చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పారిశ్రామిక మైత్రి బలోపేతం

దుబాయ్‌లోని భారత ఎంబసీ ప్రతినిధులతో భేటీలో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Oct 23, 2025 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పారిశ్రామిక మైత్రి బలోపేతం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఏపీ- యూఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలపడేందుకు సహకరించండి
షిప్‌ బిల్డింగ్‌నుంచి డేటా సెంటర్ల వరకూ ఏపీలో అపారమైన అవకాశాలు
యూఏఈలోని తెలుగువారి అభివృద్ధికి తోడ్పాటు అందించండి
మోదీ చొరవతోనే భారత్‌లో విప్లవాత్మక మార్పులు
దుబాయ్‌లోని భారత ఎంబసీ ప్రతినిధులతో భేటీలో సీఎం చంద్రబాబు

దుబాయ్‌ (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌- యూఏఈ మధ్య పారిశ్రామిక బంధం మరింత బలపడేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధులను కోరారు. పెట్టుబడుల సాధనకు, నవంబర్‌లో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానాలు పలికేందుకు యూఏఈలో మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సీఎం చంద్రబాబు దుబాయ్‌ చేరుకున్నారు. దిగిన వెంటనే దుబాయ్‌, అబుదాబి దేశాల్లో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. దుబాయ్‌ ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ సతీష్‌కుమార్‌ శివన్‌, అబుదాబిలోని ఇండియన్‌ ఎంబసీ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ అమర్నాథ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. దుబాయ్‌ సహా యూఏఈ దేశాల్లోని వివిధ కంపెనీల వివరాలు, ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలు, ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉంటుందనే అంశాలపై వారితో చర్చించారు. గ్రీన్‌ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్‌, పెట్రో కెమికల్స్‌, పోర్టులు, లాజిస్టిక్స్‌, ఏవియేషన్‌, ఇండస్ట్రియల్‌ పార్కులు, రియల్‌ ఎస్టేట్‌, డేటా సెంటర్లు, ఆతిధ్యరంగం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీలో వనరులు, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026

వేదవతి ఎత్తిపోతలకు కదలి

చైతన్యరధం ఈ పేపర్ 13-06-2026

గూగుల్‌ సంస్థ విశాఖలో అతిపెద్ద డేటా ఏఐ హబ్‌ 15 బిలియన్‌ డాలర్లతో పెట్టుబడులు పెడుతోందని సీఎం వారికి వివరించారు. ఏపీకి 1054 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీరప్రాంతంలో పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడిరచారు. ఏపీలో లాజిస్టిక్స్‌ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టు సీఎం వివరించారు. యూఏఈ దేశాల సావరీన్‌ ఫండ్స్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపైనా వారితో ముఖ్యమంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా దుబాయ్‌ సహా వివిధ దేశాల కంపెనీలకు వివరించాలని ఎంబసీ ప్రతినిధులకు సీఎం సూచించారు. యూఏఈ -ఏపీ పారిశ్రామిక బంధం ధృఢంగా ఉండేలా చూడాలని సూచించారు. ఇప్పటికే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ దేశాలకు చెందిన వివిధ సంస్థలు ముందుకొచ్చిన నేపథ్యంలో ఏపీలో ఉన్న అవకాశాలను ఆయా దేశాల్లోని కంపెనీలకు వివరించాలని చెప్పారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తోందన్నారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సీఐఐతో కలిసి భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని… యూఏఈలోని వివిధ సంస్థలను సదస్సుకు ఆహ్వానిస్తున్నామని దుబాయిలోని భారత ఎంబసీ ప్రతినిధులకు సీఎం వివరించారు. ప్రధాని మోదీ చొరవవల్లే దేశంలో చాలా మార్పులు వచ్చాయని.. భారత్‌ను పెద్దఎత్తున ఆయన ప్రమోట్‌ చేస్తున్నారన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరగడానికి ప్రధాని చేస్తోన్న కృషే కారణమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

విద్య వైద్యరంగాల్లో యూఏఈ ఆసక్తి
ట్రేడ్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో భారత్‌ దేశానికి యూఏఈ భాగస్వామిగా ఉందని దుబాయ్‌లోని కాన్సులేట్‌ జనరల్‌ సతీష్‌ కుమార్‌ శివన్‌ వివరించారు. ఇరుదేశాల పరస్పర పెట్టుబడులతో బంధం మరింత బలపడిరదని సీఎంకు వివరించారు. మూడేళ్లలో 50శాతంమేర ఇరుదేశాల మధ్య వాణిజ్యం పెరిగిందన్నారు. ప్రస్తుతం యూఏఈ టెక్నాలజీ రంగంపై ఎక్కువగా వ్యయం చేస్తోందని భారత్‌నుంచి వచ్చే నిపుణులకు భారీఎత్తున అవకాశాలున్నాయని సీఎంకు వివరించారు. ప్రస్తుతం యూఏఈ నాన్‌ ఆయిల్‌ ఎకానమీ వైపుగా దృష్టి పెట్టిందని తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై యూఏఈ 2017లోనే ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిందని సీఎంకు సతీష్‌ కుమార్‌ శివన్‌ తెలిపారు. మరోవైపు యూఏఈలో 23 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు భారత్‌లో పెట్టిందని ఇందులో 50 శాతం గత మూడేళ్లలో వచ్చినవేనని యూఏఈలోని డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ ఎ అమర్నాథ్‌ తెలిపారు. భారత్‌లోని విద్య వైద్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ ఆసక్తి చూపుతోందని వివరించారు. గ్రీన్‌ ఎనర్జీ, ఫుడ్‌ పార్క్‌లోనూ యూఏఈ నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అమర్నాథ్‌ తెలిపారు. సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్‌ రెడ్డి, టీజీ భరత్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎంకు సాదర స్వాగతం
దుబాయ్‌లోని అంతర్జాతీయస్థాయి సంస్థలకు అవసరమైన టెక్నాలజీ నిపుణులను అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. యూఏఈలో తెలుగువాళ్లు ఉన్నారని… వారికి అవసరమైన సహకారాన్ని అందించాలని ఎంబసీ ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. దుబాయ్‌లో తన పర్యటన చివరి రోజున తెలుగు డయాస్పోరా కార్యక్రమం నిర్వహించనున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. అంతకుముందు హైదరాబాద్‌నుంచి దుబాయ్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు స్థానిక తెలుగు ప్రజలు విమానాశ్రయానికి వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. దుబాయిలో ఉన్న తెలుగువారు.. ప్రత్యేకించి మహిళలు తెలుగు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని సీఎం అప్యాయంగా పలకరించారు.

Previous Post

యూఏఈలో సీఎం చంద్రబాబు

Next Post

అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచస్థాయి గ్రంథాలయం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026

కార్యకర్త
@ June 14, 2026
ఆంధ్రప్రదేశ్

వేదవతి ఎత్తిపోతలకు కదలి

చైతన్యరధం
@ June 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-06-2026

కార్యకర్త
@ June 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-06-2026

కార్యకర్త
@ June 12, 2026
మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

చైతన్యరధం
@ June 12, 2026
వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్
ఆంధ్రప్రదేశ్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-06-2026

కార్యకర్త
@ June 11, 2026
స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

చైతన్యరధం
@ June 11, 2026
Load More

ముఖ్య వార్తలు

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
రీ సర్వేలో సమస్యల పరిష్కారం

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

చైతన్యరధం
@ June 9, 2026
అభిమానికి ఆత్మీయ పలకరింపు

అభిమానికి ఆత్మీయ పలకరింపు

చైతన్యరధం
@ June 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వేదవతి ఎత్తిపోతలకు కదలి

చైతన్యరధం
@ June 14, 2026
మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

చైతన్యరధం
@ June 12, 2026
వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

చైతన్యరధం
@ June 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist