భవిష్యత్తు అయిన అమరావతిలో పర్యటించాను. తర్వాత అసెంబ్లీ, కేబినెట్‌ సమావేశాలు పెట్టుకున్నాం. నా ప్రత్యక్ష దేవుళ్లయిన కుప్పం ప్రజలను కలవడానికి వచ్చాను. ప్రజా క్షేత్రానికి వెళ్లేందుకు ఇక్కడి నుండే శ్రీకారం చుట్టాను. కుప్పం ప్రజలకు రుణపడి ఉన్నా. ఐదేళ్లలో మీ రుణం తీర్చుకుంటా. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి కుప్పంను అన్ని విధాలా అగ్రస్థానంలో ఉంచుతా. పేదరికంలేని సమాజం నా లక్ష్యం. 1989లో మొదటిసారి కుప్పం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. అప్పటినుండి ఎనిమిదిసార్లు వరుసగా గెలిచాను’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

సంబంధితవార్తలు

శాంతిహోమంతో సన్నిధి శుద్ధి

ఏపీ ప్రభుత్వాసుపత్రులు దేశంలోనే బెస్ట్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

ఐదేళ్ల వైసీపీ పాలన ఓ పీడకల
‘2019 నుండి 2024 వరకు ఒక పీడకల. ఐదేళ్లు అరాచకం సృష్టించారు. దౌర్జన్యాలు చేశారు. నా జోలికే వచ్చారు. అన్న ్నక్యాంటీన్‌ పెట్టి అన్నం పెట్టాలనుకుంటే వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు. కుప్పంలో గ్రానైట్‌ మొత్తం తినేసి కేజీఎఫ్‌ తలపించేలా దోపిడీ చేశారు. నేను కుప్పం వస్తున్నానంటే జీవో-1 ద్వారా మన వాళ్లపై దాడులు చేసి కేసులు పెట్టారు. 30మందిని జైల్లో పెట్టారు. ఇది నేను మర్చిపోతానా? నాకు ఎవరిపైనా కోపం లేదు. కుప్పం ప్రజలపై ప్రేమ మాత్రమే ఉంది. ఎన్టీఆర్‌ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, కుప్పంలో రౌడీయిజం చేస్తే అదే చివరి రోజు. రౌడీయిజం, గంజాయి కుప్పంలో ఉండటానికి వీలులేదు. కుప్పం మున్సిపాలిటీలో పన్నులు పెంచారు తప్ప అభివృద్ధి లేదు. మోడల్‌ మున్సిపాలిటీగా కుప్పంను మార్చుతాం. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వేస్తా. నాలుగు మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం’ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

కుప్పంలో ప్రతి ఎకరాకు నీళ్లందిస్తాం
రూ.2లకే 20 లీటర్లు నీళ్లిస్తే దాన్ని కూడా నాశనం చేశారు. కుళాయి ద్వారా ప్రతి ఇంటికి నీళ్లందిస్తా. హంద్రీనీవా కాలువను ఎన్టీఆర్‌ ప్రారంభించారు. నేను వి.కోట వరకు నీళ్లుతెచ్చాను. ఐదేళ్లలో వైసీపీ హయాంలో 5 కి.మీ మేర కూడా నీళ్ల తీసుకురాలేదు. సినీ సెట్టింగులు పెట్టి ట్యాంకర్లలో నీళ్లు తెచ్చి కాల్వలో పోశారు. వైసీపీకి ఏమాత్రం రైతులపై ప్రేమ లేదు. అన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం అయ్యాయి. త్వరలోనే సాగునీటి ప్రాజెక్టుల దుస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తాను. హంద్రీనీవా ద్వారా అన్ని చెరువులు నింపి కుప్పంలో కరవన్నది లేకుండా చేస్తాం. యామిగానిపల్లె, మన మదనపల్లెలో రెండు చెరువులు నిర్మించి టీఎంసీ మేర నీటిని నింపుతాం. చెక్‌ డ్యాములు నిర్మించి నీళ్లు నిల్వ చేస్తాం. అవసరమైతే లిఫ్ట్‌లు పెట్టి పొలాలకు నీళ్లిస్తాం. సాగునీళ్లిస్తే ఇక్కడి రైతులు బంగారం పండిస్తారు. వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. నాడు నేను ఆవులు పట్టిస్తే ఎగతాళి చేశారు. కానీ ఇప్పడు అవే జీవనాధారం అయ్యాయి. పాల ఉత్పత్తిని పెంచుతాం. గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తాం. పేదరిక నిర్మూలన నా జీవిత ఆశయం. పేదరికంలేని కుటుంబం రావాలి. కుప్పం ఏరియా డెవలెప్మెంట్‌ అథారిటీ మళ్లీ ఏర్పాటు చేస్తాను. మల్లనూరు, రాళ్లమదుగూరును మండలాలుగా చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

7 అంశాలపై త్వరలో శ్వేత పత్రాలు
యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత నాది. కుప్పంకు టెక్స్‌ టైల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, వివిధ రకాల పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ద్రవిడ యూనివర్సిటీపై దృష్టి పెట్టి ప్రక్షాళన చేస్తా. యూనివర్సిటీ సిబ్బందికి జీతాలు విడుదల చేయిస్తా. ఎడ్యుకేషన్‌ హబ్‌గా కుప్పంను మార్చుతాం. మనం కట్టిన కమ్యూనిటీ భవనాలను గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసింది. వాటినీ పూర్తి చేస్తాం. తిరుపతి గంగమ్మ, నల్లప్పకొండ గేటురాయిస్వామి ఆలయం, కోదండ రామాలయం, ధర్మరాజుల ఆలయాలను అభివృద్ధి చేస్తాం. గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపుతాం. వైసీపీ ఐదేళ్లపాటు చేసిన తప్పులు, అరాచకాలతో నేను మోయలేనన్ని సమస్యలు తెచ్చి పెట్టారు. అప్పులు విపరీతంగా చేశారు. అయినా కష్టాలున్నాయని పారిపోయేవాణ్ని కాదు. ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారో అంతుబట్టటం లేదు. త్వరలో 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయబోతున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

పాసు పుస్తకాలపై రాజముద్ర వేస్తాం
‘16,347 పోస్టుల భర్తీకి ఇచ్చిన మాట ప్రకారం సంతకం చేశాం. కేబినెట్‌లో ఆమోదం తెలిపాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తెచ్చి పట్టాదారు పుస్తకాలపై బొమ్మలు ముద్రించుకున్నారు. టైటిల్‌ రిజిస్ట్రేటర్‌ను పెట్టుకుని భూములు దోచుకోవాలని చూశారు. అందుకే నల్ల చట్టాన్ని రద్దు చేసేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. పాసుపుస్తకాలపై జగన్‌ ఫోటో తొలగించి.. రాజముద్ర వేసి పుస్తకాలు రైతులకు అందిస్తాం. పెన్షన్‌ను కూడా రూ.4 వేలకు పెంచాం. మూడు నెలల బకాయి కలిపి జూలైలో రూ.7 వేలు ఇవ్వబోతున్నాం. అన్న క్యాంటీన్లు కూడా 183 ప్రారంభించబోతున్నాం. వాటిని కూడా పెంచుకుంటూ పోతాం. స్కిల్‌ గణన కూడా చేపట్టి ఎవరికి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలో చేస్తాం. సమైక్యరాష్ట్రంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాలు బలంగా తయారయ్యాయి. పసుపు కుంకుమ కింద ప్రతి డ్వాక్రా మహిళకు గతంలో రూ.10 వేలు అందించాం. వడ్డీలేని రుణాలు అందించాం. డ్వాక్రా సంఘాల మహిళలను లక్షాధికారులను చేస్తాం. డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం. సూపర్‌-6 కూడా అమలు చేస్తాం’ అన్నారు.

రాజధాని నిర్మాణానికి విరాళాలు
అమరావతి రాజధానికి పలువురు విరాళాలు అందించారు. కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు విరాళాలకు సంబంధించిన చెక్కులను అందించారు. చిత్తూరు జిల్లా డ్వాక్రా సంఘాల తరపున రూ.4.5 కోట్లు, రామకుప్పంకు చెందిన టీడీపీ నేత ఆనందరెడ్డి రూ.5 లక్షలు, కుప్పంకు చెందిన ప్రేమ్‌కుమార్‌ రూ.లక్షను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వారిని సీఎం చంద్రబాబు అభినందించారు.

Tags: అధినేత నారా చంద్రబాబు నాయుడుకుప్పం అభివృద్ధికుప్పం నియోజకవర్గంకుప్పం పర్యటనడ్వాక్రా మహిళలురాజధాని నిర్మాణంవిరాళాలుసీఎం చంద్రబాబు
Previous Post

టీడీపీకి మాత్రమే పింఛన్లపై పేటెంట్‌

Next Post

అడ్డగోలు నిర్మాణాలను చట్టం చూస్తూ ఊరుకోవాలా?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026

కార్యకర్త
@ June 11, 2026
స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

చైతన్యరధం
@ June 11, 2026
ఆంధ్రప్రదేశ్

హ్యాపీ బర్త్ డే బాలా మావయ్య

చైతన్యరధం
@ June 11, 2026
పద్మభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్

పద్మభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

చైతన్యరధం
@ June 11, 2026
దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ
ఆంధ్రప్రదేశ్

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026

కార్యకర్త
@ June 10, 2026
అండగా నిలబడతాం
ఆంధ్రప్రదేశ్

అండగా నిలబడతాం

చైతన్యరధం
@ June 10, 2026
స్టీల్ ప్లాంట్ ప్రమాదం..
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

చైతన్యరధం
@ June 10, 2026
Load More

ముఖ్య వార్తలు

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
రీ సర్వేలో సమస్యల పరిష్కారం

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

చైతన్యరధం
@ June 9, 2026
అభిమానికి ఆత్మీయ పలకరింపు

అభిమానికి ఆత్మీయ పలకరింపు

చైతన్యరధం
@ June 9, 2026
2027 నాటికి భూ రికార్డులు క్లీన్

2027 నాటికి భూ రికార్డులు క్లీన్

చైతన్యరధం
@ June 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

చైతన్యరధం
@ June 11, 2026

హ్యాపీ బర్త్ డే బాలా మావయ్య

చైతన్యరధం
@ June 11, 2026
పద్మభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

పద్మభూషణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

చైతన్యరధం
@ June 11, 2026
దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist