భారీసభలో కలిసి సందేశం ఇవ్వనున్న చంద్రబాబు, పవన్
రెండు పార్టీల మధ్య చిచ్చుకు వైసీపీ నీలి, కూలి మీడియా కుటిలయత్నాలు
నాయకులు, శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి
రెండు తీర్మానాలు ఆమోదించిన టీడీపీ`జనసేన సమన్వయకమిటీ
సమావేశం నిర్ణయాలు వెల్లడిరచిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
అమరావతి: ఈ నెల 28న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద టీడీపీ` జనసేన ఉమ్మడి బహిరంగసభ నిర్వహించాలని రెండు పార్టీల సమన్వయ కమిటీ నిర్ణయించింది. వచ్చే ఎన్నిక ల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ` జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమా వేశం గురు వారం విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. పొత్తును స్వాగతించిన టీడీపీ – జనసేన కేడర్‌ను అభినందిస్తూ ఒక తీర్మానం, మీడియాపై దాడులను తప్పుపడుతూ మరో తీర్మానాన్ని సమన్వయ కమిటీ ఆమోదించింది. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను వెల్లడిర చారు. రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28న తాడేపల్లిగూడెం సమీపం లోని పత్తిపాడు వద్ద ఉమ్మడి సభ నిర్వహిస్తామని వెల్లడిరచారు. ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోందని, త్వరలో విడుదల చేస్తా మని చెప్పారు. ఏయే స్థానాల్లో ఏయే పార్టీలు పోటీ చేయాలనే విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
ఇంత చెత్త ముఖ్యమంత్రిని చూడలేదు..
టీడీపీ-జనసేన రాష్ట్రస్థాయి తొలి సమన్వయ సమా వేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. దేశ చరిత్ర లో తొలిసారి ఇంత చెత్త ముఖ్యమంత్రిని, ఇంత దుర్మా ర్గమైన ముఖ్యమంత్రిని చూస్తున్నామని సమావేశంలో పాల్గొన్న నేతలందరూ అభిప్రాయ పడ్డారు. ముఖ్యమం త్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే జగన్ ఒక సైకోలా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేశాడు. మొత్తం వ్యవస్థల్ని నాశనం చేశాడు. రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు, ప్రజల స్వేచ్ఛను హరిస్తూ నియంతృత్వ చర్యలకు పాల్పడ్డాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలపై దాడులకు పాల్పడి,వారి ఆస్తులు దోచుకొని, తిరిగి వారిపైనే తప్పుడు కేసులుపెట్టించి చిత్రహింసల కు గురిచేశాడు. తన అరాచకత్వాన్ని ప్రశ్నించిన వారిని చంపించాడు. ఈ పరిస్థితులన్నీ చూశాక 5కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ` జనసేన చేతులు కలిపాయి. జగన్‌రెడ్డి మరలా ముఖ్యమంత్రి కాకూడదు అన్న ఉద్దేశంతోనే రెండుపార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం చేస్తు న్న దమనకాండపై ఇరుపార్టీలు ఎప్పటినుంచో కలిసి పోరాడుతున్నాయని అచ్చెన్నాయుడు చెప్పారు.
సభకు భారీగా తరలిరావాలి..
త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికల సంగ్రామం మొదలవు తోంది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల అధినేతలు రాష్ట్ర ప్రజలకు ఒక ఉమ్మడి సందేశం ఇవ్వాలని నిర్ణయించు కున్నారు. దానిలో భాగంగా రాష్ట్రచరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా నభూతో అన్న రీతిలో ఈనెల 28వ తేదీన తాడేపల్లి గూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో టీడీపీ`జనసేన పార్టీల ఉమ్మడి సభను నిర్వహిం చాలని నిర్ణయించాము.ఇరుపార్టీల వైపు నుంచి మొత్తం 12 మంది సభ్యులు సభా నిర్వహణ ఏర్పాట్లు చేస్తారు. ఈ సమావేశానికి తరలి రావాలని టీడీపీ-జనసేన కుటుంబ సభ్యులకు, జగన్‌రెడ్డి బాధితులైన రాష్ట్ర ప్రజ లకు ఆహ్వానం పలుకుతున్నాం. భారీసంఖ్యలో తరలి వచ్చి, సభను విజయవంతం చేయాలని, మన రెండు పార్టీల సభతో జగన్‌రెడ్డి వెన్నులో వణుకు పుట్టేలా చేయాలని అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు.
ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల కేటాయింపుపై అధినేతలు చెబుతారు..
టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై ఇరుపార్టీల అధ్యక్షులు వీలైనంత త్వరలోనే ప్రకటన చేస్తారు. ఇక సీట్ల సర్దుబాటుపై కూడా రెండుపార్టీల అధినేతలే అంతి మంగా నిర్ణయిస్తారు. వారి నుంచి ఉమ్మడి ప్రకటన వెలువడే వరకు ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కలిసి పనిచేయాలని కోరుతున్నాం. మా కూటమి ఏర్పాటును జీర్ణించుకోలే కనే సీట్ల కేటాయింపులో అభిప్రాయభేదాలు ఉన్నట్టు చూసిస్తూ, టీడీపీ-జనసేన పార్టీల మధ్య చిచ్చు పెట్ట డానికి జగన్‌రెడ్డి, అతని నీలి..కూలి మీడియా ప్రయత్నిస్తున్నాయి. ఈ వాస్తవా న్ని ఇరుపార్టీల శ్రేణులు గ్రహించి, జాగరూకతతో వ్యవహరించాలి. అధికారపార్టీ దుష్ప్ర చారాలు నమ్మి ఆవేశకావేశాలకు లోనుకావద్దని కోరు తున్నాం. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు 5 కోట్లమంది ప్రజల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలి. ఈ సమావేశంలో టీడీపీ`జనసేన కలయికను స్వాగతిస్తూ ఒక తీర్మానం చేస్తే,జగన్మోహన్‌రెడ్డి అతని ప్రభుత్వం మీడియాపై చేస్తున్న దాడుల్ని నిరసిస్తూ, ప్రజలకోసం.. రాష్ట్ర భవిష్యత్ కోసం పాటుపడుతున్న మీడియాసంస్థలకు, ప్రజలకు అండగా నిలవాలని మరో తీర్మానం చేశాం. జగన్ రెడ్డి మీడియాపై చేస్తున్న దాడి… ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై చేస్తున్న దాడే. మరలా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడే వరకు, రామరాజ్యం వచ్చేవరకు ప్రజలందరూ టీడీపీ-జనసేన పక్షానే నిలవాలని అచ్చెన్నాయుడు కోరారు.
సమావేశంలో చేసిన తీర్మానాలు..
1. పొత్తును స్వాగతించిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను, సమగ్ర అభి వృద్ధిని, ప్రజల క్షేమాన్నీ దృష్టిలో ఉంచుకొని టీడీపీ` జనసేన పార్టీలు కలసి ప్రజాక్షేత్రంలో పని చేయాలని నిర్ణయం తీసుకున్న ఇరుపార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి, పవన్ కల్యాణ్‌కి ఈ సమావేశం ధన్య వాదాలు తెలియచేస్తోంది. ఈ పొత్తును మనస్ఫూర్తిగా స్వాగతించి క్షేత్ర స్థాయిలో కలసి పని చేస్తున్న ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలకు అభినందనలు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. శాంతిభద్రతలు క్షీణించాయి. ఆడపడుచులకు రక్షణ కరవైంది. యువత కు భవిష్యత్తుపై ఆశలు కనిపించడం లేదు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతులను ఆదుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా రైతులు నిరాశ, నిస్పృ హలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి క్లిష్ట తరు ణంలో ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడం బాధ్యతగా భావించి తెలుగుదేశం ` జనసేన ఒక తాటిపై నిలిచి ఎన్నికలకు సంసిద్ధం అవుతున్నాయి. ఈ కూటమిని విజయం దిశగా ముందుకు తీసుకువెళ్ళేందుకు ఇరు పార్టీల అధ్యక్షులు చేస్తున్న అవిరళ కృషికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సమావేశం తీర్మానించింది.
2. మీడియాపై గూండాగిరి ప్రజాస్వామ్యానికి హానికరం..
ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియా రంగంపై రాష్ట్రంలో దాడులు పెరిగిపోతుండటం దురదృష్టకర పరిణామం. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో మీడియా ప్రతినిధులు, మీడియా కార్యాలయా లపై ఒక పథకం ప్రకారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. పాలకపక్షమే ఈ దాడులు చేస్తుండటం వైసీపీ నైజాన్ని వెల్లడిస్తోంది. వైసీపీ ప్రభుత్వ పాలనతో రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో, నేతల అరాచకాలు.. పాలకుడి వైఖరి ఏ స్థాయిలో ఉన్నాయో పత్రికలు, ఛానెళ్లు ప్రజలకు తెలియచెబుతున్నాయి. వీటిని జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం.. మీడియా సంస్థలు, పాత్రికేయులను కట్టడి చేసేందుకు జీవోలు ఇచ్చి కేసులు నమోదు చేయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. ఎంపిక చేసిన మీడియా సంస్థలు, పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లపై దాడులకు తెగబడుతున్నారు. వైసీపీ పాలన మొదలైన కొద్ది నెలలకే తుని నియోజకవర్గంలో సత్యనారాయణ అనే విలేకరిని హత్య చేశారు. మీడియాపై అప్పటి నుంచి దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి విలేకర్లు పరమేశ్వరరావు, వీరశేఖర్‌లపై చేసిన మూక దాడులు… కర్నూలులో ఈనాడు కార్యాలయంపై చేసిన రాళ్ళ దాడి, ధ్వంసం ఘటనలను ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తోంది. మీడియాపై దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావిస్తూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సమావేశం తీర్మానిస్తోంది.