చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం

హెరిటేజ్ అంటే.. ప్రజల నమ్మకానికి నిలువుటద్దమని వ్యాఖ్య

by చైతన్యరధం
Feb 14, 2026 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసీపీ కుట్ర రాజకీయాలను మానుకోవాలి
  • కట్టుకథల ప్రచురణ సాక్షి విజ్ఞతకే వదిలేస్తున్నాం
  • మీ షెల్ కంపెనీల బాగోతం ప్రపంచం మొత్తానికి తెలుసు
  • స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు ఆగ్రహం
  • హెరిటేజ్ అంటే.. ప్రజల నమ్మకానికి నిలువుటద్దమని వ్యాఖ్య

మంగళగిరి (చైతన్య రథం): హెరిటేజ్ ఫుడ్స్‌పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, కల్పిత కథలతో కూడినవేనని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ పి కుటుంబరావు ఖండించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక పత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా ఫిక్షన్ రైటింగ్ తప్ప వాస్తవాలు లేవన్నారు. ప్రజలు చదివేది నిజమా కాదా అన్న కనీస బాధ్యత లేకుండా వార్తలు వండివార్చడం బాధాకరమన్నారు. “హెరిటేజ్ సంస్థ తన చరిత్రలో ఎప్పుడూ ఏ ప్రభుత్వానికీ, ఏ దేవాలయానికీ లేదా ఏ ఇతర కంపెనీకి నెయ్యిని సరఫరా చేయలేదు. హెరిటేజ్ కేవలం తన సొంత బ్రాండ్‌తో నేరుగా మార్కెట్లో వినియోగదారులకు మాత్రమే నెయ్యిని అమ్ముతుంది.

లేని సరఫరాని ఉన్నట్టుగా చూపించడం సాక్షి పత్రిక విజ్ఞతకే వదిలేస్తున్నాం. హెరిటేజ్ వెబ్‌సైట్ నుంచి ఒక ఫోటోను తీసుకుని, అందులో ఒక కాలమ్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగించి సాక్షి కుట్ర కథనాన్ని ప్రచురించింది. ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ సంస్థకు కేవలం ఒక ‘కో-మాన్యుఫ్యాక్చరింగ’ లొకేషన్ మాత్రమే. అక్కడ కేవలం స్కిమ్డ్ మిల్క్ పౌడర్, చీజ్, పన్నీర్‌వంటివి మాత్రమే తయారవుతాయి. అక్కడ నెయ్యి తయారీ అసలు జరగదు. ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. హెరిటేజ్‌కు 22 యూనిట్లు ఉన్నాయని సాక్షి రాసింది. కానీ వాస్తవానికి ఉన్నవి 15 సొంత యూనిట్లు మాత్రమే. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడులో విస్తరించి ఉన్నాయి. వీటి వివరాలన్నీ సంస్థ వెబ్‌సైట్‌లో అత్యంత పారదర్శకంగా ఉన్నాయి. ఇందాపూర్ డైరీ (సోనాయ) అనేది దేశంలోనే అతిపెద్ద డైరీలలో ఒకటి. ఆసియాలోనే అతిపెద్ద స్ప్రే డ్రయర్ ప్లాంట్ వీరి సొంతం. బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్, పతంజలివంటి అంతర్జాతీయ కంపెనీలే వీరి కస్టమర్లు. ఇలాంటి దిగ్గజ సంస్థను తక్కువ చేసి చూపుతూ సిండికేట్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం” అన్నారు.

సంబంధితవార్తలు

తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలి

ఒక నిజాయితీ.. ఒక హెరిటేజ్

రాష్ట్రానికి ప్రథమ స్థానం..వేధింపులు, అక్రమ కేసుల్లోనే!

నెయ్యి ధరల విశ్లేషణ
“ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా నెయ్యి ధరలు పెరిగాయనే కనీస జ్ఞానం సాక్షి పత్రికకు లేదు. 2014-19 మధ్య మార్కెట్ ధర రూ260 – రూ.400 లోపు ఉంది. 2020-22 మధ్య ధర రూ.600 `రూ.650కి పెరిగింది. 2026 (ప్రస్తుతం) రూ.600 నుండి రూ.750 వరకూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారమే ధరలు పెరుగుతుంటే, అప్పట్లో తక్కువ ధరకు ఇచ్చిన పాత రేట్లను ఇప్పుడు ఎక్కువ ధరకు కోట్ చేస్తున్నారని చెప్పడం కేవలం రాజకీయ కుట్ర. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2020-22 మధ్య కాలంలో దేశంలో నెయ్యి ధర రూ.600 నుండి రూ.650 మధ్య ఉంది. కానీ కొన్ని సంస్థలు (ఏఆర్ డైరీ వంటివి) కేవలం రూ.360కే టీటీడీకి సరఫరా చేశాయంటే, అది ఎంత నాణ్యత లేని ‘సింతటిక్ నెయ్యి’ అయి ఉంటుందో ప్రజలే ఆలోచించాలి. తక్కువ ధరకే ఇస్తున్నారంటే అది గొప్పతనం కాదు.

భక్తుల నమ్మకంతో ఆడుకోవడమే. 10 ఏళ్ల క్రితం రూ.300 ఉన్న వస్తువు ఈరోజు కూడా అదే ధరకు ఎలా వస్తుంది? పదేళ్లలో టూత్ బ్రష్‌నుంచి వాడే సబ్బు వరకు అన్నిటి ధరలు పెరిగాయి. నెయ్యి ధర కూడా 2026 నాటికి రూ.750కి చేరింది. ఇందాపూర్ డైరీ అప్పట్లో రూ.300కి ఇచ్చి, ఇప్పుడు రూ.658 కోట్ చేసిందంటే అది పెరిగిన ఉత్పత్తి ఖర్చుల వల్లే. దీనిని దోపిడీగా చిత్రీకరించడం అజ్ఞానమే” అని వైసీపీ కుట్ర కథనాలపై కుటుంబరావు దుమ్మెత్తిపోశారు. “సాక్షి యజమాని జగన్ మోహన్‌రెడ్డి సొంత సంస్థ భారతీ సిమెంట్ 2014లో బస్తా రూ.250కి అమ్మితే, ఈరోజు రూ.430కి ఎందుకు అమ్ముతున్నారు? మీ ఖర్చులు పెరిగినప్పుడు రేటు పెంచడం తప్పు కానప్పుడు, డైరీ రంగంలో రేట్లు పెరగడం తప్పు ఎలా అవుతుంది? హెరిటేజ్ సంస్థకు టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అలవాటే లేదు. అలాంటప్పుడు సిండికేట్ ఎందుకు ఫామ్ చేస్తుంది? నిజానికి 2019-24 మధ్య సిమెంట్ ధరలను కార్టెల్‌గా మార్చి దోచుకున్నది ఎవరో అందరికీ తెలుసు. నష్టాల్లో ఉన్న సాక్షి పత్రికకు ప్రభుత్వ ప్రకటనల ద్వారా ప్రజా ధనాన్ని మళ్లించి రూ.600 కోట్లకుపైగా ఎలా దోచుకున్నారో బ్యాలెన్స్ షీట్లు చూస్తే అర్థమవుతుంది.

దేశంలో సాక్షికంటే 5 రెట్లు పెద్దవైన దైనిక్ జాగరణ్, దైనిక్ భాస్కర్ వంటి పత్రికల మార్కెట్ క్యాప్ రూ.1500 కోట్లే ఉంటే, 2008లోనే సాక్షికి రూ.3500 కోట్ల వాల్యుయేషన్ ఎలా వచ్చింది? ఇది క్విడ్ ప్రో కో కాదా? మనీ లాండరింగ్, షెల్ కంపెనీల ద్వారా వ్యాపారాలు చేసేవారికి, నిజాయితీగా వ్యాపారం చేసే హెరిటేజ్ వంటి లిస్టెడ్ కంపెనీల విలువ తెలియదు. సాక్షి ఓనర్ పార్టీలోనే డైరీ వ్యాపారం చేసే నాయకులు బొల్లా బ్రహ్మనాయుడు వంటివారున్నారు. గతంలో తిరుమల డైరీని మల్టీనేషనల్ కంపెనీకి అమ్మేసి, ఇప్పుడు ‘వల్లభ’ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఈరోజు మార్కెట్‌లో తిరుమల, వల్లభ నెయ్యి ధరలు లీటరుకు రూ.600 నుండి రూ.675 వరకు ఉన్నాయి. మీ నాయకుల కంపెనీలే ఈ రేట్లకు అమ్ముతుంటే, హెరిటేజ్‌పై అవాస్తవాలు ప్రచురించడం మీ ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా?” అని కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

“హెరిటేజ్ అంటే కేవలం ఒక వ్యాపార సంస్థ కాదు. అది నమ్మకానికి నిలువుటద్దం. ఇటీవల భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి ‘గోల్డెన్ పీకాక’ అవార్డు లభించింది. ఒక దక్షిణ భారత పారిశ్రామికవేత్తకు ఇలాంటి అత్యున్నత పురస్కారం రావడం గర్వకారణం. ఇది ఒక లిస్టెడ్ కంపెనీ. ప్రభుత్వానికి సకాలంలో పన్నులు కట్టడంలోనూ, బ్యాంకుల అప్పులు తీర్చడంలోనూ ఈ సంస్థకు క్లీన్ రికార్డ్ ఉంది. పాలుపోసే వేలాదిమంది రైతులకు ఒక్క రూపాయి కూడా బాకీ పడకుండా ‘జీరో డ్యూస’ మెయింటైన్ చేస్తున్న ఏకైక సంస్థ హెరిటేజ్. గత 20 ఏళ్లుగా ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి ఏడాదికి సగటున 20-25శాతం లాభం అందించిన చరిత్ర దీనిది. 2008లో కేవలం రూ.500 కోట్ల విలువలేని కంపెనీకి రూ.3500 కోట్ల వాల్యుయేషన్ కట్టి క్విడ్ ప్రో కో ద్వారా నిధులు రాబట్టింది నిజం కాదా? గత ఐదేళ్లలో వందల కోట్ల ప్రభుత్వ ప్రకటనల ద్వారా సాక్షిని ఎలా పోషించారో అందరికీ తెలుసు.

అధికారం పోగానే మీ బ్యాలెన్స్ షీట్లలో కోట్ల నష్టాలు ఎలా వస్తున్నాయి? మనీ లాండరింగ్, షెల్ కంపెనీల ఆరోపణలతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు.. నీతిగా వ్యాపారం చేసేవారిని విమర్శించడం హాస్యాస్పదం. అవాస్తవాలు రాస్తూ ఇప్పటికే పరువు నష్టం కేసుల్లో ఇరుక్కున్న సాక్షి యాజమాన్యానికి ఇదే హెచ్చరిక. మీ అలమారాలో ఉన్న అస్థిపంజరాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జైలు గడపకు మీరు ఎంతో దూరంలో లేరు” అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అబద్ధపు రాతలు రాసే పత్రికలను నమ్మొద్దని, వాస్తవాలను ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఇలాంటి దిగజారుడు కథనాలను పూర్తిగా విస్మరించాలని కుటుంబరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags: కుటుంబరావుపీ-4 ఛైర్మన్పీ4 ఫౌండేషన్హెరిటేజ్‌
Previous Post

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

Next Post

ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

కార్యకర్త
@ March 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026

కార్యకర్త
@ March 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

కార్యకర్త
@ March 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-03-2026

కార్యకర్త
@ March 27, 2026
ఏలూరు జిల్లా పురోగతిపై
ఆంధ్రప్రదేశ్

ఏలూరు జిల్లా పురోగతిపై

చైతన్యరధం
@ March 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-03-2026

కార్యకర్త
@ March 26, 2026
పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్

పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం

చైతన్యరధం
@ March 26, 2026
కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ

చైతన్యరధం
@ March 26, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఏలూరు జిల్లా పురోగతిపై

ఏలూరు జిల్లా పురోగతిపై

చైతన్యరధం
@ March 26, 2026
పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం

పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం

చైతన్యరధం
@ March 26, 2026
కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ

కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ

చైతన్యరధం
@ March 26, 2026
శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు

శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు

చైతన్యరధం
@ March 26, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist