- డీపీది అభివృద్ధి ముద్ర వైసీపీది రక్తపు మరక
- కుప్పానికి నీళ్లంటూ జగన్ నోట అబద్ధాల వరద
- పులివెందులలో ఎండిపోతున్న పైర్లకు నీళ్లివ్వలేని సీఎం కుప్పానికి మేలు చేస్తాడా?
- 13 శాతం కాలువ పనుల పూర్తికి 5 ఏళ్లు తీసుకున్న జగన్ కుప్పాన్ని ఉద్ధరిస్తాడా?
- దేశంలో మోడల్ నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ వచ్చాక హింసా రాజకీయాలు
- ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు రాయలేని ప్రభుత్వం… సాగునీటి ప్రాజెక్టులు కడుతుందా?
- హత్యా రాజకీయలపై జగన్ మాట్లాడటమా?
- బాబాయిని చంపిందెవరో చెప్పు
- జగన్‌రెడ్డిపై మండిపడ్డ చంద్రబాబు
అమరావతి: కుప్పంలో అభివృద్ధి ముద్ర తెలుగు దేశానిది అయితే… వైసీపీది రక్తపు మరక అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. దేశంలోనే కుప్పం ఒక మోడల్ నియోజకవర్గం…జగన్ దాన్నీ నాశనం చేయాలని చూశాడన్నారు. జగన్ సీఏం అయ్యాకే ప్రశాంతమైన కుప్పంలో హింసా రాజకీయా లు, సహజవనరుల దోపిడీ మొదలైందని మండిపడ్డా రు. పులివెందులకు నీళ్లు ఇవ్వలేని జగన్ కుప్పానికి నీళ్లు తెచ్చాను అంటూ షో చేశాడని విమర్శించారు. కుప్పంకు 672కి.మీ. నుండి కృష్ణా జలాలు తానే తెచ్చి నట్టు చెప్పడం జగన్ అబద్ధాలకు పరాకాష్ట అన్నారు. 13 శాతం కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తికి 5 ఏళ్లు తీసుకున్న జగన్… తానో అపర భగీరథుడిని అనేలా డైలాగ్‌లు కొడుతున్నాడన్నారు.ఎన్నికల ముందు డ్రామాలు చేస్తున్నాడని, కాలువలో చెంబుడు నీళ్లు పెట్టి ఫొటోలు దిగేందుకు పడిన ప్రయాసతో జగన్ నవ్వుల పాలు అయ్యాడని ఎద్దేశా చేశారు. కుప్పం బ్రాంచి కాలువకు టీడీపీ రూ.400 కోట్లకుపైగా ఖర్చు చేసి 87 శాతం పనులు పూర్తి చేస్తే..జగన్ రూ.30కోట్లు ఖర్చు చేసి కేవలం 10శాతం పనులు మాత్రమే పూర్తి చేశా రన్నాని చంద్రబాబు చెప్పారు.
సీమ ప్రజలే సమాధి కడతారు
రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి టీడీపీ 5ఏళ్ల పాలనలో రూ.12,500కోట్లు ఖర్చు చేయ గా జగన్ ప్రభుత్వం ఇప్పటికి ఖర్చు చేసింది రూ.2వేల కోట్లు మాత్రమే అని వివరించారు. సాగునీటి రంగంపై జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు. పులివెందులకు నీళ్లివ్వలేక పంటలు ఎండబెట్టిన జగన్… కుప్పంలో నీళ్లంటూ షో చేస్తున్నా డన్నారు. సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కోట్టుకు పోతే బాధితులను ఆదుకోని నువ్వు కుప్పాన్ని ఉద్దరి స్తావా అని ప్రశ్నించారు. ఇప్పుడు రిజర్వాయర్లు కడతా ను అని చెపుతున్న జగన్… 5 ఏళ్లు ఏం పొడిచాడని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు రాయ లేని జగన్… ప్రాజెక్టులు కడతాను… నీళ్లు ఇచ్చాను అంటే జనం నమ్ముతారా అని నిలదీశారు. జగన్ ప్రాజె క్టులు కట్టడం కాదు… వైసీపీ ప్రభుత్వం సాగునీటి రంగంలో చేసిన ద్రోహానికి ఆ పార్టీకి సీమ ప్రజలే సమాధి కట్టబోతున్నారన్నారు. సాగునీటి రంగంలో నాడు-నేడు జరిగిన పనులపై శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఏ ప్రాజెక్టు పై అయినా చర్చకు టీడీపీ సిద్ధం అని సవాల్ విసిరారు. జగన్ సొంత జిల్లా లో ఇసుక మాఫియాకు అన్నమయ్య డ్యాం కొట్టుకు పోయి 42 మంది ప్రాణాలు కోల్పోయారని, పింఛా ప్రాజెక్టు దెబ్బతిందన్నారు. అన్నమయ్య డ్యామ్ బాధితు లకు జగన్ కనీసం ఇళ్లు కూడా కట్టించి ఇవ్వలేదని చంద్రబాబు దుయ్యబట్టారు.
కులాల కుంపట్లతో నీచ రాజకీయాలు
బాబాయి వివేకా హత్య విషయంలో అయిదేళ్లుగా సమాధానం చెప్పలేని జగన్ హత్యా రాజకీయాల గురించి కుప్పం వెళ్లి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ-జనసేన పొత్తుతో జగన్‌రెడ్డికి వణుకు, భయం మొదలయిందని.. అందుకే కులాల కుంపట్లను రాజేసి నీచ రాజకీయాలకు ప్రయత్నిస్తున్నా డని విమర్శించారు. అసత్య ప్రచారాలతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని, ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన పై అన్నివర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంద న్నారు. దీన్ని చెడగొట్టేందుకు ఫేక్ ప్రచారం ద్వారా సోషల్ మీడియా,అనుకూల మీడియాలో తప్పుడు ప్రచా రం చేస్తూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడ న్నారు. జగన్ ప్రయత్నాలన్నీ పగటి కలలుగా మిగిలి పోతాయని చంద్రబాబు స్పష్టం చేశారు.