చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

నైపుణ్య యువత కూటమి ప్రభుత్వ లక్ష్యం

యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరంలో లోకేష్

చైతన్యరధం by చైతన్యరధం
January 22, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
నైపుణ్య యువత కూటమి ప్రభుత్వ లక్ష్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విద్యారంగంలో సంస్కరణలతో సమూల మార్పులు
  • నైపుణ్యం, కౌశలంలో 4 లక్షల మందికి శిక్షణ
  • ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మహిళలు, యువతే చోదక శక్తులు
  • యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరంలో లోకేష్
  • దేశ సాంకేతిక పురోగతి, సామాజిక సమానత్వంపై చర్చ

దావోస్(స్విట్జర్లాండ్): నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దావోస్‌లో యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం, వరల్డ్ ఉమెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశ సాంకేతిక పురోగతి, సామాజిక సమానత్వం(విద్య, మహిళా సాధికారత, వనరుల పంపిణీ)  అంశంపై జరిగిన చర్చలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీలో భవిష్యత్ అవసరాలకు తగ్గ నైపుణ్యం కలిగిన యువతను తయారుచేయడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. తద్వారా ఉద్యోగాల కల్పన, పోటీతత్వం, జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది. రాబోయే సాంకేతిక మార్పులకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవస రం ఉంది. అప్పుడే అత్యధిక జనాభా గల భారతదేశం ప్రయోజనం పొందగలుగుతుంది. భవిష్యత్ మార్పులను ముందుగానే గుర్తించి ఏపీలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు ఉపాధి, ఆవిష్కరణల ఫలితాలను లక్ష్యంగా చేసుకుని సమన్వ యంతో విద్య, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ మౌలిక వసతుల రంగాల్లో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆశయం అవకాశాన్ని కలిసే దశ నైపుణ్యాభివృద్ధే కాబట్టి మేం మొదట స్కిల్లింగ్‌తో ప్రారంభించాం.

నైపుణ్యం, కౌశలంలో 4 లక్షల మంది యువత, మహిళలకు శిక్షణ
‘నైపుణ్యం’ దేశంలోనే అత్యంత సమగ్ర ఏఐ ఆధారిత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి వేదికలలో ఒకటి. ఇది శిక్షణకే పరిమితం కాకుండా నైపుణ్యాలు, సర్టిఫికేషన్లు, నియామకాలు, పరిశ్రమల తక్షణ అవసరాలను ట్రాక్ చేస్తుంది. నిరుద్యోగ యువత కోసం ప్రారంభించిన ‘కౌశలం’ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, గ్రామీణ యువత కోసం డిమాండ్ ఆధారిత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించడం జరిగింది. తద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పన జరుగుతుంది. ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు 4 లక్షల మందికి పైగా యువత, మహిళలకు నైపుణ్య శిక్షణ అందివ్వడం జరిగింది.
విద్యారంగంలో సంస్కరణల ద్వారా సమూల మార్పులు
విద్యా సంస్కరణలు పునాది వంటివి. అందుకే మేం కేవలం సిలబస్‌లనే కాదు, నేర్చుకునే విధానాన్నే సంస్కరిస్తున్నాం. 45కు పైగా విద్యా యాప్‌లను ఒకే డిజిటల్ వేదికగా ఏకీకృతం చేసి.. ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిర్వాహకులను అనుసంధానించాం. భవిష్యత్తు నైపుణ్యాలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ, రోబోటిక్స్, స్టెమ్‌ను ప్రవేశపెడుతున్నాం. అమెరికా, యూకే, యూరప్, సింగపూర్, ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాల ద్వారా గ్లోబల్ ఎక్స్‌పోజర్‌ను నిర్మిస్తు న్నాం. ఒరాకిల్, సామ్‌సంగ్, సిస్కో, ష్నైడర్ ఎలక్ట్రిక్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ద్వారా పరిశ్రమకు అనుగుణమైన సర్టిఫికేషన్లను అందిస్తున్నాం. ఒరాకిల్ భాగస్వామ్యం ద్వారా ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు గ్లోబల్ స్టాండర్డ్ ఏఐ, క్లౌడ్, డేటా సైన్స్ విద్యను అభ్యసిస్తున్నారు.

ఏపీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్
సరైన విధానాలు, పాలన, సాంకేతిక మౌలిక వసతులు రూపొందిస్తే.. సమగ్రత, సహనశీలత, స్థిరత్వం వంటి లక్ష్యాలను సాధించ గలుగుతాం. అన్ని రంగాల్లో ఇప్పుడు నిర్ణయాలను పేపర్ వర్క్ కాదు, డేటానే నడిపిస్తోంది. రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా సమస్యలకు ప్రతిస్పందించడమే కాకుండా ముందుగానే పరిష్కరించగలుగుతున్నాం. విపత్తు నిర్వహణలో, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు ఆర్టీజీఎస్ తోడ్పాటు అందించింది. మరోవైపు నాలుగో తరం పారిశ్రామిక విప్లవం కోసం ఏపీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్‌ను ప్రారంభించడం జరిగింది. తద్వారా ఏపీ కేవలం సాంకేతికతను ఉపయోగించుకునే రాష్ట్రం గా కాకుండా సాంకేతిక విధానాలను రూపొందించే దేశాల సరసన నిలవనుంది. అభివృద్ధి వికేంద్రీకరణకు సాంకేతికత దోహదప డుతుంది. టైర్-2, టైర్-3 పట్టణాల్లో స్టార్టప్‌లను శక్తివంతం చేస్తోంది. ఏఐ సిటీ, డ్రోన్ సిటీలు సమగ్ర ఆవిష్కరణ ఎకోసిస్టమ్‌లుగా అభివృద్ధి చెందుతున్నాయి. సైబర్ భద్రత, సహనశీలత, ఎథికల్ ఏఐ.. మా పాలన రూపకల్పనల్లో నిక్షిప్తమై ఉన్నాయి. పెట్టుబడి దారుల కు ఇది దీర్ఘకాలిక స్థిరత్వం, అంచనా వేయగలిగే విధానం, సంస్థాగత పరిపక్వతను సూచిస్తుంది.

స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తోంది. వ్యాపారాలకు విధాన స్థిరత్వం, వేగం, స్పష్టత అవసరం. ప్రభుత్వం అవి అందించాలి. ప్రైవేట్ మూలధనం, నైపుణ్యాలను వినియోగించడం ద్వారా ఫలితాలు చూపే సమయాన్ని తగ్గించి నాణ్యతను మెరుగుపరుస్తున్నాం. రూ.1.16 లక్షల కోట్ల విలువైన 270 ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అతిపెద్ద పీపీపీ పైప్‌లైన్‌కు నాయకత్వం వహిస్తోంది. ఇది రాష్ట్ర పాలనా సామర్థ్యంపై పెట్టుబడిదారుల బలమైన నమ్మకానికి నిదర్శనం. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నాం.

ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మహిళలు, యువతే చోదక శక్తులు
ఆర్థిక వ్యవస్థలో మార్పు, వృద్ధికి మహిళలు, యువతే చోదక శక్తులు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషిచేస్తోంది. లీప్ ద్వారా ప్రతి ఇంట్లో ఒక మహిళా వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. జాతీయ పట్టణ జీవనోపాధి మిష న్ కింద పట్టణ పేదరికం, అస్థిరతను తగ్గించేందుకు మహిళా స్వయం సహాయక సంఘాలకు విస్తృతస్థాయిలో రుణ సహాయక వ్యవస్థను నిర్మించడం జరిగింది. ఇది ఆర్థిక స్వావలంబన, వ్యాపార వృద్ధి, జీవన భద్రతను బలోపేతం చేస్తుంది. మహిళలు, యువత కలిసి రాష్ట్ర భవిష్యత్ కార్మికశక్తిగా నిలుస్తున్నారు.

2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం
పాలనలోనూ అనేక మార్పులు తీసుకువచ్చాం. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 36 విభాగాల్లో 700కు పైగా సేవలను అందించడం జరుగుతోంది. వాట్సాప్ గవర్నెన్స్ బెస్ట్ ప్రాక్టీసెస్‌గా కేంద్ర ప్రభుత్వం సైతం గుర్తించింది. ఫిన్‌టెక్ వ్యాలీ విశాఖపట్నం.. రీజనల్ ఎకోసిస్టమ్‌ను గ్లోబల్ ఫిన్‌టెక్, డిజిటల్ మార్కెట్లతో అనుసంధానిస్తోంది. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు డీప్ టెక్, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి, సుస్థిరత దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఉమెన్ ఫౌండేషన్ సీఈవో రూపదాష్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గౌరవ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Previous Post

ప్రపంచానికి నమూనాగా ఏపీ ప్రకృతి వ్యవసాయం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 22-01-2026

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 22-01-2026

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 Telugu Desam Party.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.