చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగానే కుట్రలు

దొంగఓట్ల నమోదులో కథ...స్క్రీన్‌ ప్లే..డైరెక్షన్‌ అంతా జగన్‌ రెడ్డిదే: విజయ్‌ కుమార్‌

by చైతన్యరధం
Nov 15, 2023 at 10:55am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగానే కుట్రలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి
  • ఐప్యాక్‌ ద్వారా ఓటర్ల జాబితాలో ఇష్టానుసారం జగన్‌ మార్పులు
  • ఐప్యాక్‌ సిబ్బంది చెప్పుచేతల్లో ప్రభుత్వ యంత్రాంగం, వాలంటీర్‌ వ్యవస్థ
  • యుద్ధప్రాతిపదికన దొంగఓట్ల తొలగింపుపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలి
  • తుదిఓటర్ల జాబితా విడుదలయ్యే నాటికి రాష్ట్రంలో ఒక్క దొంగ ఓటు కూడా లేకుండా చూడాలి

అమరావతి: రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో దొంగఓట్లు అటు ప్రజల్ని, ఇటు రాజకీయపార్టీలను కలవరపెడుతున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దొంగ ఓట్ల నమోదు కుట్రలు మొత్తం తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగానే జరుగుతున్నాయన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్‌ నాటికి రాష్ట్రంలో ఉన్న దొంగఓట్లలో 20 శాతం ఓట్లను సరిచేశామని ఎన్నికల కమిషన్‌ ప్రకటించిందన్నారు. మరిమిగిలిన వాటి సంగతేమిటన్నదే ఇప్పుడు భేతాళప్రశ్నగా మారింది. సెప్టెంబర్‌ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 10 మంది, అంత కంటే ఎక్కువ కుటుంబ సభ్యులున్న ఇళ్ల సంఖ్య 1,57,939 ఉంటే, వాటిలో 24,61,676 మంది ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనే చెప్పింది. వాటిలో 2,51,767 మంది ఓటర్లు సున్నా ఇంటినంబర్లతో ఉండగా, మరికొన్ని ఇంటి నంబర్లు తప్పుగా ఉండటం.. మరికొన్ని అర్థంకాని విధంగా ఉన్నాయి. 1,57,939 ఇళ్లలో కేవలం 20శాతం సరిచేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చెబుతున్నారు. మరి మిగిలిన వాటి సంగతేమిటని విజయ్‌ కుమార్‌ ప్రశ్నించారు.
ప్రతిరోజూ రాష్ట్రంలో దొంగఓట్లు నమోదు కావడం.. అధికారులు సస్పెండ్‌ అవడం నిత్యకృత్యంగా మారింది. ఇంత పెద్ద సంఖ్యలో దొంగఓట్ల నమోదుకు గల కారణాలు ఏమిటా అని ఆలోచిస్తే … విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. దొంగ ఓట్లు నమోదు వెనుక కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ప్రభుత్వ డేటా ఆ వ్యక్తులకు చేరుతోంది.. ఒక్క మాటలో చెప్పాలంటే దొంగ ఓట్ల బాగోతంలో కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ మొత్తం జగన్మోహన్‌ రెడ్డిదే. ప్రభుత్వం, రాజకీయపార్టీ, ఎన్నికల కన్సల్టింగ్‌ సంస్థ కలిసి చేస్తున్న నిర్వాకాల ఫలితమే యథేచ్ఛగా జరుగుతున్న దొంగఓట్ల నమోదు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా దొంగఓట్ల నమోదు అనేది జగన్మో హన్‌ రెడ్డి పాలనలోనే జరుగుతోందని విజయ్‌ కుమార్‌ విమర్శించారు.

దొంగఓట్ల పాపంలో వాలంటీర్లదే కీలకపాత్ర
జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే 2019, జూన్‌ 22న ప్రత్యేకంగా జీవో ఇచ్చి మరీ (జీవో ఎంఎస్‌-104) వాలంటీర్లను నియమించాడు. పంచాయతీరాజ్‌.. గ్రామీణాభివృద్ధి, మున్సిపల్‌ శాఖల్ని నామమాత్రం చేస్తూ, 2.60 లక్షల పైచిలుకు వాలంటీర్లను జగన్‌ సర్కార్‌ నియమించింది. వాలంటీర్లు అందరూ మనవాళ్లే (వైసీపీ వారే) అని స్వయంగా మంత్రులే పలు సందర్భాల్లో చెప్పారు. వాలంటీర్‌ వ్యవస్థను పర్యవేక్షణ బాధ్యతలనుొక ప్రైవేటు సంస్థకు అప్పగిస్తూ అదే ఏడాది డిసెంబర్‌ 23న ఏపీటీఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌) నిర్ణయం తీసుకుంది. అసలు వాలంటీర్లు ఏ డిపార్ట్మెంట్‌ కిందకు వస్తారో కూడా అప్పటికి నిర్ణయం కాకుండానే వాళ్ళ పర్యవేక్షణ బాధ్యతలను ‘మూడు సంస్థల ప్రైవేటు కన్సార్షియం’ కు అప్పగిస్తూ ఏపీటీఎస్‌ కాంట్రాక్ట్‌ లెటర్‌ ఇచ్చేసింది. గ్రామ, వార్డు వాలంటీర్‌… సచివాలయ వ్యవస్థల పర్యవేక్షణను ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఓఏ ` మూడుసంస్థల ప్రైవేట్‌ కన్సార్టియం) పరిధిలోకి ప్రభుత్వం చేర్చింది. ఎఫ్‌ఓఏ అంటే రామ్‌ ఇన్ఫో, ఉపాధి టెక్నో సర్వీసెస్‌ లిమిటెడ్‌, మ్యాక్స్‌ ఇన్ఫో డిటెక్టివ్‌ సర్వీసెస్‌ సంస్థ కలయిక. ఒక డిటెక్టివ్‌ సంస్థ ఎఫ్‌ఓఏలోకి ఎందుకొచ్చిందనేది నేటికీ సందేహమే. ఎఫ్‌ఓఏని నడిపే రామ్‌ ఇన్ఫో సంస్థకు అనుబంధంగా మండల, గ్రామ అధికారులు కలిసి పనిచేయాలని నేరుగా జిల్లా జాయింట్‌ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులివ్వలేదు. రామ్‌ ఇన్ఫో సంస్థకు చెందిన ఉద్యోగులంతా గతంలో ఐప్యాక్‌ లో పనిచేసినవారేనని చెప్పడానికి కూడా అనేక ఆధారాలున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఐప్యాక్‌ లింక్డ్‌ ఇన్‌ సమాచారంతో తెలుగుదేశం గతంలోనే ప్రజల ముందు ఉంచింది. ఆ విధంగా ఒక ప్రైవేట్‌ సంస్థను నేరుగా ప్రభుత్వ యంత్రాంగం కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేలా చేశారు. రామ్‌ ఇన్ఫో అనే సంస్థ కేవలం ముసుగు సంస్థ మాత్రమే.. దాని వెనకుండి నడిపించేది రాజకీయ కన్సల్టింగ్‌ సంస్థ అయిన ఐప్యాక్‌ సంస్థ. అంటే ఎఫ్‌ఓఏ పేరుతో ఐప్యాక్‌ సంస్థ కార్యకలాపాల కోసం రాష్ట్రప్రభుత్వమే సంవత్సరానికి రూ.68 కోట్లు చెల్లిస్తోంది. ఈ విధంగా ఐప్యాక్‌ పరిధిలో వాలంటీర్లు పనిచేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సమయంలో… ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఐప్యాక్‌ సిబ్బందికి అందించారు. రామ్‌ ఇన్ఫో వెబ్‌సైట్‌ లోని సమాచారం ప్రకారం ప్రభుత్వం నేరుగా 1061 మంది ఐప్యాక్‌ సిబ్బందిని ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకునేలా చేసింది. ఇదంతా రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందే. ప్రైవేట్‌ సంస్థలు ప్రభుత్వం ద్వారా జరిగే సమాచార సేకరణ ప్రక్రియలో నేరుగా పాల్గొనేలా ఉత్తర్వులివ్వడం.. సివిల్‌ సర్వెంట్స్‌ అయిన ఐఏఎస్‌ అధికారులు ఇంత జరుగుతున్నా చూస్తూ ఊరుకోవడం విచారకరమని విజయ్‌ కుమార్‌ విమర్శించారు.

సంబంధితవార్తలు

జనం దెబ్బకు జగన్‌ అబ్బా..!

మీలో ఒకడిని..ఆశీర్వదించండి

ఓటర్ల జాబితా అక్రమాలను ప్రక్షాళన చేయాలి

ఓట్ల నమోదు, తొలగింపు, దొంగఓట్లపై ఐప్యాక్‌ సంస్థ దృష్టి పెట్టింది
ఐప్యాక్‌ ఇచ్చిన ఫార్మాట్‌ ప్రకారం, వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించే పనిని జగన్‌ ప్రభుత్వం నిర్విఘ్నంగా అమలుచేసింది. ఆధార్‌ కార్డ్‌ ను ఓటర్‌ కార్డుకి అనుసంధానించే పనిని చేస్తున్నట్టు.. ఆధార్‌ కార్డ్‌ సీడిరగ్‌ తప్పని సరి అంటూ ప్రజలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని వాలంటీర్ల ముసుగు లో ఐప్యాక్‌ సేకరించింది. ఆర్టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ) సంస్థ తయారుచేసిన ఒక ప్రొఫైలింగ్‌ యాప్‌ టూల్‌ సాయంతో ఓటర్లను ప్రభావితం చేయడం మొదలెట్టారు. సచివాలయానికి వచ్చి ఆధార్‌ కార్డుని ఓటర్‌ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వ సిబ్బందే నేరుగా ప్రజలకు సమాచార మిచ్చారు. దానితో పాటు పౌరుల వ్యక్తిగత వివరాలు (కులం, మతం, జాతి, భాష, ఆస్తి, వాహనాలు, కుటుంబసభ్యులు, ఆదాయ వివరాలు) మొత్తం సేకరించారు. ఈ వివరాలన్నీ నేరుగా ఐప్యాక్‌ సంస్థ చేతుల్లోకి వెళ్లాయి. ప్రజల సమాచారం మొత్తం గుప్పెట్లో పెట్టుకున్న ఐప్యాక్‌ సంస్థ సాయంతో జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఓట్ల నమోదు.. ఓట్ల తొలగింపు.. దొంగ ఓట్ల సృష్టిపై దృష్టిపెట్టింది. పౌరుల సమాచారాన్ని సేకరించడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా కూడా వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఐప్యాక్‌ కు మొత్తం సమాచారాన్ని ప్రభుత్వం అందించింది. ఈ విధంగా నాలుగేళ్ల్లుగా ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా దొంగఓట్లు నమోదు చేసింది. తిరుపతిలో, విశాఖపట్నం జిల్లాలో వేలసంఖ్యలో దొంగఓట్లు నమోదయ్యాయి. అలానే అనేక నియోజకవర్గాల్లో వేలాదిగా దొంగఓట్లు చేర్పించారని విజయ్‌ కుమార్‌ వివరించారు.

ప్రజల స్వేచ్ఛ, హక్కులు హరించేలా వాలంటీర్లు పనిచేస్తామంటే టీడీపీ సహించదు

ఐప్యాక్‌ సంస్థ సాయంతో నేరుగా జగన్‌ సర్కారే దొంగఓట్ల నమోదు అనే బృహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. దీనిపై తొలుత కఠినంగా వ్యవహరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం క్రమేణా కాస్త మెత్తబడిరది. ఓటర్‌ జాబితా పరిశీలన సహా, ఎన్నికల విధుల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చేస్తామని కూడా ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. 2023, అక్టోబర్‌లో ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా ఇచ్చింది. జగన్‌ ను తిరిగి ఎందుకు ఎన్నుకోవాలి అనే అంశంపై వాలంటీర్లు ఇప్పుడు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అనేక కార్యకలాపాల్లో నిమగ్నమైన వాలంటీర్లు ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ద్వారా ప్రజల్ని ప్రభావితం చేయకుండా ఉంటారనుకోవడం అమాయకత్వమే అవుతుంది. తీసేసిన ఓట్ల తాలూకా సమాచారం ఓటర్లకు కూడా చెప్పకుండా రాష్ట్రంలో చాలా నియోజకవర్గా ల్లో నేరుగా వాలంటీర్లు ఓట్లు తొలగిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో.. సంక్షేమ పథకాల చేరవేతకు మాత్రమే వాలంటీర్లు పరిమితమైతే మంచిదే. అలా చేస్తే టీడీపీ కూడా తప్పుపట్టదు. కానీ ఈ విధంగా ఓట్లు తీసేయడం.. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజల హక్కులు, స్వేఛ్ఛను హరించే చర్యలకు పాల్పడుతుంటే టీడీపీ సహించబోదని విజయ్‌ కుమార్‌ హెచ్చరించారు.

వాలంటీర్లు.. సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి
ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయమే ఉన్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తక్షణమే యుద్ధప్రాతిపదికన దొంగఓట్ల తొలగింపుపై దృష్టిపెట్టాలి. జనవరిలో తుది ఓటర్ల జాబితా విడుదలయ్యే సమయానికి రాష్ట్రంలో ఒక్క దొంగ ఓటు కూడా ఉండటానికి వీల్లేదు. అలానే వాలంటీర్‌ వ్యవస్థను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి. అసలు ఓటర్‌ జాబితా చూడటానికి కూడా వారికి అవకాశం ఇవ్వకూడదు. జగన్‌ ను మరలా ఎందుకు ఎన్నుకోవాలనే కార్యక్రమం లో కూడా వారు పాల్గొనకుండా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలి. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందిని కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి. తక్షణమే ఉపాధ్యాయులు..ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎన్నికల విధుల్లో నియమిం చాలి. ఫామ్‌ -7 వినియోగం పూర్తిగా ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షణ లోనే జరిగేలా చూడాలి. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల వివరాలతో ఏపీ ఎన్నికల సంఘం తక్షణమే అధికారికంగా వాస్తవాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇవేవీ జరగకుండా ఎన్నికలు నిర్వహించడం ముమ్మాటికీ అనైకతికం.. అప్రజాస్వామికం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటుహక్కు హరించేలా చేస్తున్న ఏ కార్యక్రమాన్ని టీడీపీ కొనసాగనివ్వదని విజయ్‌ కుమార్‌ తేల్చి చెప్పారు.

Tags: ఐప్యాక్‌ఓటర్ల జాబితాతాడేపల్లిదొంగ ఓటుప్యాలెస్‌వాలంటీర్‌ వ్యవస్థ
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2023

Next Post

జగన్‌ పేర్ల పిచ్చికి పేదలు బలి: యనమల

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-04-2026

కార్యకర్త
@ April 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-04-2026

కార్యకర్త
@ April 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026

కార్యకర్త
@ April 21, 2026
నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం
ఆంధ్రప్రదేశ్

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి
ఆంధ్రప్రదేశ్

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
Load More

ముఖ్య వార్తలు

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026

రెండేళ్లలో 5వేల దేవాలయాలు

చైతన్యరధం
@ April 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist