అమరావతి: టీడీపీ హయాంలో ఎక్పైజ్ శాఖలో అక్రమాలు జరిగితే నాలుగున్నరేళ్ల పాటు ఎందుకు జగన్ రెడ్డి మౌనంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర అద్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇప్పుడే కనిపించిందా? రేపు చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ పై తీర్పు వచ్చే ముందు రోజే కనపడిరదా? ఇది పక్కా రాజకీయకుట్ర. ఇది జగన్ రెడ్డి డైవర్షన్ జిత్తుల్లో భాగమే. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో లక్ష కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. నాసిరకం మద్య పోసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు కనుక దీనిపై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర నాయకులు ఫిర్యాదులు చేశారు. ఈ కుంభకోణం నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి దొంగే దొంగ అన్నట్లుగా చంద్రబాబుపై మద్యం పేరుతో మరో అక్రమ కేసుపెట్టారు. చంద్రబాబుకు రేపు హైకోర్టు బెయిలు ఇస్తే తిరిగి వేధించడానికి ఈ కేసు పెట్టారని విజ్ఞతగల ప్రజలందరికీ అర్థమౌతోంది. ప్రజల విజ్ఞత అంటే లెక్క లేని జగన్ రెడ్డి మరో అక్రమ కేసుపెట్టి ప్రజల విజ్ఞతను, రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నాడు. అక్రమ కేసులతో, అరాచకంతో వ్యహరిస్తున్న జగన్ రెడ్డి రానున్న కాలంలో శిక్షకు గురికాక తప్పదని ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు హెచ్చరించారు.