ముస్లిం లకూ సబ్ ప్లాన్ అమలు యోచన
2047 నాటికి పేదల్ని ధనికుల్ని చేసే లక్ష్యంతో ప్రణాళిక
గుంటూరు జిల్లాలో ఉర్దూ యునివర్సిటి శాఖ ఏర్పాటుకు కృషి
అధికారం లోకిరాగానే పాత పద్దతిలోనే దుల్హన్ పధకం అమలు
ముస్లిం మైనారిటీలకు ఎక్కడా ఇబ్బంది రానివ్వను
ముస్లింల ప్రార్థనా మందిరాల పై దాడులకు సంబంధించి అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలపై దాడులు జరిగాయా? ఈ దుర్మార్గుడు రాబట్టే మీకు ఇన్నికష్టాలు. అవసరమైతే ముస్లింలకు కూడా సబ్ ప్లాన్ తీసుకొస్తాం. మీరు చెప్పినవి నేను చేస్తాను. నేను చెప్పింది మీరు ప్రజలకు చెప్పండి, మీవాళ్లకు చెప్పండి. రేపు జరిగే ఎన్నికలలో మైనారిటీ సోదరులు టీడీపీని నిండు మనసుతో ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా బుధవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో మైనారిటీలతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ దేశానికే ఆదర్శంగా ఉండేలా పి-4 తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. పేద ప్రజల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు, ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని రూపుమాపడమే పి-4. 2047 నాటికి, మనదేశం వందేళ్ల స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి పేదవాళ్లను ధనికుల్ని చేయడమే పి-4 కాన్సెప్ట్ అని వివరించారు. గతంలో హైదరబాద్ లో 6నెలలు కర్ఫ్యూ ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకే హైదరాబాద్ లో మతకలహాలు కట్టడి చేసింది. పాతబస్తీని బ్రహ్మండంగా అభివృద్ధిచే సింది. ముస్లింలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపింది టీడీపీనే. పెదకూరపాడు చుట్టుపక్కల ఆటోమొబైల్ పరిశ్రమపై ఆధారపడి బతికేవారు ఎక్కువ ఉన్నారని చెప్పారు.
ఆటోమొబైల్ పరిశ్రమపై ఆధారపడిన మెకానిక్ లకు కూడా ఐటీ ఉద్యోగుల మాదిరి ఎక్కువ ఆదాయం, మంచి భవిష్యత్ ఉండేలా చర్యలు తీసుకుంటాము. అరబిక్ పాఠశాలని, గుంటూరు జిల్లాలో ఉర్దూ యూనివర్శిటీ బ్రాంచ్ ను ఏర్పాటుచేస్తాము. ఈ నియోజకవర్గంలో ఆటోనగర్ అవసరముంది. దాన్నికూడా పెట్టిస్తాం. మానవవ నరుల అభివృద్ధి, సాంకేతికతతో ఏదైనా సాధించవచ్చని నిరూపించానన్నారు. మైనారిటీల మనోభావాలు, సమస్యలు తెలుసుకోవడానికి. భవిష్యత్ లో వాటి కోసం సరైన యాక్షన్ ప్లాన్ చేసేందుకే మైనారిటీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. దేశంలో మైనారిటీలను ఎక్కువగా మోసంచేసిన పార్టీ, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభుత్వాలే. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మైనారిటీలకు ఆ పార్టీ, టీడీపీ ప్రభుత్వా లు ఏం చేశాయో మైనారిటీ సోదర, సోదరీమణులు ఆలోచన చేయాలని కోరారు. మైనారిటీ కార్పొరేషన్ తీసుకొచ్చిందే స్వర్గీయ ఎన్టీఆర్.మైనారిటీ కమిషన్ తీసు కొచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. అలానే ఉర్దూని రెండో భాషగా చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలు ఉద్యమాలుచేశారు.
2014లో నేను ముఖ్యమంత్రి అ య్యాక ఏపీలోని 13 జిల్లాల్లో ఉర్దూని రెండో భాషగా ప్రకటించానని మీరు గుర్తుంచుకోవాలి. గతంలో హజ్ యాత్రకు వెళ్లాలంటే ముంబై మీదుగా వెళ్లేవారు. కానీ టీడీపీ ప్రభుత్వం హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టి, అక్కడి నుంచే నేరుగా హజ్ యాత్రకు వెళ్లడా నికి ప్రత్యేక విమానసర్వీసులు నడిపించింది. టీడీపీ, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడే హైదరాబాద్ లో కేంద్రీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. రాష్ట్రవిభజన తర్వాత విజయవాడలో, కడపలో హజ్ హౌస్ లు నిర్మించి, అన్ని సౌకర్యాలు కల్పించింది టీడీపీ ప్రభుత్వమే. కర్నూల్లో ఉర్దూ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసింది కూడా టీడీపీ ప్రభుత్వమే. ముస్లింలలోని పేదలకోసం దుకాన్-మకాన్ పథకం తీసుకొచ్చాము. మైనారిటీల ఆడపిల్లల పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఎలాంటి నిబంధనలు లేకుండా దుల్హన్ పథకం కింద రూ.50వేలు అందించాను అని చంద్రబాబు వివరించారు.
అడ్డగోలు నిబంధనలు
ముస్లిం వధూవరులు ఇద్దరూ 10వ తరగతి చదవి ఉండాలని, రాష్ట్రంలోనే నివసించాలని అప్పుడే దుల్హన్ పథకం వర్తిస్తుందని జగన్ అడ్డగోలు నిబంధనలు తీసుకొచ్చాడు. మరి తన పక్కనుండే సలహాదారులకు ఎందుకని ఎలాంటి నిబంధనలు పెట్టడు? టీడీపీ ప్రభుత్వం రాగానే ఎలాంటి నిబంధనలు లేకుండా, గతంలో మాదిరే దుల్హన్ పథకం అమలు చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా ఇచ్చింది. మరలా సంక్రాంతి పండుగకి సంక్రాంతికానుక ఇచ్చింది. పేదవాళ్లు అందరూ సంతోషంగా పండుగ చేసుకోవాలనే ఆనాడు రెండు కానుకలు ఇచ్చాను. రంజాన్ సందర్భంలో దానాలు చేసేవారు అల్లాకు దగ్గరవుతారని ప్రతీతి. అది కూడా విస్మరించి ఈ జగన్, రంజాన్ తోఫాను తొలగించాడు.
దుల్హన్ పథకానికి డబ్బుల్లేవంటున్న ముఖ్యమంత్రి, తన అసాక్షి పత్రికకు మాత్రం ప్రకటనల రూపంలో 1000 కోట్లు దోచిపెట్టాడు. నాకు పేపర్, టీవీ లేదంటున్న జగన్ సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఎవరబ్బ సొమ్మో చెప్పాలి. ముఖ్యమంత్రి నోరుతెరిస్తే అబద్ధాలే. నష్టాల్లో ఉన్నసాక్షి మీడియాకు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే కాసుల పంట పండింది అని ఆరోపించారు.
ముస్లింలకు రిజర్వేషన్ ఘనత టిడిపిదే
ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. ఊరికే రిజర్వేషన్లు అనిచెప్పి అమలు చేయకుండా గాలికి వదిలేస్తే, దానిపై టీడీపీ ప్రభు త్వం హైకోర్ట్ లో, సుప్రీంకోర్టులో పోరాడింది. ఎంత డబ్బు ఖర్చైనా పరవాలేదు మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని చెప్పాను. మైనారిటీల మనోభావాలను టీడీపీ ప్రభుత్వం గౌరవించింది కాబట్టే 316 దర్గాల మరమ్మతులకు ఆర్థిక సహాయం అందించింది. 1385 మసీదుల నిర్మాణానికి, 43 ఖబరిస్తాన్ లు, 65 ఈద్గాలు, 164 ముస్లిం ప్రార్థనా మందిరాల నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం నిధులిచ్చింది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఇవన్నీచేసినట్టు చంద్రబాబు వివరించారు.
ఇమామ్, మౌజన్ లకు దేశంలోనే తొలిసారి గౌరవవేతనం అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే. ముస్లిం యువతకు విదేశీ విద్య అమలుచేశాం. 567 మంది ముస్లిం యువతీయువకుల్ని ప్రపంచంలోని అన్నిదేశాలకు విద్యాభ్యాసం కోసం పంపిన ఘనత టీడీపీదే. టీడీపీ ప్రభుత్వం రాగానే మరలా ముస్లిం యువతకు విదేశీవిద్య అమలు చేస్తాం. ఉన్నత చదువులు చదువుకోవాలన్న మీ పిల్లలఆశల్ని నిజం చేస్తాం. మసీదు స్థలాలకు పట్టాలులేవని, రూపాయి ఖర్చు లేకుండా వాటిని రిజిస్ట్రేషన్ చేయించాలని కోరారు. మీరు కోరిన దాన్ని మన ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పేదరికంలో మగ్గిపోతున్న ముస్లిం యువతకు, స్వయం ఉపాధి కింద ఒక్కొక్కరికి రూ.3లక్షల రుణం అందించి, రూ.లక్ష సబ్సిడీ అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వా నిదే. అది కూడా జగన్ రాగానే రద్దుచేశాడు.
ముస్లిం మైనారిటీలకు జగన్ రెడ్డి ఒక్క కార్యక్రమమైనా అమలు చేస్తున్నాడా? అని ప్రశ్నించారు. ఇక్కడి ఎమ్మెల్యే వంకర్రావు వ్యవహారశైలి చూశారా? మన బ్యానర్లు, ప్లెక్సీలు, కటౌట్లు తొలగిస్తాడా? ఇసుక దోపిడీలో వంకర్రావు మునిగి తేలుతున్నాడు. మైనారిటీ సోదరుల పై తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు. ప్రశ్నించిన కొమ్మాలపాటి శ్రీధర్ ను మీ ఇళ్లల్లో ఉన్నాడని అరెస్ట్ చేసి లాక్కెళ్లారు అని ధ్వజమెత్తారు. ముస్లిం మైనారిటీలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రానివ్వను. మీ ప్రాణానికి నాప్రాణం అడ్డేస్తాను తప్ప మీకు ఇబ్బంది రానివ్వను. కానీ సరైన సమయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తాడో ఎవరికీ అర్థంకాదు. పిచ్చి తుగ్లక్ కంటే దారుణంగా తయారయ్యాడు. ముస్లింలకు అన్యాయం చేసి, వారి ప్రాణాలు తీస్తూ, వారికి మంత్రి పదవి ఇచ్చానంటే సరిపోతుందా? మీరే చెప్పండి? తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలకు రాజ్యసభ ఇచ్చింది. తన కేసుల మాఫీ కోసం దళారీల కోసం జగన్ రాజ్యసభ పదవి కట్టబెట్టాడు అని విమర్శించారు.
న్యాయస్థానాలే రక్ష
జీవోనెం-1ని సుప్రీంకోర్టు తప్పపట్టింది. న్యాయస్థానాలు లేకపోతే ఈ సైకో మనల్ని బతకనిచ్చేవాడు కాదు. తానే బాబాయ్ ని చంపి, ఆ నేరాన్ని నాపైకి నెట్టాలని చూశా డు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే వీళ్ల దుర్మార్గం ప్రజలకు తెలిసేది కాదు. బాబాయ్ని చంపిన వ్యవహారంలో తాను నిర్దోషినని అవినాశ్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉంది. తండ్రిని చంపిన వారిని శిక్షించడానికి కూతురు పోరాడుతుంటే, ఆమెను వేధిస్తున్నారు. జగన్ కు తనమన అనే తేడా లేదు అని చంద్రబాబు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో మైనారిటీల పై దాడులు నిత్యకృత్యం అయ్యాయి. నరసరావు పేట లో షేక్ ఇబ్రహీంను దారుణంగా చంపారు. మైనారిటీల స్థలాన్ని ఆక్రమించడం పై ప్ర శ్నించడమే ఆయన చేసిన నేరం. రహమత్ అలీని తీవ్రంగా గాయపరిచారు.
పలమ నేరు ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువుతున్న చిన్నారి మిస్బాను బలితీసుకున్నా రు. స్థానిక వైసీపీ నేత సునీల్ తన కూతురు చదువులో ముందుండాలని, ప్రిన్సిపాల్ తో కలిసి మిస్బాను వేధించడంతో, తాను ఆత్మహత్య చేసుకుంది. నంద్యాలలో అబ్దుల్ సలాం.. రాజమహేంద్రవరంలో అబ్దుల్ సత్తార్ ల కుటుంబాల్ని బలి తీసుకుంది ఎవరు? రాయచోటిలో అంగన్ వాడీ టీచర్ అయిన నజీరాపై దేశద్రోహం కేసు పెట్టారు. తల్లిని, బిడ్డను కాపాడుకోవడానికి తనకు అంగన్ వాడీ ఉద్యోగమే దిక్కని చెప్పినా వినకుండా ఆమెను వేధించారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ రెడ్డి ఓదార్పు యాత్ర ఏమైంది. ఎంతోమంది మైనారిటీలు ప్రాణాలు కోల్పోతే, ఒక్క కుటుంబాన్ని అయినా పరామర్శించాడా? మాచర్ల నియోజకవర్గం ఆత్మకూరులోని 100 ముస్లిం కుటుంబా లు ఊరు విడిచి రావడానికి అక్కడి ఎమ్మెల్యేనే కారణం. గురజాల నియోజకవర్గంలో ముస్లిం బాలికపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు అత్యాచారం చేస్తే ఎవరిపైనా ఎలాంటి చర్యలు లేవు. పెదకూరపాడులో రంజాన్ మాసంలో ముస్లింల ఇళ్లలో పోలీసులు చొరబడటం ఏమిటి? మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ ఏమైనా టెర్రరిస్టా డెకాయిట్టా? ఆయన్ని వెతికే నెపంతో మీ ఇళ్లల్లోకి పోలీసుల్ని పంపడం సైకోపాలన కాక ఏమిటి? అని ప్రశ్నించారు.