- టీడీపీ నేతలపై కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీని కోరితే సమాధానం కరువు
- అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
- గడువు ముగిసిన జేపీ వెంచర్స్ బిల్లులతో పామర్రులో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర్రంలో అధికారపార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది ప్రభుత్వ, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్ని కల అధికారి (సీఈఓ) ముఖేష్‌కుమార్ మీనాకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమా మహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో సీఈఓను కలిసి ఈ మేరకు ఫిర్యాదు అందించారు. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనా ల్సి ఉన్నందున అభ్యర్థులపై ఉన్న కేసు వివరాలు ఇవ్వా లంటూ రాష్ట్ర డీజీపీకి లేఖ రాస్తే, ఎస్పీని కోరాల్సిం దిగా నిర్లక్షంగా సమాధానం చెప్పారని, జిల్లా ఎస్పీలకు లేఖలు రాసినా కేసుల వివరాలువారు తెలియపరచడం లేదని ఫిర్యాదులో వివరించారు. అనంతరం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో నేతలు పాల్గొన్నారు.
ఖనిజ సంపద దోపిడీ: వర్ల రామయ్య
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అవినీతి, అధికార దుర్వినియోగం, దోపిడీలు తగ్గాల్సింది పోయి అందుకు భిన్నంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని వర్ల రామయ్య అన్నారు. ఎన్నికల కోడ్ అయితే మాకేంటి, మమ్మల్ని ఎవరూ ఆపలేరనే రీతిలో జగన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఖనిజ సంపదను యథేచ్ఛగా దోచుకుంటూ ఎన్నికల్లో ఆ డబ్బును వాడు కోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం, లంకపల్లిలో యథేచ్చగా జరు గుతున్న ఇసుక తవ్వకాలే ఇందుకు నిదర్శనం. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కైలేె అనిల్ కుమార్ కనుసన్నల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. ఇదేమిటని స్థానిక నాయకులు అడ్డుకుంటే ఎమ్మెల్యే పేరు చెప్పి, ఎప్పుడో గడువు ముగిసిన జెపి వెంచర్స్ బిల్లులు చూపించారు. అక్రమ రవాణా జరుగుతోందని స్థానిక ఎస్సైకి ఫోన్ చేసి చెప్తే అది మా డ్యూటీ కాదు మైనింగ్ అధికారు లకు చెప్పాలన్నారు. మైనింగ్ ఏడీ ప్రతాప్ రెడ్డికి చెప్తే ఎన్నికల అధికారికి చెప్పుకోండి, నాకు సంబంధం లేద ని నిర్లక్ష సమాధానం చెప్పారు.
తాహసీల్దార్‌కు చెప్తే ఇద్దరు వీఆర్ఓలను పంపించారు. ఇసుక అక్రమ రవాణా దారులు ఇసుక ట్రక్క్లతో వీఆర్ఓలను గుద్దిం చబోతే వారిద్దరు పారిపోయారు. రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్‌కు చెప్తే అది మా డ్యూటీ కాదు అని తప్పించుకున్నారు. ఏమిటీ అన్యాయమని జిల్లా కలెక్టర్ కు చెప్తే, 5 నిమిషాలు ఇవ్వండి ఆపుతానని చెప్పి ఒక కానిస్టేబుల్‌ను అక్కడికి పంపించాడు.అంత పెద్ద ఇసుక మాఫియాను ఒక కానిస్టేబుల్ ఆపగలడా? అక్రమ ఇసుక రవాణాను వీడియో తీసి సీఈఓ ముకేష్‌కుమార్ మీనాకు చూపించి ఫిర్యాదు చేశాం. జిల్లా కలెక్టర్, ఎస్పీల వద్ద నుంచి రిపోర్ట్ తీసుకొని తగుచర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకుం టున్న మైనింగ్ ఏడీ, స్థానిక ఎస్సై ఇద్దరినీ వెంటనే సస్పెండ్ చేయాలని అని కలె క్టర్, ఎస్పీకి విజ్ఞప్తి చేస్తు న్నాం. వైసీపీ చేస్తున్న అక్ర మాలను గుర్తించి ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని వర్ల రామయ్య ప్రజలను కోరారు.
ఎన్నికల ప్రక్రియ అపహాస్యం: బొండా
కొంతమంది ఐపీఎస్ అధికారులు అధికార దుర్వి నియోగానికి పాల్పడుతున్నారని బొండా ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. డబ్బు, మద్యం సరఫరా చేస్తున్న విశ్వంత్ రెడ్డి, తప్పుడు కేసులతో తెలుగుదేశం, జనసేన నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్న కొల్ల్లి రఘురామిరెడ్డి, జగన్‌రెడ్డి ఆదేశాలనుసారం ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న ముగ్గురు అడిషనల్ ఎస్పీ క్యాడర్ అధికారులపై ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశాం. వీళ్ళందరిపై ఉన్నత స్థాయి విచారణ చేసి నిజా నిజాలు బయట పెట్టాలి. అప్పటివరకు వారిని విధుల నుంచి తప్పించాలని సీఈఓని కోరినట్లు బొండా ఉమా తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ…’’ తెలుగుదేశం నాయ కుల మీద రాష్ట్రంలో ఎక్కడెక్కడో కేసులు పెట్టారు.
ఆ వివరాలన్నీ డీజీపీ వద్ద ఉంటాయి. ఎన్నికల అఫిడవిట్ లో అభ్యర్థులు వాళ్ల మీద ఉన్న కేసు వివరాలు జత చేయాలి కాబట్టి..మామీద ఉన్న కేసుల వివరాలు ఇవ్వా లని డీజీపీకి మేము లేఖ రాశాము. జిల్లా ఎస్పీని కోరం డి అని డీజీపీ నిర్లక్ష సమాధానం చేప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్నిజిల్లాల ఎస్పీలకు మేము లేఖలు పంపించాం. కానీ ఇప్పటివరకు ఏ జిల్లా ఎస్పీ కూడా స్పందించ లేదు. దానిపై లిఖితపూర్వకంగా ఎన్నికల ప్రధాన అధి కారికి ఫిర్యాదుచేశాం. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు జగన్మోహన్రెడి ప్రయత్నిస్తు న్నారు.ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహ రిస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతంతీసుకుంటూ,క్యాబినెట్ హోదా లో ఉన్న ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి.. పార్టీ ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు. వీటన్నిటి మీద ఫిర్యాదు చేశాం. వీటన్నిటిపై కచ్చితంగా తగు చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన అధికారి హామీ ఇచ్చారని బొండా ఉమా తెలియ జేశారు.