• వెంకటగిరి నియోజకవర్గం సిద్ధగుంట గ్రామ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో వైసిపినేతల అండతో కొందరు సర్వే నంబర్ 114-1లో 8.87ఎకరాల భూమిని చదునుచేసి వ్యవసాయం చేస్తున్నారు.
• బ్రిటీష్ కాలంలో వేసిన సరిహద్దు రాళ్లను పీకేశారు. ప్రశ్నించిన మాపై అధికారపార్టీ నేతలు దాడికి పాల్పడ్డారు.
• మీరు అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకుల అక్రమాలపై చర్యలు తీసుకోండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది.
• భూములు ఖాళీగా కనబడితే కబ్జాచేయడం నిత్యకృత్యంగా మారింది.
• ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడటడం, ఎదురు కేసులు పెట్టడం పరిపాటైంది.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి నాయకులు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుంటాం.
• తప్పుడు కేసులు బనాయించిన వైసిపి నాయకులు, పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటాం.