చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రజాసేవకులు, దోపిడీదారుల మధ్య పోరాటం: చంద్రబాబు

తణుకులో ఎన్డీఏ ప్రజాగళం సభ

by చైతన్యరధం
Apr 11, 2024 at 8:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రజాసేవకులు, దోపిడీదారుల మధ్య పోరాటం: చంద్రబాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
` నా అనుభవం.. పవన్‌లో సేవాభావం మంచి జోడీ
` అగ్నికి వాయువులా ప్రజాగళానికి తోడైన వారాహి
` పశ్చిమలో క్లీన్‌స్వీప్‌ ఖాయం
` మే 13న ప్రజలు ఇచ్చే తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి
` రాష్ట్రం కోసమే మూడు పార్టీలు కలిశాయి
` కేంద్రం మద్దతుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం
` పొత్తును గెలిపించడం కోసం నేను, పవన్‌ త్యాగాలు చేశాం
` ప్రజల కోసం పోరాడుతున్న రియల్‌ హీరో పవన్‌
` గోనె సంచులు అడిగిన రైతుల్ని దుర్భాషలాడిన వ్యక్తిని చిత్తుగా ఓడిరచాలి
` తణుకు ప్రజాగళం సభలో చంద్రబాబు
తణుకు (చైతన్యరథం): అధికారమంటే ప్రజలకు సేవచేసే అవకాశంగా తాము భావిస్తామని, అదే జగన్‌ రెడ్డి మాత్రం దోపిడీకి, ప్రజాసంపద లూటీకి లైసెన్స్‌గా భావిస్తాడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ప్రజాసేవకులకు, దోపిడీదారులకు మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. అగ్నికి వాయువు తోడైనట్లు, ప్రజాగళానికి వారాహి తోడైంది.. ప్రజల నుండి పుట్టిన ఈ అగ్ని చెడును దహించబోతోంది.. జగన్‌ అహంకారాన్ని బూడిద చేయబోతోందని ఉద్ఘాటించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో బుధవారం జరిగిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో కలిసి పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ తణుకు సభ అదిరిపోయిందన్నారు. జగన్‌ రెడ్డీ గుర్తుంచుకో.. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో వైసీపీ కొట్టుకుపోవడం తధ్యమన్నారు. నేటి తణుకు సభ సాక్షిగా చెబుతున్నా.. సైకిల్‌ స్పీడుకు తిరుగు లేదు. గ్లాస్‌ జోరుకు ఎదురు లేదు. కమల వికాసానికి అడ్డే లేదు. రాష్ట్రానికి ఇకపై అన్నీ మంచి రోజులే. భవిష్యత్తు మొత్తం యువతదే. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి టీడీపీ`జనసేన`బీజేపీ చేతులు కలిపాయి. మూడు పార్టీల జెండాలు వేరయినా.. అజెండా ఒకటే. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే మా అజెండా అని చంద్రబాబు స్పష్టం చేశారు.
2014లో విభజన కష్టాల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు మూడు పార్టీల నేతలం కలిశాం. నేడు జగన్‌ రెడ్డి కబంధ హస్తాల్లో దెబ్బతిన్న రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కలిశాం. 40 ఏళ్ల అనుభవం గల నేను, ప్రజలకు సేవచేయాలనే తపన కలిగిన పవన్‌ కల్యాణ్‌, దేశాన్ని ప్రపంచంలో నెంబర్‌ వన్‌ చేయాలనుకునే నరేంద్ర మోదీ కలిసి వస్తున్నాం. పవన్‌ కల్యాణ్‌ సినిమా హీరోగా, కోట్ల ఆదాయం, సుఖమయమైన సినిమా జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం వచ్చారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తూ పవన్‌ కల్యాణ్‌ నిలబడినందుకు అభినందిస్తున్నా. ఆయనపై అనేక రకాలైన దాడులు చేశారు. అవమానించారు. అయినా ఎక్కడా తొణక్కుండా నిలబడ్డారు. నేను ఇబ్బందుల్లో ఉన్నపుడు అండగా నిలవడాన్ని ఎప్పుడూ మరచిపోను. చీకటి పాలనను అంతం చేసే ఈ పోరాటంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ప్రకటించిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరమని ఎన్డీఏతో కలిశామని చంద్రబాబు చెప్పారు.
పశ్చిమ గోదావరిలో క్లీన్‌స్వీప్‌
గతంలో ఉమ్మడి జిల్లాలో 15 సీట్లకు 15 సీట్లు గెలిపించారు. ఇప్పుడు కూడా కలిసి వస్తున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి ప్రజానీకం ఊపు చూస్తుంటే జగన్‌ రెడ్డికి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. యువత కన్నెర్ర జేస్తే జగన్‌ రెడ్డి ఎక్కడికి పారిపోతాడో తెలియదు. 2014లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేశాను. అధికారాన్ని రాష్ట్రం కోసమే ఉపయోగించాం. అద్భుతమైన రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఎకరాకు నీరివ్వడమే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చా. యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టి 72 శాతం పనులు పూర్తి చేశాం. 11 కేంద్ర విద్యా సంస్థలు తెచ్చాం. 100కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేశాం.  ప్రజలకు సాధికారత కల్పించాను. ప్రతి కుటుంబానికి బాసటగా నిలిచాం. ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా తిరిగి పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాను. జాబు రావాలంటే మళ్లీ బాబు రావాల్సిందే. వచ్చే 30 రోజులు యువత కష్టపడి పని చేయాలి. స్టేట్‌ ఫస్ట్‌ నినాదంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
రాష్ట్రాభివృద్ధికి ఆక్సిజన్‌ ఈ కూటమి
2014-19 మధ్య రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో ఆలోచించండి. 2019 తర్వాత ఎలా ఉందో చూడండి. జగన్‌ ఎన్నికలకు ముందు ముద్దులు పెట్టి, నెత్తిన చెయ్యి పెట్టి, బుగ్గలు నిమిరాడు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి బాదుడు తప్ప ఇంకేమైనా ఉందా? రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వెంటిలేటర్‌ పైకి నెట్టాడు. కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఎన్డీఏ అనే ఆక్సిజన్‌ అవసరం. శక్తినిచ్చి బతికిస్తుంది. రాజధాని కట్టుకోవాలి. పోలవరం సహా.. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలి. రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలి. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇండస్ట్రియల్‌ కారిడార్లు అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే శిథిలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోగలం. ఈ విషయాన్ని యువత గుర్తుంచుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.
ప్రతి ఇంట్లో చర్చ జరగాలి
నాకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు. రాష్ట్ర కోసం యువత భవిష్యత్తు కోసం కలిసి వచ్చాం. ప్రతి ఇల్లు, ప్రతి పౌరుడూ ఆలోచించాలి. తణుకు గడ్డపై నుండి అడుగుతున్నా. విధ్వంస పాలన కావాలా..అభివృద్ధి కావాలా? సంక్షోభం సృష్టించేవారు కావాలా.. సంక్షేమం అందించేవారు కావాలా? మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా.. గంజాయి , డ్రగ్స్‌ కావాలా? ఆస్తులకు రక్షణ కావాలా..  భూ మాఫియా కావాలా? రూ.10 ఇచ్చి రూ.100 దోచేసే దొంగలు కావాలా.. సంపద పెంచే కూటమి కావాలా? సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేవారు కావాలా.. సంపద సృష్టించేవారు కావాలా? ఆడబిడ్డలు ఆలోచించుకోవాలి. ధరల బాదుడు కావాలో.. ప్రజా పాలన కావాలో ఆలోచించాలి. జే బ్రాండ్స్‌ మద్యంతో ప్రాణాలు తీసి, ఆస్తులు దోచుకునే వారు కావాలో.. జే బ్రాండ్స్‌ ని పూర్తిగా నిషేధించే వారు కావాలో ఆలోచించాలి. దళితుల్ని చంపి డోర్‌ డెలివరీ చేసేవారు కావాలో.. ఇన్నోవా కార్లు ఇచ్చి ఉపాధి కల్పించే వారు కావాలో ఆలోచించుకోండి. ప్రతి ఇంట్లో ఈ అంశాలపై చర్చ జరగాలి. నేడు కిరాణా కొట్టులో కూడా డిజిటల్‌ చెల్లింపులు ఉన్నాయి. కానీ మద్యం షాపుల్లో మాత్రం లేవు. ఎందుకు? ఆ సొమ్ము ఎటు పోతోందని చంద్రబాబు ప్రశ్నించారు.
రైతును రాజుగా చేస్తాం
రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మే 13న ఓటు వేయండి. రాష్ట్రంలో ఏ  రైతయినా సంతోషంగా ఉన్నాడా? ఇక్కడే ఒక మంత్రి ఉన్నాడు. రైతులకు కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేకపోతున్నాడు. మళ్లీ రైతుని రాజుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. రైతులంతా ఆలోచించండి. ధాన్యం కొనుగోళ్లు చేయకుంటే.. టీడీపీ, జనసేన నాయకులు రోడ్డెక్కి పోరాడాల్సి వచ్చింది. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అని చెప్పిన జగన్‌ రెడ్డి ఎన్ని ఉద్యోగాలిచ్చాడు? మెగా డీఎస్సీ పేరుతో దగా చేశాడు. మేము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతాం. ప్రతి ఒక్కరికీ ఉద్యోగం, ఉపాధి కల్పనకు ప్రత్యేక శ్రద్ధ పెడతానని చంద్రబాబు చెప్పారు.
బాగుపడింది జగన్‌ రెడ్డి మాత్రమే
జగన్‌ రెడ్డి తన సభల్లో పేదల మనిషినని చెబుతున్నాడు. పేదల ఆస్తులు దొంగిలించిన ఏకైక నాయకుడు జగన్‌ రెడ్డి. ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కరైనా బాగుపడ్డారా? ఎవరి ఆదాయం అయినా పెరిగిందా? కానీ ఖర్చులు పెరిగాయి. అప్పులు పెరిగాయి. రాష్ట్రంలో బాగుపడిరది జగన్‌ రెడ్డి ఒక్కడే. అధికారం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలిచే బాధ్యత. కానీ, జగన్‌ రెడ్డికి అధికారమంటే దోపిడీ, ప్రజల సంపద దోచుకోవడమనేలా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి జీవో నెం.1 తెచ్చాడు. నేడు ఎన్నికల కమిషన్‌ ఉంది కాబట్టి సభలు పెట్టగలుగుతున్నాం. కానీ, గత ఐదు సంవత్సరాలుగా ఏం చేశాడో చూశాం. అహంకారి, విధ్వంసకారుడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే.. తెలుగుదేశం, జనసేన రోడ్డెక్కి పోరాటం చేశాయి. ఐదేళ్లుగా ప్రతిపక్ష నేతలపై దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశాడు. ఇలాంటి రాక్షస పాలనను మే 13న వేసే ఓటుతో బూడిద చేయబోతున్నాం. మన బిడ్డల కోసం ఓటేయండి. కులం, మతం, ప్రాంతం కాదు.. రాష్ట్రమే ముఖ్యం. రాష్ట్రం బాగుకోసం ఓటు వేయండి. ప్రజలు ఇచ్చే తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి. జగన్‌ రెడ్డి అహంకారం కూలిపోయేలా ప్రజల తీర్పు ఉండాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
ఫేక్‌ ఫెలోని తరిమికొడదాం
జగన్‌ రెడ్డి ఒక ఫేక్‌ ఫెలో.  సోషల్‌ మీడియాలో పెడుతున్న ఫేక్‌ పోస్టులు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. టీడీపీ, జనసేన నేతల మధ్య గొడవలు పెట్టేలా సోషల్‌ మీడియాలో ఫేక్‌ పోస్టులు షేర్‌ చేస్తున్నారు. మా సంతకాలు సైతం ఫోర్జరీ చేసి సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. సోషల్‌ మీడియాలో వైసీపీ వ్యాపింపజేసే తప్పుడు వార్తల్ని నమ్మొద్దు. ఎన్నికలకు ముందు జగన్‌ రెడ్డి ఇంటింటికీ తిరిగాడు. కానీ, గత ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. బారికేడ్లు పెట్టుకున్నాడు. చెట్లు నరికాడు.  ఇప్పుడు మరోసారి ప్రజల్లోకి వస్తున్నాడు. ఇలాంటి మూర్ఖుడిని నమ్మొద్దని చంద్రబాబు హితవు పలికారు.
సూపర్‌ సిక్స్‌ పథకాలతో సామాజిక విప్లవం
కూటమి తరఫున నిర్దిష్టమైన అజెండాతో వస్తున్నాం. మహిళల్ని మహాశక్తిగా గుర్తించాం. ప్రతి మహిళకూ ఆడబిడ్డ నిధిగా ప్రతి నెలా రూ.1500 చొప్పున ఒకటో తేదీన మీ ఖాతాల్లో చేర్చే బాధ్యత తీసుకుంటాను. తల్లికి వందనం పథకంతో ప్రతి బిడ్డ చదువుకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇస్తాను. ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ వర్తింప జేస్తాం. గతంలో దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాను. ఇప్పుడు ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తాను. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాను. అన్నదాతలకు ఏటా రూ.20 వేలు ఇచ్చి అండగా నిలుస్తాం. యువగళం పేరుతో ప్రతి విద్యార్ధికి నిరుద్యోగ భృతిగా రూ.3000 ఇస్తా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తా. ప్రపంచ స్థాయి పరిశ్రమల్ని ఏపీకి తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తాను. వర్క్‌ ఫ్రం హోం చేసుకునే వారి కోసం మండల కేంద్రాల్లో వర్క్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తా. ప్రతి ఇంటికీ ఉచితంగా తాగునీరు అందిస్తా. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4000 పెన్షన్‌ ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దనే అందిస్తా. మూడు నెలల పెన్షన్‌ ఒకే సారి తీసుకునే వెసులుబాటు కల్పిస్తాను. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్‌ అందిస్తాను. దివ్యాంగులకు రూ.6000 పెన్షన్‌ అందించి అండగా నిలుస్తా. వాలంటీర్‌ వ్యవస్థ కొనసాగుతుంది. వారికి రూ.10 వేల గౌరవ వేతనం అందిస్తానని చంద్రబాబు చెప్పారు.
జగన్‌ రెడ్డికి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో వాలంటీర్లు అంతా రాజీనామా చేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్లు వైసీపీ కోసం పని చేయడం మానుకోండి. మంచి పనులు చేసే వారికి మద్దతిస్తాం. తప్పుడు పని చేయించి వారి జీవితాలు నాశనం చేయాలని జగన్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. యువత రాష్ట్ర అభివృద్ధికి అండగా నిలవాలి. ప్రతి వాలంటీర్‌కు వారి విద్యార్హతల మేరకు మెరుగైన ఉద్యోగాలు పొందేలా అవకాశాలు కల్పిస్తానన్నారు.
ఖండాలు దాటిన బుజ్జికన్న మంత్రి అవినీతి
టీడీఆర్‌ బాండ్లలో ఏకంగా రూ.850 కోట్లు దోచుకున్న వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నాడు. ఎప్పుడూ, ఎక్కడా చూడని స్థాయి ముదురు మంత్రి కారుమూరు నాగేశ్వరరావు. చౌకగా స్థలాలు కొని, వాటిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చేందుకు రేట్లు భారీగా పెంచేసి ప్రభుత్వానికి అమ్ముకున్నాడు. ఇళ్ల స్థలాలిస్తామని చెబుతూ.. వారి నుండి కమీషన్లు దండుకున్నాడు. స్థలాల చదును పేరుతోనూ మరికొంత దోచుకున్నాడు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి బియ్యాన్ని బొక్కేస్తున్నాడు. తణుకులో గతంలో వారాహి యాత్ర జరిగితే జనసేన కార్యకర్తలపై దాడి చేశాడు. పవన్‌ కల్యాణ్‌ కన్నెర్ర జేస్తే ఏమైపోతాడో ఆలోచించుకో. తణుకులో చిన్న బిల్డింగు కట్టాలన్నా, వెంచర్‌ వేయాలన్నా కారుమూరి ట్యాక్స్‌ కట్టాల్సిందే. టిడ్కో ఇళ్లు పేదలకు ఇవ్వకుండా పాడు బెడుతున్నాడు. రైతులు పంట కాపాడుకోవడానికి గోనె సంచులడిగితే ఎర్రిపప్పలంటూ రైతుల్ని దుర్భాషలాడాడు. ఎర్రి పప్ప అంటే బుజ్జి కన్న అన్నాడు. ఆ ఎర్రిపప్పకు బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా
సభలకు వచ్చే ప్రతి ఒక్కరూ.. జగన్‌ రెడ్డి అరాచకాలపై నిలదీయాలి. తప్పుడు పనులు చేసే వైసీపీని తూర్పారబట్టాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉప్పెనలా ప్రచారం చేయాలి. మన అభ్యర్ధుల్ని గెలిపించుకోవాలి. రాష్ట్రం కోసం పని చేయాలి. మూడు పార్టీల్లోనూ చాలా మంది నాయకులు త్యాగాలు చేశారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వారున్నారు. కమలం గుర్తుపై ఒక ఓటు, సైకిల్‌ గుర్తుపై ఒక ఓటు వేయాలని కోరుకుంటున్నాను. మే 13న పోలింగ్‌ బూత్‌లు దద్దరిల్లేలా ఉండాలి. ఒక రోడ్‌ షోకి భూ కంపం వచ్చింది. తాడేపల్లి కొంప కంపిస్తోంది. ప్రజలంతా ఏకమై కూటమిని గెలిపించాలి. రాష్ట్ర కోసం 30 రోజులు పని చేయండి. మీ అందరి కోసం ఐదేళ్లు పని చేసే బాద్యత తాను తీసుకుంటానని చంద్రబాబు అన్నారు.

సంబంధితవార్తలు

‘తల్లికి వందనం’పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

ఫలితాలపై నేడు సంకేతం

గెలుపు మనదే!

Tags: అధినేత నారా చంద్రబాబునాయుడుఎన్డీఏ కూటమితణుకుపశ్చిమ గోదావరిప్రజాగళంసూపర్‌ సిక్స్‌
Previous Post

భువనమ్మ పరామర్శ…కొండంత భరోసా!

Next Post

యువగళం పాదయాత్రను కళ్లకు కట్టిన ‘శకారంభం’!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మీ సంకల్పం నెరవేరుతుంది
ఆంధ్రప్రదేశ్

మీ సంకల్పం నెరవేరుతుంది

చైతన్యరధం
@ July 25, 2026
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి
ఆంధ్రప్రదేశ్

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

చైతన్యరధం
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist