- మున్సిపల్ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు
- ఆశా వర్కర్లకు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు టీడీపీ సంఫీుభావం
- ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చి ప్రజలను జగన్ మోసగించారు
అమరావతి: ఆంధ్రద్రేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. తన పాదయాత్రలో ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేశారని విమర్శించారు. మంగళవారం నుంచి ప్రారంభం అవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టీడీపీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు.
పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశాడు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, త్వరలో వలంటీర్లు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి నెలకొంది. మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టీడీపీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తోంది. అంగన్వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతు తెలిపాయో అలానే తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పిలుపు ఇస్తున్నానని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు టీడీపీ సంఫీుభావం
గత ఆరు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహించడం శోచనీయం. మినిమమ్ టైం స్కేల్ విషయంలో జీవోల మీద జీవోలు ఇచ్చి అమలు చేయకపోవడం, ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించే చర్యలకు పాల్పడటం దారుణం. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంఫీుభావం తెలియజేస్తోంది. సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.