అమరావతి: అసెంబ్లీ నుంచి వరుసగా రెండో రోజూ పలువురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే రైతాంగ సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పట్టింది. అయితే, ఈ తీర్మా నాన్ని స్పీకర్ తమ్మినేని సీతారామ్ తిరస్కరిం చారు. తామిచ్చిన తీర్మానంపై చర్చ చేపట్టా ల్సిందేనంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఆక్వా రైతులను దోపిడీ చేసిన ప్రభుత్వం నశిం చాలని నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు…పోలవరం కట్ట లేని అసమర్థ ప్రభుత్వం అని నినదించారు. పంట బీమా, ఇన్ పుట్ సబ్సిడీని మర్చిపోయిన ప్రభుత్వం అని నినాదాలు చేశారు. దగా ప్రభు త్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం నశిం చాలి అని నినదించారు. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడిరది. స్పీకర్ వారిస్తు న్నా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, బెందాళం ఆశోక్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, వెలగ పూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయు డు, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామిని ఒక రోజుపాటు స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. అయి తే, సభ నుంచి వెళ్లేందుకు వారు నిరాకరిం చడంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. టీడీపీ సభ్యులను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.