ఇచ్ఛాపురం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రాష్ట్రాన్ని ఒకవిజన్‌తో ముందుకు నడిపించారు. అయిదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకైనాలేదని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే బెం దాళం అశోక్ అన్నారు. ఇచ్ఛాపురం లో ఆదివారం టీడీపీయువనేత లోకేష్ శంఖారావం సభలో అశోక్ మాట్లాడు తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజల్లోకి వస్తుండటంతో ముఖ్యమంత్రి జగన్‌కు భయం పట్టుకుందన్నారు. తప్పుడు కేసులు పెట్టి 53రోజులు జైలులో పెట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ 130 దేశాల్లో ఆయనకు సంఫీుభావంగా ఆందోళనలు జరిగాయి.
ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని ఎప్పటికీ తెలుగుదేశంపార్టీకి కంచుకోటగా నిలుపుతాం. పార్టీ కేడర్‌లో ఉత్తేజం నింపి, రానున్న ఎన్నికలకు కార్యోన్ము ఖులను చేసేందుకు యువనేత నారా లోకేష్ శంఖారావం యాత్ర చేపట్టా రు. రాక్షసపాలకుడితో పోరాడేందుకు కార్యకర్తలంతా నడుంకట్టాలి, ప్రతి కార్యకర్త ఒక లోకేష్‌లా తయారు కావాలి. అరాచకపాలనపై పోరు సాగించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి రావడం రాష్ట్రానికి శుభశూచకం. ఇచ్చాపురం నుంచే జగన్ పతనానికి నాంది పలుకుతాం, మరోసారి పసుపుజెండాను ఎగురవేస్తామని అశోక్ ధీమావ్యక్తం చేశారు.