• వెంకటగిరి నియోజకవర్గం సిద్ధవరం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో సుమారు 300కుటుంబాలు ఉన్నాయి.
• కాటూరుపాడు నుండి 3కిలోమీటర్లు రోడ్డు అధ్వాన్నంగా ఉంది.
• అదే మార్గంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి.
• ఈ మార్గం నుండే విద్యార్థులు పాఠశాలకు వెళ్లిరావాల్సి ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు.
• వైసీపీ అధికారంలోకి వచ్చాక మా కాలనీకి ఒక్క ఇల్లు ఇవ్వలేదు.
• నాలుగేళ్లలో మా గ్రామంలో ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదు.
• మా గ్రామానికి శ్మశానం లేదు, వాటర్ ట్యాంకు లేనందున తాగునీటికి చాలా ఇబ్బందిగా ఉంది.
• మా గ్రామంలోని కాలువపై బ్రిడ్జి నిర్మించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు, తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నిండాలన్నది జగన్ సిద్ధాంతం.
• జె-బ్రాండ్స్ అమ్మకాలపై ఉన్న శ్రద్ధ గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై లేకపోవడం దురదృష్టకరం.
• వైసిపి అధికారంలోకి వచ్చాక రూ.8,660 కోట్ల పంచాయితీల నిధులను దారిమళ్లించి తీరని ద్రోహం చేశారు.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం.
• అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం, ప్రతిఇంటికి తాగునీటి కుళాయి అందజేస్తాం.