- అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో నిలపాలి
- ఐపీఆర్, గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి
- విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై అధికారులతో సమీక్ష
ఏలూరు(చైతన్యరథం): రాష్ట్రాన్ని పేదరిక రహిత స్వర్ణాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేసేం దుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్‌కు ప్రతిఒక్కరూ మంచి సూచనలు అందించాలని గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై గురువారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో శుక్రవారం అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు విజన్‌తో హైదరాబాద్ నగరానికి ప్రపంచపటంలో గుర్తింపు వచ్చింది. అదేవిధంగానే ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో దేశంలోనే ముందంజలో నిలిపేందుకు స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని కూడా అన్ని రంగాలలో దేశంలో ప్రథమ స్థానం లో నిలిపేందుకు అవసరమైన విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సమాజంలోని అన్ని వర్గా ల ప్రజల ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు చెప్పారు.
స్వర్ణాంధ్ర-2047 క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి అందులో సూచించిన అభివృద్ధి సూచిక అంశాలలో ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. అధికారులు, ప్రజల ఆలోచనలతో స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ రూపుదిద్దుకుంటుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు, పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నిలిపి రాష్ట్ర వృద్ధిరేటును పెంచడమే ముఖ్య మంత్రి లక్ష్యమన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను చంద్రబాబు 72 శాతం పూర్తి చేస్తే గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదన్నారు. అదేవిధంగా అమరావతి ప్రపంచస్థాయి రాజధాని రూపకల్పన చేస్తే దానిని కూడా ముందుకు తీసుకువెళ్లకుండా నిర్లక్ష్యం చేశారని, పరిశ్రమ లు స్థాపించేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించలేకపోయారని ధ్వజమెత్తా రు. గత ప్రభుత్వ రాజకీయ దురుద్దేశాల కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయిం దన్నారు. అందుకే ప్రజలు విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు ఒక్కరే అని నమ్మి ఘన విజయం అందించారన్నారు.
గత ఐదేళ్ల కాలంలో ఆర్థిక అవకతవకలు తప్ప అభివృద్ధిపై ఎటువంటి విజన్ లేని నాయకత్వం కారణంగా ప్రజలు ఎంతో నష్టపోయారని మండిపడ్డా రు. 10.5 లక్షల కోట్ల అప్పులు, వాటిపై వడ్డీలు గత ప్రభుత్వం సాధించిన ఘనతలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ వంటి ఎన్నో పధకాలు అమలు చేస్తున్నదని, వాటికి రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర అం దించవలసిన మ్యాచింగ్ గ్రాంట్లను గత ప్రభుత్వం విస్మరించడంతో కేంద్ర నిధులను సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితికి తెచ్చారన్నారు. ఏలూరు జిల్లా విజన్ డాక్యు మెంట్ చక్కగా రూపొందించారని, అదేస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, జిల్లా అటవీశాఖాధికారి రవీంద్ర దామా, జిల్లా పరిషత్ సీఈవో కె.సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.