- రాష్ట్రంలో ప్రతి నియోజవర్గంలో గో సంరక్షణ కేంద్రాలు
- విశాఖ, భీమిలి బీచ్‌ల రహదారుల్లో శ్రీవారి కీర్తనలకు స్పీకర్లు
- టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడుకు ఎంపీ కలిశెట్టి వినతిపత్రం
తిరుపతి(చైతన్యరథం): టీటీడీ ధర్మకర్తల సభ్యుల సమావేశంలో పాల్గొన్న చైర్మన్ బి.ఆర్.నాయుడును సోమవారం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిశారు. టీటీడీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై వినతిపత్రం అం దజే శారు. అందులో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మత్స్యకార ప్రాంతాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాలు, ఫంక్షన్ హాళ్లు నిర్మించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గోవు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేంద్రాలు గోవు సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా అండమాన్ నికోబార్, కొండమల్గాం (ఎచ్చెర్ల నియోజకవర్గం), ముంబాయి, భువ నేశ్వర్ వంటి చోట్ల వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణాల ఆవశ్యకతను వివరించా రు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్నదాన సేవలను దేశంలోని ఇతర ప్రధాన నగరాలలోనూ అందించాలని సూచించారు. విశాఖపట్నం, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ సేవలు ప్రారంభించటం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక అనుభవం కలగాలని కోరారు.
2019 తర్వాత టీటీడీ నిర్మించిన కొత్త ఫంక్షన్ హాళ్లలో ధార్మిక ఉత్సవాలు, పండుగలు, భక్తి సమ్మేళనాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవా లని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా స్థానిక భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పారు. విశాఖపట్నం జిల్లా రుషికొండ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆర్కే బీచ్ వైపు, అలాగే మరోవైపు భీమిలి వరకు రహదారి వెంట ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేంకటేశ్వర నామాలు ప్రసారం చేయడం కోసం స్పీకర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. ప్రతి ఉదయం, సాయంత్రం వేళలో నామస్మరణ పఠనాలు వినిపించడం వల్ల ఆధ్యాత్మిక ప్రేరణ కలుగుతుందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు. ఇది పర్యాటకులను ఆకర్షించడంతో పాటు భక్తుల్లో భక్తి భావం పెంపొందించేలా చేస్తుందన్నారు. స్పందించిన టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు సూచ నలను స్వీకరించి వాటి అమలుకు చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.