- తాగునీరు, రోడ్లు, పార్కులు, వీధి దీపాలపై దృష్టిపెట్టాలి
- అనుమతి లేని లేఅవుట్లపై కఠినంగా వ్యవహరించండి
- రోడ్లపై పశువులు, పందులు, కుక్కల సంచారం కనిపించొద్దు
- సెంట్రల్ డివైడర్లపై ప్రకటనల బోర్డులను అనుమతించవద్దు
- మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి(చైతన్యరథం): వర్షాకాలంలో రోడ్లపై ఎక్కడా నీరు నిల్వలేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్‌ల కమిషనర్లకు పురపాలక, పట్టణాభి వృద్ధి మంత్రి నారాయణ ఆదేశించారు. డ్రైన్‌లలో పూడిక లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. విజయవాడతో సహా పలు మున్సిపల్ కార్పొరేషన్ల కమిష నర్లతో సీడీఎంఏ కార్యాలయంలో శుక్రవారం మంత్రి పొంగూరు నారాయణ సమీక్షిం చారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. విజయవాడలో కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా నీరు నిలవడానికి గల కారణాలపై కమిషనర్ ధ్యానచంద్రను అడిగి తెలుసుకున్నారు. విజయ వాడతో పాటు ఇతర కార్పొరేషన్లలో రోడ్లపై నీరు నిల్వ లేకుండా తగిన చర్యలు చేపట్టాల ని సూచించారు.
అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, పార్కు లు, వీధి దీపాలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. పెనాల్టీ తక్కువగా ఉందన్న ఉద్దేశంతో లేఅవుట్‌లకు ముందుగా అనుమతి తీసుకోవడం లేదని, అటువంటి వాటికి భారీగా పెనాల్టీ విధించే ఆలోచన చేస్తామన్నారు. లేఅవుట్‌ల అనుమతుల విష యంలో కఠినంగా వ్యవహరించాలని కమిషనర్లను ఆదేశించారు. పట్టణాల్లో కొళాయి కనెక్షన్‌ల సర్వేను త్వరగా పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో రోడ్లపై పశువులు, పందులు కనపడకూడకుండా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే 15 రోజుల్లోగా అన్ని మున్సి పాలిటీలు, కార్పొరేషన్‌లలో రోడ్లపై పశు సంచారం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సెప్టెంబర్ 30 నాటికి పందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు.
ఇక వీధి కుక్కలకు త్వరితగతిన స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయించడంతో పాటు పెంపుడు కుక్కలు వీధుల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెంట్రల్ డివైడర్‌లలో ఎలాంటి వాణిజ్య ప్రకటనల బోర్డులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. చెత్త శుద్ధి నిర్వహణ, పార్కుల నిర్వహణపైనా సూచనలు చేశారు. పేదల గృహాల కోసం నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరినారాయణన్, టిడ్కో ఎండీ సాయికాంత్ వర్మ, మెప్మా ఎండీ తేజ్ భరత్, టౌన్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ విద్యుల్లత, ప్రజారోగ్య విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ గోపాలకృష్ణారెడ్డితో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, విజ యవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి కమిషనర్లు పాల్గొన్నారు.
అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులతో సమీక్ష
అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ద్వారా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. రాష్ట్రంలోని 19 పట్టణాభివృద్ధి సంస్థల (యూడీఏ)అధికారులతో సమీక్షించారు. ఒక్కొక్క పట్టణాభివృద్ధి సంస్థ వారీగా చేపడుతు న్న కార్యక్రమాలు, ఆదాయ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారు లు మంత్రికి వివరించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనధికార లే అవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులపై చర్చించారు. అనుమతులు లేకుండా వేస్తున్న లే అవుట్‌ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అటువంటి వాటికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించరనే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అర్బన్ డెవలప్‌మెంట్ పరిధిలోని మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఉడా నిధులతో చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యుల్లత, పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీ గోపాలకృష్ణా రెడ్డితో పాటు 19 పట్టణాభివృద్ధి సంస్థల అధికారులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ల అసోసియేషన్ ప్రతినిధుల వినతిపత్రం
మున్సిపల్ కమిషనర్ల అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారాయణను కలిసి వినతి పత్రం అందశారు. అధికారులకు శాఖాపరంగా ఉన్న ఇబ్బందులను వివరించారు. మున్సిపల్ కమిషనర్లుగా ఇతర శాఖల వారిని నియమించవద్దని కోరారు. ఇతర శాఖల ఉద్యోగులను మున్సిపల్ శాఖలో కలపవద్దని, మెప్మా పీడీలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల వీసీ పోస్టులకూ ఇతర శాఖల ఉద్యోగులను నియమించవద్దని విన్నవించారు. మున్సిపల్ కమిషనర్లకు ప్రమోషన్‌లను ఇవ్వాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ గౌరవ చైర్‌పర్సన్ కె.శివపార్వతి, ప్రధాన కార్యదర్శి బాలస్వామి, రవీంద్ర బాబు, అనురాధ ఉన్నారు.