చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తెలుగు వారి జీవితాల్లో నవశకం రావాలి…తెలుగు జాతి నెంబర్‌ 1 కావాలి

బెంగళూరు టీడీపీ ఫోరం సమావేశంలో అధినేత చంద్రబాబు పిలుపు

by చైతన్యరధం
Dec 29, 2023 at 8:54am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తెలుగు వారి జీవితాల్లో నవశకం రావాలి…తెలుగు జాతి నెంబర్‌ 1 కావాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • థింక్‌ గ్లోబల్లీ..యాక్ట్‌ గ్లోబల్లీ అనేది కొత్త నినాదం
  • ఐటీ, విజన్‌ 2020 అంటే అప్పట్టో ఎగతాళి చేశారు
  • వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి
  • దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్ధాయికి ఎదగాలి
  • తెలుగువారు ఎక్కడున్నా ఎన్నికల సమయంలో రాష్ట్రం కోసం అడుగు వేయాలి
  • బెంగళూరు టీడీపీ ఫోరం సమావేశంలో అధినేత చంద్రబాబు పిలుపు

బెంగళూరు: నవశకం తెలుగువారి సొంతం కావాలని, తెలుగుజాతి నంబర్‌ వన్‌ గా ఉండాలనేదే తన విజన్‌ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో థింక్‌ గ్లోబల్లీ….యాక్ట్‌ లోకల్లీ ఉండేదని..కానీ ఇప్పుడు థింక్‌ గ్లోబల్లీ..యాక్ట్‌ గ్లోబల్లీ అనేది తన కొత్త నినాదమని పేర్కొన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటనకు వెళ్లేందుకు బెంగుళూరు ఎయిర్‌ పోర్ట్‌ కు వచ్చిన చంద్రబాబు….ఇక్కడ జరిగిన బెంగుళూరు టీడీపీ ఫోరం మీటింగ్‌ లో పాల్గొన్నారు. ఎయిర్‌ పోర్టు వద్ద చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కెఎమ్‌ఎమ్‌ కన్వెన్షన్‌ హాలుకు చేరుకున్న చంద్రబాబు.. టీడీపీ బెంగళూరు ఫోరం సభ్యులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, తర్వాత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…పార్టీలో మేము అన్ని రంగాల వింగ్‌ లు ఏర్పాటు చేశాం కానీ…మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బెంగళూరు ఫోరం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. మీలో యువశక్తి కనబడుతోంది..భవిష్యత్‌ మీదే. నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా మీరు అండగా నిలబడ్డారో ఇప్పుడు మీ ఉత్సాహం చూస్తే కనిపిస్తోంది. నేను చేసిన మంచి పనులు వల్ల నాకు మద్దతుగా 70 దేశాల్లో ఉన్న తెలుగువారు గుర్తు పెట్టుకుని ముందుకొచ్చి సంఫీుభావం తెలిపారు. అందుకు మనస్ఫూర్తిగా ధన్యావాదాలు, అభినందలు చెప్తున్నా. తెలుగు వారంటే గతంలో ఏపీకి మాత్రమే పరిమితం. కానీ నేడు తెలుగువారు ఏపీ, తెలంగాణలోనే కాకుండా చెన్నై, బెంగళూరు ఇలా ఏ సిటీకి వెళ్లినా మన వాళ్ల ప్రతిభ కనిపిస్తుంది. ఇది ఎంతో గర్వ కారణమని చంద్రబాబు అన్నారు.

ప్రతి ముగ్గురు ఐటీ ప్రొఫెషనల్స్‌ లో ఒక తెలుగువాడు
మన దేశంలోనే కాదు..ప్రపంచం మొత్తంలో తెలుగు వారు విస్తరిస్తున్నారు. ఏ దేశానికి వెళ్లినా ప్రముఖ స్థానాల్లో మన తెలుగు వారు ఉండటం సంతోషంగా ఉంది. నేను సీఎం అయిన తొలిరోజుల్లో తెలుగు వాళ్లు అప్పటిదాకా ఎక్కువగా వ్యవసాయం చేస్తూ, వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్‌ ఎందుకు కాకూడు, ఒక కూలీ చేసుకునే వ్యక్తి తన కొడుకుని ఐటీ ప్రొఫెషనల్‌ ఎందుకు చేయకూడదు అని ఆలోచించాను. అందుకే నాలెడ్జ్‌ ఎకానమీకి శ్రీకారం చుట్టా. అదే ఐటీ. ఎడ్ల బండ్ల నుండి డ్రైవర్‌ లెస్‌ కార్ల దాకా టెక్నాలజీ వచ్చింది. అభివృద్ధిలో చాలా ముందుకు వెళ్తున్నాం. నాడు నేను ఐటీనీ ప్రారంభించినప్పడు ఎగతాళి చేశారు. గతంలో ఐటీ అంటే బెంగళూరు మాత్రమే ఉండేది..కానీ బెంగళూరుతో పోటీపడి హైదరాబాద్‌ ఉండాలని, నాలెడ్జ్‌ ఎకానమీతో హైదరాబాద్‌ ను ప్రపంచం పటంలోనే నిలబెట్టాం. ప్రతి ముగ్గురు ఐటీ ప్రొఫెషనల్స్‌లో మన తెలుగువారు ఒకరున్నారు. నాలెడ్జ్‌ ఎకానమీలో ప్రపంచంలోనే ముందకు వెళ్తున్నాం. ఫార్మారంగం, బయో టెక్నాలజీతో పాటు ఏ సెక్టార్‌ తీసుకున్నా నాలెడ్జ్‌ ఎకానమీ కి ఎప్పుడూ ఐటీ బ్యాక్‌ బోన్‌ గా తయారైంది. ఉద్యోగాలు చేయడం కాదు..మీరు ఉద్యోగాలు ఇవ్వాలనేదే నా ఆకాంక్ష. ప్రపంచంలో ఏ దేశానికెళ్లినా మన వాళ్లు ఉద్యోగాలు చేస్తూ పెట్టుబడులు పెట్టి స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో అగ్రస్థానంలోనే తెలుగు జాతి ఉండాలి. లోకేషన్‌ అనేది ఈ రోజుల్లో సమస్య కాదు..ఎక్కడున్నా నాలెడ్జ్‌ ఉంటే ప్రపంచం మొత్తం సేవలందించే నెట్‌ వర్క్‌ అందించే శక్తి తెలుగువారికి ఉంది. దేశానికి మంచి ఆస్తిగా టెక్నాలజీని అందించాలనేది నా ఆశ. సంస్కరణల వల్ల దేశానికి సంపద సృష్టించే అవకాశం వచ్చిందని చంద్రబాబు అన్నారు
.
2047 నాటికి ప్రపంచంలోనే అగ్రగామిగా మనదేశం
2047 నాటికి ప్రపంచానికి నాయకత్వం వహించేది మన భారతదేశమే. నేను విజన్‌ 2020 అంటే ఆనాడు ఎగతాళి చేశారు..నన్ను 420 అని కూడా విమర్శించారు. ఆ 2020 విజన్‌ తో అసోషియేట్‌ అయిన వాళ్లు నేడు బ్రహ్మాండంగా ముందుకు వచ్చారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశం అగ్రదేశంగా, అభివృధ్ధి చెందిన దేశంగా నెంబర్‌ వన్‌ స్థాయిలో ఉంటుంది. దేశంతో పాటు మన రాష్ట్రాన్ని కూడా మనం కాపాడుకోవాలి.. ఆ బాధ్యత తెలుగు వాళ్లు ఎక్కడున్నా వారిపై ఉంది. రాష్ట్రం కోసం నేను పోరాడతా..కానీ దానికి మీ సహకారం కావాలి. దేశానికి పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు వచ్చాక దశ,దిశ మారింది. ఐటీని ప్రొమోట్‌ చేయాలని పబ్లిక్‌ పాలసీ తీసుకొచ్చాం. రోడ్లు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి వాటిపై పబ్లిక్‌ పాలసీ ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలి. 21వ శతాబ్దం నాలెడ్జ్‌ ఎకానమీకి నాంది. 2047 నాటికి మనదేశం అగ్రగామిగా మారుతుందంటే అది దేశానికి దక్కే అరుదైన గౌరవం. గతంలో ఆడపిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు శ్రద్ధ చూపించేవారు కాదు..ఎంతోకొంత చదివించి పెళ్లి చేసి పంపించేవారు. అందుకే నాడు ఆలోచించా… ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు పెట్టి ప్రోత్సహించాం. ఆడపిల్లలు ఎంత మంచిగా చదువుకుంటే సమాజానికి అంత మంచిందని ఆలోచించానని చంద్రబాబు చెప్పారు.

సంబంధితవార్తలు

వైసీపీకి మేలు చేసేందుకే క్రానికల్‌ తప్పుడు కథనం

ప్రజాదర్బార్‌’తో లోకేష్‌ నూతన ఒరవడి!

సామాన్యులకు అండగా లోకేష్‌ ‘ప్రజాదర్బార్‌’

మీరే ఉద్యోగాలిచ్చే స్థాయికి వెళ్లాలి
ఏ కులమైనా, ఏ మతమైనా మన దేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. ఇంటికి వస్తే కష్టాలు మరిచి కుటుంబాన్ని చూసి మళ్లీ పునరుత్తేజం అయ్యే సంస్కృతి మన దేశంలో మాత్రమే ఉంది. ఇప్పుడు ఏపీలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. పబ్లిక్‌ ` ప్రైవేట్‌ పార్టనర్‌ షిప్‌ (పీపీపీ) విధానం ఉండాలని సంకల్పించాను. ఫ్లైఓవర్లు, రోడ్లు, ఎయిర్‌ పోర్టులు వచ్చింది కూడా పీపీపీ మోడల్‌ లోనే. ఈ విధానం వల్ల సంపద బాగా పెరిగింది. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత ఆశయం. పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్‌ పార్టనర్‌ షిప్‌ పాలసీ ద్వారా సంపద సృష్టించే విధానం రావాలి. ఆ వ్యవస్థకు నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నా. మీరే కాదు..మీతో సమానంగా మీ పక్క కుటుంబం పైకి రావాలి. మీ శక్తికి తగ్గట్టుగా కుటుంబాలను పైకి తీసుకొస్తే మన జన్మ సార్థకం అవుతుంది. ప్రజలను, జనాభాను ఆస్తిగా భావించి ప్రణాళిక సిద్ధం చేస్తే వారి నుండి పేదరికాన్ని తరిమేయవచ్చు. నేను సాధారణ కుటుంబంలో పుట్టాను. నేను చదువుకునే రోజుల్లో మా ఊరికి రోడ్డు లేదు..విద్యుత్‌ లేదు. అప్పటి కంటే ఇప్పటి పరిస్థితులు బెటరని చంద్రబాబు అన్నారు.
తెలుగుజాతి రుణం తీర్చుకుంటా
బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు నేటి నుండి ఒక వందరోజుల ప్రణాళిక తయారు చేసుకోవాలి. మీ భవిష్యత్తుతో పాటు ఏపీ భవిష్యత్తు ను తీర్చిదిద్దే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలి. షార్ట్‌ టర్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌ ద్వారా ఏం చేయగలుగుతారో ముందే ఆలోచించుకోండి. మీ గ్రామాలకు వెళ్లి ప్రజలను చైతన్యపరచాలి. విద్యార్థి నాయకుడిగా ఉండి కూడా నేను మొదటిసారి ఎమ్మెల్యే అయింది యువత వల్లనే. మీరు పబ్లిక్‌ పాలసీ ద్వారా ఎలా బాగుపడ్డారో మీ గ్రామాల్లోని ప్రజలకు చెప్పాలి. రోజుకు ఒక గంట మీరు ఇతరులతో ఫోనులో మాట్లాడాలి..ఎన్నికలు రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమో వివరించాలి. మనం ఫోన్‌ ద్వారా కనీసం పది మందిని మార్చగలిగితే పార్టీకి, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఎన్నికలొచ్చినప్పుడు ఊర్లకు ఎవరెళ్తారు అనుకోకుండా 10 రోజులు సెలవు పెట్టివెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి. అవసరం అయితే ఇప్పటి నుండే సంపాదించిన డబ్బుల్లో కొంత ఛారిటీకి ఖర్చు పెట్టండి..రాజకీయాలకు ఖర్చు పెట్టండి..ప్రజల కోసం గ్రామానికి ఖర్చు పెట్టండి. మనిషికి వెయ్యి వేసుకున్నా లక్షల్లో పోగేయవచ్చు..ఆ డబ్బులతో మంచి పనులు చేస్తే ప్రజలు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు..మీరు సూచించిన పార్టీకి ఓట్లేస్తారు. నాకు పదవులు, డబ్బులు, లగ్జరీ జీవితం అవసరం లేదు. నేనేం చేశానో తర్వాత తరాలు గుర్తుంచుకోవాలనే పని చేస్తున్నా. కులం, మతం, ప్రాంతం లేదు..నా ధ్యాస అంతా తెలుగు జాతిపైనే. ఒకే కులం తెలుగు, ఒకే మతం తెలుగు..ఒకే ప్రాంతం తెలుగు..మన గడ్డ తెలుగు గడ్డ మాత్రమే. మన మేధోసంపత్తితో తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలి. ప్రపంచమే హద్దుగా తెలుగుజాతి ఎదగాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

Tags: ఐటీచంద్రబాబుటీడీపీ ఫోరం సమావేశంతెలుగు జాతితెలుగు వారి జీవితాలుథింక్‌ గ్లోబల్లీనవశకం రావాలినెంబర్‌ 1 కావాలిబెంగళూరుయాక్ట్‌ గ్లోబల్లీవిజన్‌ 2020విదేశాల్లో ఉద్యోగాలు
Previous Post

విజయకాంత్‌ సేవలు చిరస్మరణీయం

Next Post

నానాటికీ దిగజారుతున్న డీజీపీ తీరు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-02-2026

కార్యకర్త
@ February 1, 2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-01-2026

కార్యకర్త
@ January 31, 2026
కాకినాడ జేఎన్‌టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

కాకినాడ జేఎన్‌టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ January 31, 2026
అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

చైతన్యరధం
@ January 31, 2026
ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

చైతన్యరధం
@ January 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-01-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-01-2026

కార్యకర్త
@ January 30, 2026
కల్తీనెయ్యిపై అసెంబ్లీలో చర్చిద్దాం
ఆంధ్రప్రదేశ్

కల్తీనెయ్యిపై అసెంబ్లీలో చర్చిద్దాం

చైతన్యరధం
@ January 30, 2026
కల్తీ నెయ్యి కుట్రదారులను వదిలేదే లేదు
ఆంధ్రప్రదేశ్

కల్తీ నెయ్యి కుట్రదారులను వదిలేదే లేదు

చైతన్యరధం
@ January 30, 2026
Load More

ముఖ్య వార్తలు

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

చైతన్యరధం
@ January 31, 2026
ప్రాజెక్ట ల  పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

ప్రాజెక్ట ల పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

చైతన్యరధం
@ January 30, 2026
ఏపీ క్యాబినెట్ల్ లో 35 అంశాలకు ఆమోదం

ఏపీ క్యాబినెట్ల్ లో 35 అంశాలకు ఆమోదం

చైతన్యరధం
@ January 29, 2026
రైల్వే ప్రాజెక్టుల్లో ఏపీ బెంచ్ మార్క్ కావాలి

రైల్వే ప్రాజెక్టుల్లో ఏపీ బెంచ్ మార్క్ కావాలి

చైతన్యరధం
@ January 29, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కాకినాడ జేఎన్‌టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

కాకినాడ జేఎన్‌టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ January 31, 2026
అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

చైతన్యరధం
@ January 31, 2026
ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

చైతన్యరధం
@ January 31, 2026
కల్తీనెయ్యిపై అసెంబ్లీలో చర్చిద్దాం

కల్తీనెయ్యిపై అసెంబ్లీలో చర్చిద్దాం

చైతన్యరధం
@ January 30, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist