– వెంకటగిరిలో నేడు www.weaversdirect.in వెబ్ సైట్ ఆవిష్కరణ
– దళారీలు లేకుండా మంచి ధరకి చేనేతలే తమ ఉత్పత్తులు అమ్ముకునేలా ఏర్పాట్లు
చేనేత కార్మికుల వెతలు దగ్గర నుంచి చూశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో 30 వేల మందికిపైగా ఉన్న చేనేత వృత్తి కళాకారుల కష్టాలు గమనించారు. క్షేత్రస్థాయిలో వారి సమస్యలు పరిశీలించారు. చేనేతల బంగారు భవిష్యత్తు కోసం చేనేతరంగ నిపుణులతో కలిసి చక్కనైన ప్రాజెక్ట్ రూపొందించి అమలు చేయనారంభించారు. అందులో లోటుపాట్లు సరిచేసుకుంటూ చేనేతలకి చేయూత అందించే మార్గానికి తొలి అడుగులు వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా జరీ చీరలకి ప్రసిద్ధి చెందిన వెంకటగిరిలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సందర్భంలో తన కలల ప్రాజెక్ట్ ఆరంభానికి వేదికగా చేసుకున్నారు. చేనేతకి టెక్నాలజీ అనుసంధానం, కళాకారులకి భద్రమైన పనిపరిస్థితులు, దళారీలు లేకుండా తమ ఉత్పత్తులు తామే అమ్ముకునే వెసులుబాటు, యంత్రాలు సమకూర్చడం, ఆధునికకాలం అవసరాలకు అనుగుణమైన మోడళ్లు నేసేలా శిక్షణ వంటి అంశాలలో సాయం చేయనున్నారు. వెంకటగిరిలో గురువారం www.weaversdirect.in వెబ్ సైటుని నారా లోకేష్ ఆవిష్కరించనున్నారు.